Bigg Boss OTT Winner: డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి సీజన్ విన్నర్‌గా బిందు మాధవి నిలిచింది. ఫైనల్లో అఖిల్ సార్థక్‌తో పోటీ పడి బిగ్‌బాస్ టైటిల్ నెగ్గింది. తెలుగులో బిగ్‌బాస్ టైటిల్ లేటీ కంటెస్టెంట్‌ను వరించడం ఇదే తొలిసారి. గతంలో బిగ్‌బాస్ విన్నర్లుగా శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, సన్నీ నిలిచిన సంగతి తెలిసిందే. ఈసారి ఓటీటీలో ప్రసారమవుతున్న షోలో మిగతా కంటెస్టెంట్స్‌ను వెనక్కి నెట్టి బిందు మాధవి టైటిల్ గెలుచుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున టైటిల్ విన్నర్‌గా బిందు మాధవిని ప్రకటించాక.. ఆమె కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తనను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన విజయాన్ని లేట్ బ్లూమర్స్ (ఆలస్యంగా సక్సెస్ అయ్యేవారు)కి అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. సక్సెస్ కొంతమందికి త్వరగా వస్తుందని... కొంతమందికి కొన్నేళ్లు పడుతుందని.... చాలా ఏళ్ల కష్టం తర్వాత బిగ్‌బాస్ ట్రోఫీ రూపంలో తనకు సక్సెస్ వచ్చిందని పేర్కొన్నారు. 


ఏదైనా ఒక ప్రొఫెషన్‌లో చాలా కాలం పాటు ప్రయత్నిస్తూ ఉంటే... చాలామంది నమ్మకం వదిలేసుకుంటారని బిందు మాధవి పేర్కొన్నారు. ఇంకా ఎన్నాళ్లిలా.. వదిలేసి వేరే జాబ్ చూసుకోండనే ఒత్తిళ్లు పెరుగుతాయన్నారు. తన విషయంలో నమ్మకమే తనను ఇక్కడి దాకా నడిపించిందన్నారు. లేట్ బ్లూమర్స్ ఏ రంగంలో ఉన్నా.. హోప్ వదిలిపెట్టుకోవద్దని అన్నారు.


తాజా బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌లో బిందు మాధవి 'ఆడ పులి' పేరుతో హౌస్‌లో మిగతా కంటెస్టెంట్స్‌ను డామినేట్ చేసింది. గతంలో తమిళంలోనూ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అయిన బిందు మాధవి.. ఆ అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకుంది. టాస్క్‌లు, గేమ్స్‌ను జాగ్రత్తగా డీల్ చేసింది. పలుమార్లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయినా... ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఓట్ల విషయంలో మిగతా కంటెస్టెంట్స్ కన్నా బిందు చాలా ముందు వరుసలో ఉంది. మొత్తానికి ఫైనల్లో ఏడుగురు మిగలగా... అఖిల్ సార్థక్-బిందు మాధవి టాప్-2 కంటెస్టెంట్స్‌గా నిలిచారు. ఈ ఇద్దరిలో బిందు మాధవినే టైటిల్‌నే వరించింది. 


Also Read: Vijay Deverakonda: విజయ్‌తో రొమాన్స్ చేయాలనుంది... మనసులో మాట బయటపెట్టిన స్టార్ హీరోయిన్


Also Read: KTR Tour In London: తెలంగాణ తల్లి రుణం తీర్చుకోండి, ఎన్నారైలకు కేటీఆర్ పిలుపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.