Bollywood Actress Alia Bhatt: బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్‌ (Alia Bhatt) 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సమయంలోనే ఆలియా తెలుగు నేర్చుకోవడంతోపాటు మాట్లాడి అందరి ప్రశంసలను పొందింది. తాజాగా ఈ బ్యూటీ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘హార్ట్‌ ఆఫ్ స్టోన్‌’ (Heart of Stone) చిత్రం ద్వారా ఆమె హాలీవుడ్(hollywood) లోకి అడుగుపెట్టబోతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో అలియా నెగిటివ్ రోల్ లో కనిపించనుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఆగస్టు 11న విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ముంబయిలో జరిగిన ఓ మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నఆలియా.. '‘హార్ట్‌ ఆఫ్ స్టోన్‌' హీరోహీరోయిన్లకు తెలుగు నేర్పించే ప్రయత్నం చేసింది. ‘'అందరికీ నమస్కారం.. మీకు నా ముద్దులు..'’ అని ఎలా పలకాలో తన కో స్టార్‌ గాల్‌ గాడోట్‌కు (Gal Gadot) నేర్పించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అలియాభట్‌ తెలుగు బాగా మాట్లాడరని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.


అలాగే ఈ చిట్‌చాట్‌లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు కూడా అలియా సమాధానమిచ్చింది. తాను ఇప్పటి వరకు టాటూ వేయించుకోలేదని.. రణ్‌ బీర్‌, తాను ఒకేలాంటి టాటూ వేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తలిపింది. బాలీవుడ్ లో రీసెంట్ గా అలియా నటించిన ‘'రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ'’ (Rakhi aur Rani ki Prem Kahani) సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 



Also Read: Guntur Kaaram Movie: మహేశ్‌ బర్త్‌డే ట్రీట్ అదిరింది... మాస్‌ లుక్‌లో సూపర్ స్టార్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook