Megastar Chiranjeevi Movie with Trinadh Rao Nakkina: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని బాబీ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.
భోళాశంకర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గతంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించారు. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని అప్పట్లో ప్రకటించారు. కానీ తర్వాత ఎందుకు చిరంజీవి ఈ సినిమాను పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో కాంబినేషన్ తెర మీదకు వచ్చింది.
ఇటీవల ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రినాధ రావు నక్కిన మెగాస్టార్ చిరంజీవికి ఒక కథ చెప్పారని ఆ కథ బాగా నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి ఆ కథతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే వెంకీ కుడుముల సబ్జెక్ట్ పక్కన పెట్టాక డివివి దానయ్య త్రినాధరావు మెక్కిన సినిమా చేయబోతున్నారా లేక వెంకీ కుడుముల సబ్జెక్టు ఉండగానే మరో సినిమా కూడా దీవి దానయ్య ప్రకటిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన ధమాకా సినిమా డిసెంబర్ నెలలో విడుదలయి సూపర్ హిట్ అందుకుంది. 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి రవితేజకు సూపర్ హిట్ అందించింది.
Also Read: Raviteja Fans on Chiranjeevi: రవితేజ చిన్న హీరోనా? చిరుపై ఫాన్స్ ఫైర్!
Also Read: Taraka Ratna Health Update Latest: నా గుండె పగిలిపోయింది..నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook