Shah Rukh Khan injured :  బాలీవుడ్ బాద్​ షా షారుక్‌ ఖాన్​కు​ ప్రమాదం జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌లో  జరిగిన ఓ సినిమా షూటింగ్​లో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. ఓ సీన్ చేస్తుండగా షారుఖ్ ముక్కుకి దెబ్బతగిలి రక్తం కారింది. దీంతో వెంటనే మూవీ యూనిట్ ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. షారుఖ్ కు డాక్టర్లు చిన్న సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ తర్వాత షారుఖ్ ముక్కుకు కట్టుతో కనిపించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరి ఈ ప్రమాదం ఎప్పుడు, ఎలా జరిగిందనే విషయంపై షారుఖ్ కానీ, అతని బృందం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాదం తర్వాత షారుఖ్ ముంబైలోని తన ఇంటికి చేరుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది పఠాన్‌తో తిరిగి ఫామ్ లోకి వచ్చారు షారుఖ్. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. అంతేకాకుండా ఈ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరాడు బాద్ షా. దంగల్‌ తర్వాత వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన హిందీ మూవీ ఇదే కావడం విశేషం.  ప్రస్తుతం షారుఖ్ నటించిన జవాన్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ సెప్టెంబరు 07న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై హిందీతో పాటు దక్షిణాదిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 


Also read: Mangalavaram teaser: ఆసక్తి రేపుతున్న పాయల్​ 'మంగళవారం' టీజర్​..


మరోవైపు షారుఖ్, రాజ్‌ కుమార్‌ హిరానీతో డుంకీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో SRK సరసన తాప్సీ పన్ను నటించనుంది. ఈ ఏడాది చివర్లో డుంకీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా, సల్మాన్ ఖాన్ యెుక్క టైగర్ 3 చిత్రంలో షారుఖ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. 


Also read: దర్శకుడితో హీరోయిన్‌ రహస్య వివాహం.. ఆమె వ్యాఖ్యలు వెనక్కి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook