Deepika Ranveer to Bid IPL Team: ఐపీఎల్ ప్రాంచైజీ రేసులో బాలీవుడ్ స్టార్ కపుల్..?? ఎంత వరకు నిజం?
ఐపీఎల్‌లో కొత్తగా చేరబోతున్న రెండు జట్లలో ఒకదాని ఫ్రాంచైజీ తీసుకోవాలని బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ చూస్తున్నారని సమాచారం.. అదెంతవరకు నిజమంటే..??
Deepika Padukone - Ranveer Singh to bid for new IPL Team: ఐపీఎల్‌లో (IPL) కొత్తగా రెండు జట్లు చేరబోతున్నాయనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రెండు కొత్త జట్లు వచ్చే సంవత్సరం నుండి ఐపీఎల్ టోర్నమెంట్ లో పాల్గొనబోతున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలను విక్రయించేందుకు అక్టోబర్ 20 చివరి తేదీగా ప్రకటిస్తూ బీసీసీఐ (BCCI)టెండర్లకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే!
అయితే ఇపుడు బాలీవుడ్ (Bolywood)లో, సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది, అదేంటంటే కొత్త జట్ల బిడ్డింగ్ ప్రక్రియ కోసం అక్టోబర్ 25 న దుబాయ్ లో జరగనుంది. దీనికోసం బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ ( Deepika Padukone - Ranveer Singh) కొత్త జట్లను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నట్లు బీ-టౌన్ (B-Town) కోడై కూస్తుంది.
Also Read: Prakash raj MAA Controversy: తెరపైకి మళ్లీ 'మా' రగడ.. ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్
ఇదిలా ఉండగా.. దీపికా పదుకొనె తండ్రి ప్రముఖ ప్రకాష్ పదుకొనె (Prakash Padukone) బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మరియు 1980 లోనే ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా నిలిచాడు. ఇక రణ్వీర్ సింగ్ విషయానికి వస్తే బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏకు (Basketball League NBA) బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ పై ఆసక్తి ఉన్న వీరిద్దరు కొత్తగా వస్తున్న రెండు ఐపీఎల్ జట్లలో ఒకదానిని ఫ్రాంచైజీ తీసుకోవాలని చూస్తున్నారట.. వీరితో పాటు ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ (Foot Ball Club) మాంచెస్టర్ యూనైటెడ్ (Manchester United) కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీ పోటీలో ఉన్నట్లు సమాచారం.
ఐపీఎల్ ప్రారంభమైనప్పటీ నుండి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Sharukh Khan).. కోల్‌కతా నైట్ రైడర్స్ (kolkata knight riders) జట్టుకు యజమానిగా.. బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టుకు యజమానులుగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కించుకుంటే ఇక ఐపీఎల్ మొత్తం బాలీవుడ్ స్టార్స్ తో నిండిపోతుందని బీ-టౌన్ వర్గాల టాక్..
Also Read: T20 World Cup 2021: ఆ రెండు జట్లకే టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువ: షేన్ వార్న్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook