Salute Movie Review: 'మహానటి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.. ఇటీవలే 'హే సినామికా' సినిమాతో పలకరించాడు. ఇప్పుడు మరోసారి 'సెల్యూట్' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయన హీరోగా డయానా పెంటీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం శుక్రవారం సోనీలివ్ ఓటీటీ వేదికగా విడుదలయ్యింది. ఈ సినిమా ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకోండి.
కథేంటంటే?
ఈ సినిమాలో అరవింద్ కరుణాకర్ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు. కథ ప్రకారం ఈయన మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తారు. అదే ఏరియాలో భార్యభర్తలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి హత్య చేస్తారు. తన ఉన్నత ఉద్యోగుల ఒత్తిడిని భరించలేక ఆటోడ్రైవర్ మురళిని అరెస్టు చేసి.. అతడిని జైలుకు పంపుతారు. ఇందులో ఎస్సై అరవింద్ పాత్ర కూడా ఉంటుంది.
అయితే ఆ ఆటోడ్రైవర్ ను జైలు పంపడాన్ని జీర్ణించుకోలేని.. ఎస్సై అరవింద్ సుదీర్ఘ సెలవుపై వెళ్తాడు. అయితే ఆ తర్వాత వెంటనే విధుల్లో చేరిన ఎస్సై అరవింద్.. ఆ కేసును మళ్లీ తిరిగతోడాతాడు. అయితే ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టిన ఎస్సై అరవింద్ చివరికి హంతకులను పట్టుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
'సెల్యూట్' చిత్రంలో దుల్కర్ సల్మాన్, డయానా పెంటీ హీరోహీరోయిన్లుగా నటించగా.. మనోజ్ కె. జయన్, లక్ష్మి గోపాలస్వామి, సాయికుమార్, తదితరులు నటించారు. ఈ చిత్రానికి బాబీ సంజయ్ కథ, స్క్రీన్ ప్లే అందించగా.. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై హీరో దుల్కర్ సల్మాన్ స్వీయనిర్మాణంలో తెరకెక్కింది.
Also Read: Bheemla Nayak OTT: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భీమ్లానాయక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
Also Read: RRR Movie Ticket Price: ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఆ సినిమా టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook