Adi purush: బాహుబలి ఫేమ్, రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న ఆది పురుష్ చిత్రంలో లక్ష్మణుడి పాత్రపై క్లారిటీ వచ్చేసింది. లక్ష్మణుడిగా బాలీవుడ్ అప్ కమింగ్ యాక్టర్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బాలీవుడ్ ( Bollywood ) బ్లాక్ బస్టర్‌గా నిలిచిన తానాజీ (Tanaji ) దర్శకుడు ఓం రావత్ ( Om Rawat ).. రెబెల్ స్టార్ హీరోగా సరికొత్త పౌరాణిక చిత్రాన్ని మల్టీ లాంగ్వేజెస్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా అంటే..శ్రీరాముడి ( Sriram role ) పాత్రలో వైవిద్యమైన లుక్‌తో కన్పిస్తున్న ఈ చిత్రం పేరు ఆది పురుష్ ( Adi purush ). విడుదలకు ముందే..నిర్మాణదశలోనే ఈ చిత్రం హాట్ టాపిక్ అవుతోంది. ఈ చిత్రంపై చాలా అంచనాలున్నాయి. 


శ్రీరాముడి పాత్రను హీరో ప్రభాస్ ( Actor Prabhas ) పోషిస్తుండగా..బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali khan ) లంకేశ్ పాత్ర పోషిస్తున్నాడు.  సీత పాత్రపై ఇప్పటికే చాలా హీరోయిన్ల పేర్లు వచ్చినా...ఏదీ ఖరారు కాలేదు. ఇప్పుడు తాజాగా కృతి సనన్ పేరు విన్పిస్తోంది. దాదాపు కృతి సనన్ ( kriti sanon ) పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. 


ఇంతవరకూ బాగానే ఉంది. శ్రీ రాముడి పక్కనే ఉండే లక్ష్మణుడి పాత్రలో ఎవరనేది ఇప్పటి వరకూ సందేహంగా మారింది. ఈ పాత్రలో ప్యార్ కా పంచ్‌నామా, సోనూ కే టిటూ కీ స్వీటీ వంటి చిత్రాల్లో నటించిన సన్నీసింగ్ ( Sunny singh )ను ఎంపిక చేసినట్టు బాలీవుడ్‌లో టాక్ ఉంది. దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తున్నా..అధికారికంగా ప్రకటన రాలేదు. Also read: Bigg Boss Telugu 4: బిగ్‌బాస్‌ 4పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. అయినా ఎలిమినేషన్‌పై సస్పెన్స్!