Ravina Tandon: సినిమా ఓ రంగుల ప్రపంచమే కాకుండా ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతుంటాయి. ఒకప్పటి బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏదైనా సరే సినీ ప్రపంచమంటేనే ఓ రంగుల ప్రపంచం. అంతేకాదు ఇక్కడంతా రహస్యమే. ఎన్నో అవమానాలు ఎదురవుతుంటాయి. గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లను చూసి తప్పుడు అభిప్రాయం పెట్టుకోవల్సిన అవసరం కూడా లేదు. సినిమా అనేది ఓ వృత్తి. ముఖ్యంగా మహిళలకు ఈ రంగంలో చాలా అవమానాలు ఎదురవుతుంటాయి. కెరీర్ ప్రారంభంలో అయితే మరీ దయనీయంగా ఉంటుంది పరిస్థితి.


బాలీవుడ్ (Bollywood)ప్రముఖ నటి , బ్యూటీ రవీనా టాండన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఎన్నో అవమానాల్ని ఎదుర్కొనట్టు  తెలిపింది. ఒకప్పుడు నిద్రపోయేందుకు చాలా ఏడ్చేదాన్నని ఆవేదన వెలిబుచ్చింది. ఎందుకంటే రాత్రుళ్లు నిద్రపట్టేది కాదని చెప్పింది. దీనికంతటికీ కారణం జర్నలిస్టులేనని..అప్పట్లో భయపడుతూ బతికేవాళ్లమని చెప్పింది. కో స్టార్స్‌తో చనువుగా ఉంటే నచ్చేది కాదని చెప్పింది. సొంత అన్నతో సైతం సంబంధాలు అంటగట్టేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రవీనాను (Ravina Tandon) డ్రాప్ చేసిన ఆ అందమైన అబ్బాయి ఆమె ప్రియుడు, రవీనా బాయ్‌ఫ్రెండ్‌ను కనిపెట్టేశాం అంటూ హెడ్‌లైన్స్ వేసేవారు. ఆ సమయంలో అస్సలు నిద్రపట్టేది కాదని ఏడ్చింది. ఎప్పుడు , ఎవరు తనపై వార్తలు రాస్తారో అంటూ భయపడేదాన్నని చెప్పారు.


Also read: Chiranjeevi Review: సేనాపతి సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సూపర్ రివ్యూ ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook