High Protein: ప్రొటీన్‌ ఎక్కువగా తింటున్నారా? కేన్సర్‌, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు తస్మాత్ జాగ్రత్త..

Side effects High Protein: ప్రొటీన్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. ఇది కడుపులో అజీర్తి సమస్యలకు దారితీస్తుంది. ప్రొటీన్‌ అధికంగా అంటే కార్బొహైడ్రేట్స్‌, ఫైబర్ తగ్గుతుంది. అయితే, సలాడ్స్‌, నీటిని ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jul 3, 2024, 12:28 PM IST
High Protein: ప్రొటీన్‌ ఎక్కువగా తింటున్నారా? కేన్సర్‌, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు తస్మాత్ జాగ్రత్త..

Side effects High Protein: ప్రొటీన్‌ మన శరీరానికి అవసరమైన పోషకం. ఇది కండరాలను పెంచడంతోపాటు ఆకలి, జీర్ణక్రియ, మెటబాలిజం రేటును కూడా మెరుగు చేస్తుంది. అంతేకాదు హైబీపీ సమస్యను కూడా తగ్గిస్తుంది. దీనివల్ల మన శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. అయితే, ప్రొటీన్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే ప్రాణాంతకం అవ్వచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

మలబద్ధకం..
ప్రొటీన్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. ఇది కడుపులో అజీర్తి సమస్యలకు దారితీస్తుంది. ప్రొటీన్‌ అధికంగా అంటే కార్బొహైడ్రేట్స్‌, ఫైబర్ తగ్గుతుంది. అయితే, సలాడ్స్‌, నీటిని ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది.

ప్రొటీన్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. నైట్రోజెన్‌ అధికంగా ఉండే అమైనో యాసిడ్స్‌ ప్రోటీన్స్‌ను కిడ్నీలను డ్యామేజ్‌ చేస్తుంది. దీంతో కిడ్నీలపై భారం ఎక్కువగా పడుతుంది. టాక్సిన్స్‌ శరీరం నుంచి బయటకు పంపాలంటే సమయం పడుతుంది.

ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..

ప్రొటీన్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే కేన్సర్‌ సమస్యలు వస్తాయి. ఇది ప్రోస్టేట్‌, కొలెరెక్టాల్‌ కేన్సర్‌కు కారణమవుతుంది. ప్రొటీన్‌ అధికంగా తీసుకుంటే మన శరీరానికి హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలు మన శరీరంపై దుష్ప్రభావాలు చూపిస్తాయి.

ఇదీ చదవండి: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్టేజ్‌- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?

గుండె సమస్యలు..
ముఖ్యంగా రెడ్‌ మీట్‌, ఫుల్‌ఫ్యాట్‌ డైరీ ఫుడ్స్‌ గుండె సమస్యలకు కారణమవుతాయి. ఆరోగ్య నిపుణల అభిప్రాయం ప్రకారం ప్రొటీన్‌ అధికంగా ఉండే ఆహారాల్లో శాచురేటెడ్‌ ఫ్యాట్‌తోపాటు కొలెస్ట్రాల్‌కూడ ఉంటాయి. ఇది గుండె సమస్యలకు కారణమవుతుంది. అందుకే ప్రోటీన్‌ అధికంగా తీసుకుంటే ఈ అనర్థం తప్పదు.

బరువు పెరగడం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రొటీన్‌ తీసుకుంటే బరువు తగ్గుతారు. అయితే, అతిగా ప్రొటీన్‌ తీసుకుంటే ఫ్యాట్‌ నిల్వలు పేరుకుని బరువు పెరుగుతారు. అందుకే ఏది తీసుకున్నా అతిగా తీసుకోకూడదు. అవి సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపిస్తాయి.

దుర్వాసన..
కొన్ని నివేదికల ప్రకారం ప్రొటీన్‌ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఇది బ్రష్‌ చేసుకోవడం వల్ల తగ్గదు. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తరచూ బ్రష్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చూయింగ్‌ గమ్‌ తినాలి. ఏ ఆహారాలు అయినా అతిగా తీసుకోవడం అనర్థాలకు దారితీస్తుంది. ఇవి శరీరంపై దుష్ర్పభావాలు చూపిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News