Bimbisara 4 Days Collections: గత శుక్రవారం నాడు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార, రష్మిక మందన్న-దుల్కర్ సల్మాన్-మృణాల్ ఠాకూర్ లు ప్రధాన పాత్రలలో హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాలు విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. పటాస్ సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత బింబిసార సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడమే కాక మంచి వసూళ్లు కూడా రాబట్టింది. మొదటి రోజే కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా ఇప్పుడు నాలుగో రోజు కూడా రికార్డుల వర్షం కురిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో నాలుగో రోజు 2 కోట్ల 27 లక్షల రూపాయలు రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఇప్పటిదాకా 18 కోట్ల 10 లక్షల షేర్, 28 కోట్ల 20 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమా నాలుగు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా భారత దేశంలో కోటి రూపాయలు 23 లక్షలు, విదేశాలలో కోటి 52 లక్షల వసూలు సాధించి ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద 20 కోట్ల 85 లక్షల వసూళ్లు రాబట్టింది.


ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 15 కోట్ల 60 లక్షల రూపాయలకు జరగగా బ్రేక్ ఈవెన్  టార్గెట్ 16 కోట్ల 20 లక్షలుగా ఫిక్స్ అయింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ చేసిన ఈ సినిమా 4 కోట్ల 65 లక్షల లాభాలు తీసుకొచ్చింది తద్వారా సినిమా సూపర్ హిట్ స్టేటస్ సాధించినట్లు అయింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసారుడి పాత్రలో నటించగా ఐరా అనే రాకుమారి పాత్రలో కేథరిన్ థెరిసా కనిపించింది. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో సంయుక్త మీనన్ కనిపించింది. ఇక ఈ సినిమా వశిష్ట దర్శకత్వంలో రూపొందిగా కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ కొసరాజు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. 


Sita Ramam 4 Days Collections:
ఇక అదే రోజు విడుదలైన హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్లు సాధించిందో దానికంటే రెండో రోజు మూడో రోజు పెరుగుతూ వెళ్ళాయి. అయితే నాలుగో రోజు సోమవారం కావడంతో ఆ వసూళ్లు కాస్త తగ్గి మళ్ళీ మొదటి రోజు వసూళ్లు సాధించినట్టే కోటి రూపాయల 46 లక్షలు సాధించింది. తద్వారా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల 66 లక్షలు వసూళ్లు రాబట్టింది.


ఇక ఈ సినిమా నాలుగు రోజులకు కలిపి రెండు రాష్ట్రాలు మినహా ఇండియాలో కోటి 75 లక్షలు ఇతర భాషలలో రెండు కోట్ల ఐదు లక్షలు ఓవర్సీస్ లో మూడు కోట్ల 15 లక్షలు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల 61 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బిజినెస్ 16 కోట్ల 20 లక్షలు జరగడంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 17 కోట్లుగా నిర్ణయించారు. సినిమాకి మరో మూడు కోట్ల 39 లక్షల వసూలు లభిస్తే సినిమా క్లీన్ హిట్ స్టేటస్ సాధించినట్లు అవుతుంది. సినిమాకి ఉన్న పాజిటివ్ టాక్ దృష్ట్యా ఈ వసూళ్లు సాధించడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు.


Also Read: Pooja Hegde: వెకేషన్లోనూ అందాల ఆరబోతే.. పూజా హాట్ ట్రీట్ చూశారా!
Also Read: Chiranjeevi: సొంతూరి అభిమానికి మెగా సాయం.. దటీజ్ మెగాస్టార్ అంటూ ప్రసంశలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook