Biggest Indian Film Ever With Prabhas and Hrithik Roshan: ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇప్పటివరకు భారీ బడ్జెట్ తో, తెరకెక్కించిన భారీ సినిమా ఏది అంటే ఎవరూ పెద్దగా ఆలోచించకుండా చెప్పేసే సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లో ప్రధాన పాత్ర పోషించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో కొంతమంది హాలీవుడ్ నటీనటులు కూడా కనిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ తర్వాత కేజిఎఫ్ పార్ట్ 2 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలను తలదన్నే విధంగా ఒక భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. హృతిక్ రోషన్, ప్రభాస్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాని అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా ధృవీకరణ లభించినా ఇంకా ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సిద్ధార్థ ఆనంద్.


దాదాపు నాలుగుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాదు బాక్స్ ఆఫీస్ వసూళ్ల విషయంలో కూడా తగ్గేదే లేదు అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్, హృతిక్ రోషన్లతో ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


అయితే ఇది స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చే సినిమా కాదని ఇది వేరే సబ్జెక్టుతో తెరకెక్కుతుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత హీరోయిన్లు అలాగే ఇతర నటీనటుల విషయాలు కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వరుస హిట్లతో దూసుకు పోతోంది. మరోపక్క పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ కూడా ఒక పఠాన్ లాంటి సూపర్ హిట్ అందుకుని ముందుకు దూసుకు వెళుతున్న క్రమంలో ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పక తప్పదు.
Also Read: Chiranjeevi Movie : ధమాకా డైరెక్టర్ కు బంపర్ ఛాన్స్..ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా?


Also Read: Taraka Ratna Health Update Latest: నా గుండె పగిలిపోయింది..నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook