Pawan Kalyan Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, క్రిష్‌ కాంబినేషన్‌లో రాబోతోన్న హరి హర వీరమల్లు సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల ఈ చిత్రం కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఈ సినిమా యూనిట్ సెట్స్ మీద సందడి చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఓ ఇంపార్టెంట్ సీన్ షూట్ చేస్తున్నారట. ఈ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన కథ అని అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నాటి కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్స్ కూడా ఉండబోతోన్నాయి. ఔరంగజేబు పాత్ర కూడా ఈ సినిమాలో ఉండబోతోంది.ఈ పాత్రను పోషించేందుకు బాలీవుడ్ నటుడు నేడు హైద్రాబాద్‌కు వచ్చాడు. ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ నేడు ఈ చారిత్రాత్మక చిత్ర బృందంలో నేడు జాయిన్ అయ్యారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన.. చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు.


 



కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. 


హరి హర వీర మల్లు చిత్ర యూనిట్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో 40 రోజుల పాటు 900 మంది సిబ్బందితో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ను ముగించిన సంగతి తెలిసిందే. ఇది వరకు విడుదల చేసిన హరి హర వీర మల్లు గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది.


Also Read : Pooja Hegde Cirkus : కోలుకోలేకపోతోన్న బాలీవుడ్.. సర్కస్‌ కూడా డిజాస్టరే?.. రణ్‌వీర్‌, పూజా హెగ్డేల బ్యాడ్ లక్


Also Read : Disaster Movies in Tollywood 2022 : ఈ ఏడాదిలో పెద్ద దెబ్బ కొట్టిన చిత్రాలు ఇవే.. ఆచార్య చెప్పిన గుణపాఠం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook