దర్శకుడితో హీరోయిన్‌ రహస్య వివాహం.. ఆమె వ్యాఖ్యలు వెనక్కి!

ఇటీవలే కల్పికా గణేశన్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ మరియు ధన్య బాలకృష్ణలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ వ్యాఖ్యలకు డైరెక్టర్ బాలాజీ మోహన్‌ కోర్టులో కేసు వేశారు. దీని కారణంగా కల్పికా గణేశన్ క్షమాపణలు కూడా చెప్పన సంగతి తెలిసిందే!

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2023, 07:55 PM IST
దర్శకుడితో హీరోయిన్‌ రహస్య వివాహం.. ఆమె వ్యాఖ్యలు వెనక్కి!

Kalpika Ganesh apologises to Balaji Mohan & Dhanya Balakrishna: మారి సినిమాతో పాటు పలు సినిమాలతో తమిళనాట స్టార్ దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న బాలాజీ మోహన్‌ ఆ మధ్య హీరోయిన్‌ ధన్య బాలకృష్ణ ను వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై వివాదాస్పద నటి కల్పికా గణేష్ మాట్లాడుతూ బాలాజీ మోహన్ మరియు ధన్య బాలకృష్ణలు వివాహం చేసుకున్నారు. వారిద్దరు కూడా రహస్యంగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు అంటూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసింది. 

మొదట ధన్య.. బాలాజీ మోహన్‌ లు పెళ్లి వార్తలను కొట్టి పారేశారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు ఔను తాము పెళ్లి చేసుకున్నాం అంటూ ప్రకటించారు. అయితే తమ వ్యక్తిగత విషయాలను బయటకు లాగి ఇష్టానుసారంగా తమ గురించి విమర్శలు చేసిన కల్పికా పై బాలాజీ మోహన్‌ పరువు నష్టం కేసు వేశాడు. ఆ కేసు కొనసాగుతూనే ఉంది. 

తాజాగా ఆ కేసు విషయం లో రాజీకి వచ్చేందుకు ఇరు వర్గాల వారు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కల్పికా ఇటీవల బహిరంగంగా ఒక వీడియో మెసేజ్ లో బాలాజీ మోహన్ మరియు ధన్య బాలకృష్ణ లకు క్షమాపణలు చెప్పింది. దాంతో బాలాజీ మోహన్ తాను పెట్టిన పరువు నష్టం కేసును వెనక్కి తీసుకున్నాడు. సోషల్‌ మీడియాలో కల్పికా షేర్ చేసిన క్షమాపణ వీడియోను అలాగే కొనసాగించాలని.. ఆ వీడియోను డిలీట్ చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయి అంటూ కోర్టు ఆదేశించింది.

బాలాజీ మోహన్‌ ఇంకా ధన్య బాలకృష్ణ లకు క్షమాపణ లు చెబుతున్నట్లుగా ఆమె పేర్కొంది. ఇకపై ఎప్పుడు కూడా బాలాజీ మోహన్ మరియు ధన్య బాలకృష్ణల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయను అని.. అసత్య మాటలు మాట్లాడను అంటూ కల్పికా తన క్షమాపణ వీడియోలో పేర్కొంది. 

Also Read: Spy Movie Total Collections: స్పై మూవీ కలెక్షన్స్ అదుర్స్.. నిఖిల్‌కి మళ్లీ పండగే

మొత్తానికి ఆ సమయంలో వారిద్దరిపై చాలా ఘాటుగా విమర్శలు చేసిన కల్పిక ఇప్పుడు మాత్రం తప్పుడు వ్యాఖ్యలపై పశ్చాతాపం వ్యక్తం చేసింది. పరువు నష్టం కేసుకు భయపడి కల్పికా గణేష్ క్షమాపణలు చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. 

గతంలో కల్పికా పలువురు టాలీవుడ్ తో పాటు ఇతర భాషల సెలబ్రెటీలను కూడా నోటికి వచ్చినట్లుగా మాట్లాడి  ట్రోల్‌ చేయడం జరిగింది. ఈ దెబ్బతో ఆమె ఇకపై ఏ ఒక్క స్టార్‌ విమర్శించినా కూడా శిక్ష తప్పదు అనే భయంతో ఉండే అవకాశాలు ఉన్నాయి.

Also Read: ఎన్టీఆర్ డైలాగ్​తో 'పెదకాపు -1' టీజర్​.. ఊర మాస్ గా వస్తున్న శ్రీకాంత్ అడ్డాల..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News