Actress Kriti Sanon opens up on sexism in Bollywood: బాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో 'కృతి సనన్' ఒకరు. తన అందం, నటనతో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోపంతి, దిల్‌వాలే, బరేలీ కి బర్ఫీ, లుకా చుప్పి, హౌస్‌ఫుల్ 4 లాంటి సినిమాలతో కృతి పాపులర్ అయ్యారు. గత సంవత్సరం 'హమ్ దో హమారే దో' మరియు 'మిమి' సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. ఇక అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగా నాటించిన 'బచ్చన్ పాండే' సినిమా నేడు (మార్చి 18)న విడుదల అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బచ్చన్ పాండే మూవీ ప్రమోషన్స్‏లో భాగంగా పలు ఛానల్లలో ఇంటర్వ్యూలలో పాల్గొన్న కృతి సనన్.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేశారు. సినిమాలలో హీరోలతో సమానంగా హీరోయిన్స్ పాత్రలకు ప్రాధాన్యత ఉండడం లేదన్నారు. హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత 60 శాతం, హీరోలకు 40 శాతం ఉండే చిత్రాలలో నటించడానికి స్టార్స్ ఇష్టపడరని కృతి అన్నారు. ఇప్పుడిప్పుడే మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్నారు. 


తాజాగా కృతి సనన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'హీరోలతో పాటు హీరోయిన్ స్క్రీన్ స్పెస్ పంచుకునే అవకాశం చాలా తక్కువ. 60 శాతం కంటే ఎక్కువ పాత్ర హీరోయిన్స్ , 40 శాతం హీరోలకు స్క్రీన్ స్పెస్ ఉండే సినిమాల్లో నటించడానికి చాలా మంది స్టార్ హీరోలు ఇష్టపడరు. గతంలో నేను నటించిన చిత్రాల్లోనూ పలువురు స్టార్స్ నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఈ దోరణి మారాలని నేను కోరుకుంటున్నాను' అని అన్నారు. 


'ఆత్రంగి రే సినిమాలో అక్షయ్ కుమార్ నటిండం చాలా చాలా సంతోషంగా అనిపించింది. అందులో అక్షయ్ పాత్ర చిన్నదే అయినా.. అతను నటించడానికి ఒప్పుకున్నాడు. అక్షయ్ తన పాత్ర పట్ల నిజాయితీగా ఉంటాడు' అని కృతి సనన్  తెలిపారు. కృతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నాగ చైతన్యతో కలిసి 'దోచెయ్' సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయ్యారు. 


Also Read: RRR Runtime: ఆర్‌ఆర్‌ఆర్‌ సెన్సార్‌ పూర్తి.. షాకింగ్ రన్‌టైమ్! బాహుబలి-2 కంటే ఎక్కువ!!


Also Read: Salute Movie Review: సెల్యూట్ మూవీ రివ్యూ.. పోలీస్ ఆఫీసర్ గా దుల్కర్ సల్మాన్ మెప్పించాడా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook