Kangana Ranaut shared her own story of being inappropriately touched as a child: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు 'లాక్ అప్' అనే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తన అందచందాలతో  కంగనా విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన లాక్ అప్ రియాల్టీ షోకి గ్లామర్ తీసుకొచ్చారు. రోజురోజుకి ఈ షోకి పాపులారిటీ పెరుగుతూ పోతోంది. కంటెస్టెంట్‌లు ఒక్కొక్కరూ తమ జీవితంలో జరిగిన అనుభవాలను చెప్పి ప్రేక్షకులను షాక్‌కు గురి చేయడమే ఇందుకు కారణం. తాజాగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కంగనా కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్ అప్ షోలో భాగంగా తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌ మునావర్‌ ఫరూఖీ.. తన చిన్నతనంలో అనుభవించిన లైంగిక వేధింపుల గురించి పంచుకున్నాడు. 'చిన్నతనంలోనే మా బంధువుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెపితే ఏమవుతుందోననే భయంతో ఇప్పటి వరకూ చెప్పలేదు. బంధువుల వల్ల నాలుగేళ్లు నరకం చూశా' అని మునావర్‌ తెలిపాడు. అందరిముందు ఎలాంటి బెరుకు లేకుండా తన చేదు అనుభవాలను పంచుకున్న మునావర్‌పై కంగన రనౌత్‌ ప్రశంసల వర్షం కురిపించారు.


మునావర్‌ ఫరూఖీని అభినందించిన అనంతరం తాను కూడా చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కంగన రనౌత్‌. 'సమాజంలో చాలామంది చిన్నారులు లైంగిక వేధింపులకు గురౌతున్నారు. పిల్లల పెంపకం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ.. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా నా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యాను' అని బాలీవుడ్ క్వీన్ కంగనా భావోద్వేగం చెందారు.


'అప్పుడు నాకు ఆరేళ్ల వయసు. మా గ్రామంలోని ఓ అబ్బాయి మాతో ఇబ్బందికరంగా ప్రవర్తించేవాడు. అతడు మా కంటే నాలుగేళ్లు మాత్రమే పెద్దవాడు. మా స్నేహితులందరం కలిసి ఆటలు ఆడుకునే సమయంలో ఆ అబ్బాయి మా వద్దకు వచ్చి.. మమ్మల్ని అసభ్యకరంగా తాకేవాడు. తాకారని చోట తాకేవాడు. అయితే లైంగిక వేధింపులకు గురవుతున్నామని ఆ వయసులో నాకు తెలియదు' అని బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ చెప్పుకొచ్చారు. 


Also Read: Pushpa Parat 2: పుష్ప‌ 2లో బాలీవుడ్ స్టార్.. ఆ పాత్ర కోసమేనా?


Also Read: Mumbai Indians: 15 కోట్ల ఖరీదైన ఆటగాడి ఆటపై అసంతృప్తి, ఆడలేకపోతున్నాడా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.