Adire Abhi Emotional: మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది..కన్నీరు తెప్పిస్తోన్న అదిరే అభి పోస్ట్!

Adire Abhi Emotional Post : మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది అంటూ నటుడు అదిరే అభి ఒక సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 30, 2023, 12:43 PM IST
Adire Abhi Emotional: మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది..కన్నీరు తెప్పిస్తోన్న అదిరే అభి పోస్ట్!

Adire Abhi Emotional Post on Jabardasth: మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది అంటూ నటుడు అదిరే అభి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్ తో పంచు లేసే టీం లీడర్లు, కామెడీని అవపోసన పట్టిన కంటెస్టెంట్లు, అందరికి అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం అంటూ ఆయన ఎమోషనల్ అయ్యాడు. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు, సమయం ఆగేది కాదని అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నాడు.

కుశల ప్రశ్నలు, ఆపన్నహస్తలు, జోకుల మీద జోకులు, స్టూడియో దాటే నవ్వులు, బాబు గారి హుందాతనం, రోజా గారి చిలిపితనం, అనసూయ -రష్మిల అందం, స్కిట్ల మాయాజాలం అంటూ ఆయన పాత విషయాలు అన్నీ ఆయన గుర్తు చేసుకున్నారు. స్టేజి ఎక్కే వరకు రిహార్సల్లు అయినా అప్పుడప్పుడు స్పాన్టేనిటీలు, పోస్టర్ అఫ్ ది డే కోసం పోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీల వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు అన్నీ గుర్తు వస్తున్నాయని అంటూ ఆయన రాసుకొచ్చారు.

ఎవరి దిష్టి తగిలిందో, ఏక తాటి మీద నడిచిన మాకు ఎవరి దారి వారిదయ్యింది, ఎవడైనా పల్లెత్తి మాటంటే పడని మేము, మమ్మల్ని మేమే మాటలు అనుకుంటున్నాం, సమయం వెనక్కెళ్ళితే బాగుండు, ఆ రోజులు తిరిగి వస్తే బాగుండు అంటూ అదిరే అభి ఎమోషనల్ అవుతూ చేసిన పోస్ట్ అందరికీ కన్నీరు తెప్పిస్తోంది. అందరిని నవ్వించే జబర్దస్త్ కు, మళ్ళి నవ్వేరోజులు వస్తే బాగుండు అంటూ అదిరే అభి షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నాడు. నిజానికి కొద్ది రోజుల క్రితం కిరాక్ ఆర్పీ అనే కమెడియన్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ మీద అనేక ఆరోపణలు చేశారు.

జబర్దస్త్ అనేది తమకి లైఫ్ ఇవ్వడం కాదు తామే జబర్దస్త్ కి లైఫ్ ఇచ్చాము అని విధంగా ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత జబర్దస్త్ లోని కొందరు ఆర్పీకి మద్దతుగా మాట్లాడితే మరి కొందరు జబర్దస్త్ కి మద్దతుగా మాట్లాడారు. ఏదేమైనా జబర్దస్త్ వ్యవహారం మాత్రం చాలా కాలం పాటు యూట్యూబ్ వీడియోస్ లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు అదిరే అభి చేసిన పోస్టు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అలాగే జబర్దస్త్ నుంచి పలు కారణాలతో నాగబాబు బయటకు వెళ్ళిపోగా రోజా మాత్రం మంత్రి పదవి వచ్చేవరకు జబర్దస్త్ లోని కొనసాగారు. ఆమెకు మంత్రి పదవి వరించడంతో ఇప్పుడు కూడా జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరించడం కరెక్ట్ కాదని ఆమె బయటకు వెళ్లిపోయారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆమె స్థానంలో కొన్ని రోజులు ఇంద్రజ మరికొన్ని రోజులు కుష్బూ అంటూ ఇతర ఇతర హీరోయిన్లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు నిలకడగా ఉండడం లేదు అలాగే అనసూయ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. 
Also Read: Samantha Ruth Prabhu Busy: సమంత దెబ్బ.. 'ఖుషీ' పక్కన పెట్టి ముందుకు వెళ్తోన్న శివ నిర్వాణ!

Also Read: Bandla Ganesh Tweets: పవన్ సినిమా ఓపెనింగ్ రోజే బండ్ల గణేష్ వింత ట్వీట్లు.. బాధ పడుతూ ఆవేదనతో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News