Salman Khan New Car: సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు.. పవర్‌ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Salman Khan Nissan SUV Price: కృష్ణ జింకల వివాదం సల్మాన్ ఖాన్‌ను వెంటాడుతోంది. మరోసారి హత్య బెదిరింపు కాల్ వచ్చింది. గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వార్నింగ్ రాగా.. తాజాగా ఓ వ్యక్తి ముంబై కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు.
Salman Khan Nissan SUV Price: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు కలవరపడుతున్నారు. ఏప్రిల్ 30న హత్య చేస్తానంటూ ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బెదిరించడం కలకలం రేపుతోంది. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌కు చెందిన రాకీ భాయ్ అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించారు. గతంలోనే సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో తన భద్రతకు సల్మాన్ ఖాన్ పవర్‌ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశాడు. తెల్లరంగులో ఉన్న ఈ కారు చాలా స్టైలిష్ లుక్‌లో ఉంది. నిస్సాన్ పెట్రోల్ హైఎండ్ బుల్లెట్ ప్రూఫ్ SUV కారును దుబాయ్ నుంచి కండల వీరుడు తెప్పించుకున్నాడు. నిస్సాన్ పెట్రోల్ ఆన్ రోడ్ ప్రైస్ రూ.45.89 లక్షల నుంచి రూ.88 లక్షల మధ్య ఉంది. అయితే Maxabout.comలో ఈ కారు ధర రూ.కోటిగా చూపిస్తోంది. కొన్ని చోట్ల ఈ కారు వాహనం ధర రూ.2 కోట్లుగా ఉంది. వాహనం ధరకు సంబంధించి కూడా ఫిక్స్‌డ్ రేట్ అందుబాటులో లేదు. ఈ కారు మన దేశంలో అందుబాటులో లేదు. అందుకే సల్మాన్ ఖాన్ దుబాయ్‌లో ఈ కారును కొనుగోలు చేసి ఇండియాకు తెప్పించాడు. ఇంపోర్ట్ ట్యాక్స్, కస్టమ్ ట్యాక్స్ చెల్లించి ఆయన కారును దిగుమతి చేసుకున్నాడు.
కారు ప్రత్యేకతలు ఇదే..
నిస్సాన్ పెట్రోల్ B6 లేదా B7 కారు హైసెక్యూరిటీతో మార్కెట్‌లోకి వచ్చింది. B6 లేదా B7లోని B అంటే బాలిస్టిక్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ఎటు వైపు నుంచి బుల్లెట్లతో దాడి చేసినా లోపల ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. B6 స్థాయి వెహికల్ గాజు మందం 41 ఎంఎం. రైఫిల్స్‌తో కాల్చినా ఈ గ్లాస్‌లు బద్దలు అవ్వవు. B7 స్థాయి వాహనం 78 ఎంఎం మందపాటి గాజుతో ఉంటుంది. గతంలో వాడిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200 కారు స్థానంలో ఈ సరికొత్త నిస్సాన్ బుల్లెట్ ప్రూఫ్ SUV కారును వినియోగిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా ఈ కారులోనే వెళుతున్నారు.
Also Read: Salman Khan: ఈ నెల 30న చంపేస్తాము..బాలీవుడ్ కండలవీరుడికి తీవ్ర బెదిరింపు
సల్మాన్ ఖాన్‌కు గతంలో రెండుసార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. కృష్ణ జింక వివాదంలో సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. కొన్నిసార్లు మెయిల్స్ ద్వారా.. కొన్నిసార్లు లేఖల లేఖల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కండల వీరుడు పవర్‌పుల్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసి అందులోనే ప్రయణిస్తున్నాడు.
Also Read: IPL 2023 Records: ఐపీఎల్ 2023లో సూపర్ స్టార్లుగా మారిన ప్లేయర్లు వీళ్లే.. ఈ సీజన్ ఆణిముత్యాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి