Threat to Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. ముంబై పోలీసులకు ఫోన్ చేసి మరీ ఆ వ్యక్తి బెదిరించడం గమనార్హం. రాజస్థాన్ జోధ్‌పూర్‌కు చెందిన రాకీభాయ్ అనే గోరక్షకుడు ఈ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 30వ ఆ హీరోను చంపేస్తా..బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని వచ్చిన బెదిరింపు ఇది. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌కు చెందిన రాకీ భాయ్ అనే గోరక్షకుడు ముంబై పోలీసు కంట్రోల్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది మొదిసారి కాదు. గత నెలలో కూడా రెండుసార్లు బెదిరింపులు వచ్చాయి. మార్చ్ 18, మార్చ్ 23 తేదీల్లో మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. జైళ్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ రారెన్స్ బిష్ణోయ్ ఓ ఇంటర్వ్యూలో కృష్ణజింక వివాదం కేసులో క్షమాపణలు చెప్పాలని సల్మాన్ ఖాన్‌కు డిమాండ్ చేశాడు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ 2018లో కోర్టు ఆవరణలోనే బిష్ణోయ్ ప్రకటించడం గమనార్హం. 


Also Read: Ram Charan For Salman Khan: సల్మాన్, వెంకీ కోసం రామ్ చరణ్‌.. లుంగీతో స్టెప్పులు.. ఇదేం డ్యాన్స్‌రా బాబు


గత నెలలో సల్మాన్‌ను బెదిరించిన కేసులో ముంబై పోలీసులు, వేగంగా చర్యలు తీసుకున్నారు. ఆ కేసులో థాకడ్ రామ్ సిహాగ్ అనే వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేశారు. మార్చ్ 18న సల్మాన్ ఖాన్‌కు వచ్చిన బెదిరింపు కేసులో యకేలోని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ముంబై పోలీసులు ఇంటర్‌పోల్ సహాయం తీసుకున్నారు. 


ఇటీవలి కాలంగా వస్తున్న బెదిరింపుల నేపధ్యంలో సల్మాన్ ఖాన్ ఇటీవలే బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేశారు. ఎక్కడికి వెళ్లాలన్నా కట్టుదిట్టమైన పోలీసు భద్రతతోనే వెళ్తున్నారు. ఆఖరికి మీడియా సమావేశాల్లో సైతం భద్రతతోనే పాల్గొంటున్నారు. 


Also read: Pragya Jaiswal Hot Pics: ప్రగ్యా జైస్వాల్ సోకుల సునామీ.. హాట్ స్టిల్స్ మాములుగా లేవుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook