Mumbai Indians: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం చెందుతోంది. టీమ్‌లో అత్యంత విలువైన ఆటగాడు మరీ ఘోరంగా విఫలమౌతుండటం ఆందోళన కల్గిస్తోంది. టీమ్ కోచ్ మహేల జయవర్ధనే సైతం ఆ ఆటగాడిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2022 లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం చెందుతుంటే..అందరి దృష్టీ ఆ టీమ్ ఆటగాడు ఇషాన్ కిషన్‌పైనే పడింది. టీమ్ సారధి రోహిత్ శర్మ కంటే ెక్కువగా ఇషాన్ కిషన్‌పైనే వేలు చూపిస్తున్న పరిస్థితి. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో అత్యంత కాస్ట్లీప్లేయర్ ఇషాన్ కిషన్ కావడం గమనార్హం. ఎందుకంటే ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం 15.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి ఘోర విఫలం చెందడంతో టీమ్ బ్యాటర్ల సామర్ధ్యం, ఆటతీరుపై ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనే సమీక్షించాడు. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో మరోసారి 36 పరుగుల తేడాతో ఓడిపోవడం, ఆడిన 8 మ్యాచ్‌లలో పరాజయం చెందడాన్ని ఆ టీమ్ కోచ్, యాజమాన్యం జీర్ణించుకోలేకపోతున్నాయి. గతంలో ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టు ఈసారి అందరికంటే ముందే నిష్క్రమిస్తుండటం విచారకరం.
బాటర్ల పనితీరును సమీక్షించాల్సిన అవసరముందని..మహేల జయవర్ధనే వ్యాఖ్యానించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ వరకూ ఫరవాలేదని సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ఇంకా మెరుగ్గా చేయాల్సి ఉందన్నాడు. గత రెండు మ్యాచ్‌లలో బౌలింగ్ విభాగం కాస్త మెరుగుపడిందన్నాడు. కానీ త్వరగా ప్రత్యర్ధి వికెట్లు తీయలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశాడు. మరీ ముఖ్యంగా తమ జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ మెగా వేలంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా తీసుకున్న ఇషాన్ కిషన్‌కు సహజసిద్ధంగా ఆడేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నాడు జయవర్ధనే. అయితే అందర్నీ నిరాశపరిచాడన్నాడు. ఆడేందుకు చాలా కష్టపడుతున్నాడని పేర్కొన్నాడు. ఈ విషయంపై ఇంకా అతనితో మాట్లాడలేదని..త్వరలో మాట్లాడతానన్నాడు.
Also read: KL Rahul Banned: లక్నో సూపర్ జెయింట్స్ సారధికి 24 లక్షల పెనాల్టీ.. మ్యాచ్‌పై నిషేధం కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.