Animal Trailer: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ విశ్వరూపం చూడాలంటే సినిమా మొత్తం చూస్తే జడుసుకోవడం ఖాయం. అందుకే ఈ మూడున్నర నిమిషాల ట్రైలర్ చూస్తే చాలు వణుకుపుడుతుంది. రణబీర్ కపూర్ తాజా పాన్ ఇండియా సినిమా యానిమల్ ట్రైలర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా తీసి సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు నేరుగా బాలీవుడ్ సినిమాతో సంచలనానికి సిద్ధమయ్యాడు. రణబీర్ కపూర్‌‌ను కొత్తకోణంలో అత్యంత భయంకరంగా చూపిస్తూ యానిమల్‌గా మార్చేశాడు. డిసెంబర్ 1న ధియేటర్లలో విడుదల కానున్న యానిమల్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల హల్‌చల్ చేస్తోంది అనేకంటే అందర్నీ భయపెడుతోందని చెప్పాలి. మూడున్నర నిమిషాలు కట్ చేసిన ట్రైలర్ సినిమా ఎంత భయంకరంగా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. అటు ఫ్యామిలీ సెంటిమెంట్ ఇటు వయోలెన్స్ ఉండే సినిమా ఇది. 


సాధారణంగా ట్రైలర్ చూస్తే సినిమా కంటెంట్ తెలిసిపోతుంది. కానీ యానిమల్ సినిమా ట్రైలర్ చూస్తే పల్స్ రేట్ పెరిగిపోతుంది. ఊపిరి ఆడదు. పూర్తి ఇంటెన్సిటీతో ఉండే యానిమల్ ట్రైలర్ తెగ హల్‌చల్ చేస్తోంది. ఒక్కసారి ట్రైలర్ చూస్తే ఇక సినిమా చూడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అర్జున్ రెడ్డి తరువాత మరో సెన్సేషనల్ హిట్ కానుంది సందీప్ రెడ్డి వంగాకు. మూడున్నర నిమిషాల ట్రైలర్‌లోనే విధ్వంసం రేపితే మొత్తం సినిమాలో రణబీర్ ఎంతటి అరాచకం సృష్టిస్తాడో సినిమా చూస్తేనే తెలుస్తోంది. ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.



ఇప్పటి వరకూ రణబీర్ కపూర్‌ను కేవలం ఓ లవర్ బాయ్‌గా సాఫ్ట్ పాత్రలో చూసిన బాలీవుడ్ ప్రేక్షకులకు సందీప్ రెడ్డి అతడిలోని కొత్తకోణాన్ని పరిచయం చేశాడు. బాబీడియోల్ వర్సెస్ రణబీర్ కపూర్ ఫైటింగ్ సీన్స్ మరీ పీక్స్‌లో ఉన్నాయి. సినిమా మొత్తం తండ్రీ కొడుకుల చుట్టూ తిరుగుతుంది. తండ్రి కోసం యానిమల్‌గా మారిన కొడుకు పాత్రలో రణబీర్ రాక్షసంగా కన్పిస్తాడు. ట్రైలర్ మొత్తం రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్నా, బాబీ డియోల్ చుట్టూ తిరుగుతుంది. 


Also read: Bhagavanth Kesari OTT: ఓటీటీలో వచ్చేసిన బాలయ్య సినిమా భగవంత్ కేసరి, ఎందులో, ఎప్పట్నించి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook