Vijay Deverakonda: విజయ్‌తో రొమాన్స్ చేయాలనుంది... మనసులో మాట బయటపెట్టిన స్టార్ హీరోయిన్

Malavika Mohanan on Vijay Deverakonda: మలయాళ భామ మాళవిక మోహనన్‌కు విజయ్ దేవరకొండతో నటించాలనుందట... ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 07:01 PM IST
  • హీరో విజయ్ దేవరకొండతో నటించాలనుందని చెప్పిన మాళవిక మోహనన్
  • విజయ్‌తో రొమాన్స్ చేయాలనుందంటూ మనసులో మాట బయటపెట్టేసింది
  • ఇటీవలి ట్విట్టర్ చిట్‌చాట్‌లో మాళవిక ఈ వ్యాఖ్యలు చేసింది
 Vijay Deverakonda: విజయ్‌తో రొమాన్స్ చేయాలనుంది... మనసులో మాట బయటపెట్టిన స్టార్ హీరోయిన్

Malavika Mohanan on Vijay Deverakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా విడుదలైన చివరి రెండు చిత్రాలు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపులు పలకరించినప్పటికీ ఈ హీరో క్రేజ్ మాత్రం తగ్గలేదు సరికదా.. అంతకంతకూ ఆ క్రేజ్ పెరుగుతూనే ఉంది. విజయ్ నుంచి ఒక్క ప్యాన్ ఇండియా మూవీ కూడా విడుదలవకముందే తెలుగుతో పాటు హిందీ ఇతర భాషల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రౌడీ స్టార్‌తో నటించాలనుందంటూ తాజాగా మలయాళ భామ మాళవిక మోహనన్ తన మనసులో మాట బయటపెట్టింది.

ఇటీవల మాళవిక మోహనన్ #AskMalavika పేరిట ట్విట్టర్‌లో నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. రజనీకాంత్, విజయ్ జోసెఫ్ లాంటి బిగ్ స్టార్స్‌తో కలిసిన నటించిన మీరు... ఇప్పుడు ఏ హీరోతో నటించేందుకు ఆత్రుతగా ఉన్నారని ఓ నెటిజన్ మాళవికను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన మాళవిక... విజయ్ దేవరకొండ అని రిప్లై ఇచ్చింది. విజయ్‌తో రొమాంటిక్ లేదా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌లో నటించాలనుందని తన మనసులో మాట బయటపెట్టింది. 

ఇక ఇదే చిట్‌చాట్‌లో.. మీరు కన్నడ సినిమాల్లో నటించే ఛాన్స్ ఉంటే... కో‌ స్టార్‌గా మీ ఫేవరెట్ ఎవరు అని మరో నెటిజన్ మాళవికను ప్రశ్నించాడు. అందుకు మాళవిక... కేజీఎఫ్ 1కి ముందే తాను యశ్‌కి పెద్ద ఫ్యాన్ అని రిప్లై ఇచ్చింది. యశ్ జర్నీ చాలా స్పూర్తివంతంగా ఉంటుందని పేర్కొంది. ఇక సినిమాల్లో మీ డ్రీమ్ రోల్ ఏంటని ఓ నెటిజన్ ప్రశ్నించగా... పీరియాడికల్ సినిమాలో వారియర్ ప్రిన్సెస్ పాత్ర చేయాలనుందని చెప్పింది. 

మాళవిక మోహనన్ తమిళ హీరో ధనుష్‌తో కలిసి నటించిన 'మారన్' ఈ ఏడాది మార్చిలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. ప్రస్తుతం మాళవిక యుధ్ర అనే ఓ హిందీ సినిమాలో నటిస్తోంది.  

Also Read: CM Kcr Tour: త్వరలో కీలక పరిణామం..ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్య..!

Also Read: KTR Tour In London: తెలంగాణ తల్లి రుణం తీర్చుకోండి, ఎన్నారైలకు కేటీఆర్ పిలుపు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News