Jersey Heoine: కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేవలం సామాన్యులే కాకుండా సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరికీ తప్పడం లేదు. తాజాగా ఆ బాలీవుడ్ హీరోయిన్ కరోనా బారిన పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) ప్రారంభమవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఓ వైపు ఒమిక్రాన్ ముప్పు వెంటాడుతుండగానే మరోవైపు కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. రాజకీయ రంగంలోనూ, సినీరంగంలోనూ ప్రముఖులంతా కరోనా బారినపడుతున్నారు. 


ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అందరిపై కరోనా మహమ్మారి ప్రభావం పడుతోంది. తాజాగా మారో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడింది. బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న తెలుగు సినిమా జెర్సీలో హీరోయిన్‌గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్‌‌కు ( Mrunal Thakur) కోవిడ్ సోకింది. అదే సమయంలో ఆమెకు సోకింది ఒమిక్రాన్ (Omicron Variant)వేరియంట్‌గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. 


Also read: Bollywood actresses: సినీరంగంలో అగ్రనటీమణులు, చదువు మాత్రం తక్కువే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి