Bimbisara Release Trailer: సరైన హిట్ కొట్టి చాలా కాలమైన నేపథ్యంలో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ నేపథ్యంలోనే తన మార్కెట్ కి మించి ఒక సినిమా చేస్తున్నాడ, బింబిసార అనే ఒక టైం ట్రావెల్ కి సంబంధించిన మూవీలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, క్యాథరిన్ థెరీసా, వరీనా హుస్సేన్ వంటి వారు హీరోయిన్లుగా నటించారు. 
 
స్వయంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా చెబుతున్న ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఒక ట్రైలర్ సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడేలా చేయగా ఈ ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలను మరింత పెంచే విధంగా ఉంది. 
 
మగధ సామ్రాజ్యాన్ని ఏలిన బింబిసారుడు రాజ్య కాంక్షతో తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను కూడా ఎలా దక్కించుకోవడానికి ముందుకు వెళుతున్నాడు అనేది చూపిస్తూనే నేటి సమాజంలో బింబిసారుడు మళ్ళీ పుడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో సినిమా చేసినట్టు క్లారిటీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న క్రమంలో తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. ఈ సినిమాకు కీరవాణి నేపథ్య సంగీతం అందిస్తుండగా చిరంతన్ బట్ సంగీతం అందించారు, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తో పాటు ఇతర కీలక పాత్రలలో ప్రకాష్ రాజ్, అయ్యప్ప శర్మ లాంటి వారు కనిపించబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read: Alia Bhatt: ప్రెగ్నెన్సీ ట్రోల్స్ పై అలియా ఘాటు స్పందన.. అయితే ఏంటి ఇబ్బంది అంటూ!


Also Read: Saami Saami song:సామీ సామీ అంటూ అదరకొట్టిన బామ్మ.. రష్మికకు గట్టి పోటీ ఇచ్చిందిగా!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook