Kangana Ranaut Video on shivsena goes Viral: మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో కంగనా చేసిన కొన్ని పాత కామెంట్స్ వీడియో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ డ్రామా నడుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ మహారాష్ట్ర రాజకీయ నాటకానికి వ్యూహకర్త మరెవరో కాదు,  శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే. ఏకనాథ్ షిండే మొదట సూరత్‌లో,  ఇప్పుడు గౌహతిలో దాదాపు 3 డజన్ల మంది శివసేన ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఏక్నాథ్ షిండే చెబుతున్న దాని ప్రకారం,  కాంగ్రెస్ - ఎన్‌సిపితో అన్ని బంధాలను తెంచుకుని బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటే తప్ప శివసేనతో కలిసి వెళ్ళడానికి సిద్దంగా లేరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత ఉద్ధవ్ ప్రభుత్వం పతనం ఖాయమని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కంగనా రనౌత్ పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై మునిసిపాలిటీ తన కార్యాలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత కంగనా రనౌత్ శివసేన ప్రభుత్వం మీద విరుచుకుపడింది. అప్పట్లో ఆమె మీరు నాపై పగ తీర్చుకున్నారని అనుకుంటున్నారు? ఈరోజు నా ఇల్లు బద్దలైంది,  రేపు నీ గర్వం బద్దలవుతుందని పేర్కొంది. అంతేకాక క వ్యక్తి స్త్రీని అవమానించిన వారు ఖచ్చితంగా పడిపోతారని పేర్కొంది.  



మన చరిత్రను ఒక్కసారి చూడండి,  స్త్రీని ఎవరు అవమానించినా వారి పతనం ఖాయం. రావణుడు సీతను,  కౌరవులు ద్రౌపదిని అవమానించారు. ఆ ఆడవాళ్ళ పాద ధూళికి కూడా నేను సమానం కాదు కానీ నేను కూడా స్త్రీనేనని ఆమె పేర్కొన్నారు. నేను నా గౌరవం కోసం నిలబడతా,  నేను ఎవరికీ హాని చేయలేదు. ఒక మహిళగా నా గౌరవాన్ని కాపాడుకుంటాను,  కానీ నన్ను అవమానించారని ఆమె పేర్కొంది.  సుశాంత్ రాజ్‌పుత్ కేసు విషయంలో కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. ఈ కేసు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 


ఆ తర్వాత,  ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కంగనా కార్యాలయంలోని కొన్ని భాగాలను కూల్చివేసి,  చట్టవిరుద్దంగా కట్టారని పేర్కొంది. ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కంగనా రనౌత్‌కు భద్రత కల్పించింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తన కార్యాలయాన్ని కూల్చివేసిన విషయాన్ని బాంబే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కంగనాకు రిలీఫ్ ఇస్తూ,  కంగనా రనౌత్ బంగ్లా భాగాన్ని కూల్చివేయడంలో దురుద్దేశపూరితంగా వ్యవహరించారని పేర్కొంది. కంగనాకు నష్టపరిహారం చెల్లించాలని కూడా బీఎంసీని కోర్టు ఆదేశించింది. 
Also Read: Ram Pothineni Sorry To Lingusamy : అన్నీ చెప్పి అసలు విషయం మర్చిపోయా.. క్షమించమంటూ ట్వీట్!


Also Read: Vishwak Sen -Arjun Movie: పవన్ సపోర్ట్..భుజం తట్టి నేనున్నానంటూ!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook