Bimbisara: మూడో రోజే బ్రేక్ ఈవెన్ చేసేసిన బింబిసారుడు.. కోట్లలో లాభం.. విరుద్ధంగా సీతారామం పరిస్థితి!
Bimbisara and Sita Ramam Movie 3 Days Collections: బింబిసార మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆ సినిమా మూడే రోజులకు బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక సీతారామం మూవీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
Kalyan Ram's Bimbisara Movie 3 Days Collections: కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం బింబిసార. బింబిసారుడు అనే ఒక ఐదో శతాబ్దానికి చెందిన రాజు టైం ట్రావెల్ చేసి నేటి ఆధునిక సమాజంలోకి వచ్చి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? మళ్ళీ తన కాలానికి ఎలా వెళ్లాడు? అనే ఒక ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి ఆట నుంచి మంచి సక్సెస్ ఫుల్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ సొంత బావమరిది హరికృష్ణ కొసరాజు నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచి మంచి టాక్ తో పాటు కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.
అంతేకాక ఈ సినిమా లాభాలను కూడా తెచ్చి పెట్టింది. ఇక మీదట వచ్చే వసూళ్లన్నీ కూడా డిస్టిబ్యూటర్లకు లాభాలుగానే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు 6 కోట్ల 30 లక్షల రూపాయల కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజున శనివారం నాడు 4 కోట్ల 52 లక్షల వసూలు చేసింది. ఇక మూడవ రోజు ఆదివారం నాడు రెండో రోజు కంటే ఎక్కువగా 5 కోట్ల 2 లక్షల రూపాయలు వసూలు చేసి మొత్తం మూడు రోజులకు గాను 15 కోట్ల 83 లక్షలు షేర్ వసూలు సాధించింది. అలాగే 24 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వసూలు సాధించింది.
ఇక బింబిసార మూడు రోజులకు గాను తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగిలిన భారతదేశం మొత్తం మీద కోటి రూపాయల 10 లక్షలు, ఓవర్సీస్ లో కోటి రూపాయల 35 లక్షలు సాధించింది. ఈ నేపద్యంలో ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల 29 లక్షల రూపాయలు షేర్ 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 15 కోట్ల 60 లక్షల రూపాయలకు జరిగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్ల 20 లక్షలుగా నమోదయింది. అయితే మూడో రోజుకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసి 2 కోట్ల 9 లక్షల రూపాయల లాభాలతో హిట్ సినిమాల జాబితాలో నిలిచింది. ఇకపై వచ్చే వసూళ్లన్నీ కూడా లాభాలు.
Sita Ramam Movie 3 Days Collections:
ఇక ఇదే సినిమాతో పాటు విడుదలైన సీతారామం సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా చూశాక చాలాకాలం తర్వాత తెలుగులో ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో కోటి యాభై లక్షలు, రెండో రోజు రెండు కోట్ల ఎనిమిది లక్షలు, మూడోరోజు 2 కోట్ల 62 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. ఇక మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వసూళ్లు సాధించింది.
ఇక ఈ సినిమా మిగతా భారతదేశంలో 60 లక్షల రూపాయలు, ఇతర భాషలలో కోటి రూపాయల 55 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. అలాగే ఓవర్సీస్లో కాస్త ఎక్కువగా 2 కోట్ల 80 లక్షల రూపాయలు వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు గాను 11 కోట్ల 15 లక్షల రూపాయలు షేర్ వసూలు సాధించింది. ఇక సినిమా ఓవరాల్ బిజినెస్ కనుక చూస్తే 16 కోట్ల 20 లక్షల రూపాయల బిజినెస్ జరుపుకోవడంతో బ్రేక్ ఈవెన్ 17 కోట్ల రూపాయలుగా ఫిక్స్ చేశారు.
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేయాలంటే 5 కోట్ల 85 లక్షల రూపాయల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా సరే సోమవారం నుంచి వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మీదనే ఆధారపడి ఉంటుంది. సోమవారం నుంచి కూడా వసూళ్లు బాగానే ఉంటే ఈ సినిమా 5 కోట్ల 85 లక్షలు సాధించడం పెద్ద విషయం ఏమీ కాదు.
Read Also: Rashmika Mandanna: రాత్రి పనిచేసేవారికి రష్మిక విలువైన సూచనలు.. విన్నారా?
Read Also: Tollywood: ఫిలిం చాంబర్ కు డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లు.. అలా చేయాల్సిందే అంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook