Saami Saami song:సామీ సామీ అంటూ అదరకొట్టిన బామ్మ.. రష్మికకు గట్టి పోటీ ఇచ్చిందిగా!

Old woman dance to Pushpa movie Saami Saami song:  ఒక బామ్మ గారు పుష్పలోని సామీ సామి అనే సాంగ్ కి డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2022, 06:39 PM IST
Saami Saami song:సామీ సామీ అంటూ అదరకొట్టిన బామ్మ.. రష్మికకు గట్టి పోటీ ఇచ్చిందిగా!

Old woman dance to Pushpa movie Saami Saami song: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఎంతో పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మరీ ముఖ్యంగా ఈ సినిమా తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలైంది. దక్షిణాది భాషల్లో కంటే ఉత్తరాదిలోనే ఈ సినిమా మంచి క్రేజ్ దక్కించుకుంది. అంతే కాక ఈ సినిమాలో చేసిన అన్ని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ అటు శ్రోతలతో సహా సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంది.  అందుకే ఈ సినిమాలో వచ్చిన అన్ని పాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ లభించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక పాట కనిపిస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఎలా పరిస్థితి తయారయింది అంటే ఏ శుభకార్యం  అయినా పుష్ప పాట లేకుండా ఆ శుభకార్యం పూర్తి కావడం లేదు.

తాజాగా ఒక బామ్మ గారు పుష్పలోని సామీ సామి అనే సాంగ్ కి డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక బామ్మ సినిమాలో సామీ సామి అనే సాంగ్ కి తగ్గ మాస్ బీట్ కి ఎక్కడా తగ్గకుండా ఆ సాంగ్ మ్యూజిక్ వచ్చినంత సేపు ఎంతో ఎనర్జిటిక్గా డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ సినిమా ఒరిజినల్ పాటలో రష్మిక మందన్న కనిపించగా ఆమెను మరిపించే విధంగా బామ్మ డాన్స్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో సరిగ్గా ఎక్కడ తీసారో క్లారిటీ లేదు గాని ఏదో శుభకార్యంలో తీసినట్లు అర్థమవుతోంది.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

Read Also: Producers Guild Committees: సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ కమిటీలు.. దిల్ రాజు సహా ఎవరెవరు ఉన్నారంటే?
Read Also: Raviteja: మెగా 154లో రవితేజ షాకింగ్ రోల్.. లీకయిన ఇన్ సైడ్ ఇన్ఫో! 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News