Kim Sharma Visits Golden Temple With Boyfriend Leander Paes: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కిమ్ శ‌ర్మ (Kim Sharma), టెన్నిస్ లెజెండ్ లియాండ‌ర్ పేస్‌ (Leander Paes) రిలేష‌న్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. గతకొంతకాలంగా ఈ ఇద్దరు బాహాటంగానే తిరుగుతున్నారు. గతంలో గోవాలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫొటోస్ వైరల్ కావడంతో కిమ్, పేస్‌ డేటింగ్ విషయం బయటకొచ్చింది. అప్పటినుంచి ఇద్దరు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట తాజాగా పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ (Golden Temple)ను సందర్శించారు. అందుకు సంబంధించిన ఫోటోల‌ను కిమ్ శ‌ర్మ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోల్డెన్ టెంపుల్‌ (Golden Temple)లో బాయ్‌ఫ్రెండ్ లియాండ‌ర్‌ పేస్‌తో దిగిన ఫోటోల‌ను కిమ్ శర్మ (Kim Sharma) తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి మంచి క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. 'ఇక్క‌డ క‌లిగే ఫీలింగ్ మ‌రెక్క‌డా ఉండదు. గోల్డెన్ టెంపుల్‌కు వెళ్ల‌డం దీవెన‌లుగా భావిస్తున్నా. వాహే గురు' అంటూ కిమ్ త‌న పోస్టులో పేర్కొన్నారు. గోల్డెన్ టెంపుల్‌లో లియాండ‌ర్ కుర్తాలో.. కిమ్ వైట్ సూట్‌లో సంద‌డి చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి లియాండ‌ర్, కిమ్‌ ఒక్క‌టయిన విషయం తెలిసిందే.


Also Read: Nathan Lyon: ఒక్క వికెట్‌ కోసం 326 రోజుల నిరీక్షణ.. చివరకు మూడో బౌలర్‌గా రికార్డు!!


1993లో వచ్చిన డర్ సినిమాతో కిమ్‌ శర్మ (Kim Sharma) బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మొహబతీన్ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై పలు బాలీవుడ్‌ సినిమాలలో నటించిన కిమ్.. 2002లో 'ఖడ్గం' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె.. యాగం, మగధీర సినిమాలలో నటించి మెప్పించారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh)తో ప్రేమాయణం సాగించారు. నాలుగేళ్ల పాటు పబ్లిక్‌గా చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అనంతరం 2007లో వీరి ప్రేమకు పులిస్టాప్ పడింది.



Also Read: Lance Naik Sai Teja's Body : బెంగళూరుకు చేరిన లాన్స్‌ నాయక్ సాయితేజ భౌతికకాయం


2010లో బిజినెస్‌ మ్యాన్ అలీ పంజనీని పెళ్లి చేసుకున్న కిమ్‌ శర్మ (Kim Sharma).. భర్తతో పాటు కెన్యాకు వెళ్లిపోయింది. అయితే ఈ వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో అలీ పంజనీతో విడాకులు తీసుకొని తిరిగి ముంబై వచ్చేశారు. విడాకుల అనంతరం నటుడు హర్షవర్థన్ రాణేతో డేటింగ్ చేశారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మాత్రం టెన్నిస్ మాజీ ప్లేయర్ లియాండర్ పేస్‌ (Leander Paes)తో కిమ్ రిలేష‌న్‌లో ఉన్నారు. ఇప్పటికైనా 41 ఏళ్ల కిమ్ జీవితంలో సెటిల్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి