Kailash Kher Attacked: మొన్న మంగ్లీపై ఇప్పుడు కైలాష్ ఖేర్ పై.. బాషపై ప్రేమతో కన్నడిగుల దాడి!
Kailash Kher attack News: ఇటీవల కర్ణాటక హంపిలో జరిగిన ఓ ఈవెంట్‌లో లైవ్ ప్రదర్శన ఇస్తున్న గాయకుడు కైలాష్ ఖేర్‌పై దాడి జరిగింది, దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు
Kailash Kher attack News: ఇటీవల కర్ణాటక హంపిలో జరిగిన ఓ ఈవెంట్‌లో లైవ్ ప్రదర్శన ఇస్తున్న గాయకుడు కైలాష్ ఖేర్‌పై దాడి జరిగింది. అందుతున్న సమాచారం మేరకు కైలాష్ ఖేర్ గాయపడకుండా చాకచక్యంగా తప్పించుకున్నాడు, ఆ తరువాత ఆయన తన పాటలు పాడడం కంటిన్యూ చేశాడని అంటున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వార్షిక పండుగలో భాగంగా ఖేర్ కర్ణాటకలో ఉన్నారు, వివిధ నివేదికల ప్రకారం, గాయకుడు హిందీలో కొన్ని పాటలను పాడి వినిపించారు.
అయితే కొంతమంది ప్రేక్షకులు తమ ఇష్టానికి తగినట్లుగా ఆయన పాడలేదని ఫీల్ అయినట్టు చెబుతున్నారు. హిందీలో కాదు దాని బదులు కన్నడలో పాడమని అడిగారని అప్పుడే అతనిపై సీసాలు కూడా విసిరారని అంటున్నారు. అయితే, వాటర్ బాటిళ్లు ఖేర్ పక్కనే పడినా ఆయన దానిని పట్టించుకోకుండా పాటను కొనసాగించారని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొందర్ని అరెస్టు చేసినట్లు ఇండియా టుడే నివేదించింది.
ఇక పోలీసుల కథనం ప్రకారం, ఈ విషయంలో ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. అయితే, ఈ మొత్తం విషయంలో ఇప్పటి వరకు కైలాష్ ఖేర్ మరియు అతని బృందం ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే విషయం మీద కొద్ది రోజుల క్రితం తెలుగు సింగర్ మంగ్లీ మీద కూడా దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. మంగ్లీ కన్నడలో మాట్లాడమంటే మాట్లాడలేదు పాటలు పాడమంటే పాడలేదు అని కోపంతో కొంతమంది ఆమె మీద బళ్ళారి ఈవెంట్ లో దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ విషయంలో తనమీద ఎలాంటి దాడి జరగలేదని మంగ్లీ తన సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. తన జీవితంలోనే బళ్ళారి ఈవెంట్ను మరిచిపోలేని ఈవెంట్గా ఆమె అభివర్ణించింది అక్కడి నిర్వహకులు తనను చూసుకున్న విధానం తనకు బాగా నచ్చిందని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈవెంట్ అంతా పూర్తయింది కానీ ఈ పుకార్లు ఎక్కడ పుట్టాయో తనకు తెలియదని అని పేర్కొంది. ఇప్పుడు కైలాష్ ఖేర్ మీద కూడా ఇదే రకమైన దాడి జరగడంతో ఒక్కసారిగా ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ అయింది.
Also Read: Adire Abhi Emotional: మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది..కన్నీరు తెప్పిస్తోన్న అదిరే అభి పోస్ట్!
Also Read: Pawan Kalyan Unstoppable: పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చేస్తోంది.. ఆరోజునే ప్రేక్షకుల ముందుకు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook