Nandamuri Kalyan Ram's Bimbisara to Stream On ZEE5 from October 5: 'బింబిసార' సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ చాలాకాలం తర్వాత భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. వరుస పరాజయాలతో డీలాపడ్డ కళ్యాణ్ రామ్‌ కెరీర్‌కు బింబిసార చిత్రం మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. నూతన డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ముందునుంచి భారీ అంచనాలు ఉన్నాయి. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ ఉన్న కథతో వచ్చిన బింబిసార సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఆగస్ట్‌ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి డబుల్ ప్రాఫిట్‌ని ఖాతాలో వేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బింబిసార సినిమాలో కల్యాణ్‌ రామ్ నట విశ్వరూపం చూపించారు. డబుల్ రోల్‌ చేసిన ఆయన.. బింబిసారుడు అనే రాజు పాత్రలో అయితే జీవించేశారు. ఇక థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోయిన బింబిసార చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ డిజిటిల్‌ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుందట. ఓటీటీ రైట్స్‌ను జీ5 సంస్థ ఫ్యాన్సీ ధర సొంతం చేసుకుందట. 


అక్టోబర్ 5న కాకుంటే అక్టోబర్‌ 7న బింబిసార సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు జీ5 సంస్థ నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై జీ5 అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందట. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కె హరికృష్ణ నిర్మించారు. ఈ సినిమాలో అందాల బామలు కేథరీన్‌ థ్రెసా, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటించారు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం 'కార్తికేయ 2' సైతం జీ5లో అక్టోబర్ 5న స్ట్రీమింగ్ కానుంది.


Also Read: Pujita Ponnada Pics: శారీలో పూజిత పొన్నాడ.. ఏంజిల్‌లా మెరిసిపోతున్న తెలుగమ్మాయి!


Also Read: మాములు క్రేజ్ కాదు.. త్రివేండ్రంలో విరాట్ కోహ్లీ భారీ కటౌట్! బిత్తరపోయిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook