Jhanvi Kapoor: జాన్వీ కపూర్ తెలుగు డెబ్యూ వెనుక పెద్ద ప్లాన్.. ఆ హీరోయిన్ ని సైతం వెనక్కి!
Jhanvi Kapoor:టాలీవుడ్ అతిలోకసుందరి.. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భామ తెలుగులో ఫుల్లుగా సెటిల్ అవ్వడానికి పెద్ద ప్లాన్ వేసింది అన్న టాక్ నడుస్తోంది..
Jhanvi Tollywood Entry: జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. హిందీలో అందరు నట వారసులను ప్రమోట్ చేసే కరణ్ జోహార్ మూవీ ధడక్ తో ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. సాఫ్ట్ హీరోయిన్ రోల్స్ తో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా జాన్వీ మంచి పేరు తెచ్చుకుంది. గ్లామరస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. శ్రీదేవి లాంటి ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ కూతురు అయినప్పటికీ మొదటినుంచి ఆమె కేవలం హిందీ పరిశ్రమకే పరిమితమైంది.
జాన్వీ సినీ కెరీర్ లో ధడక్ తర్వాత ఇప్పటివరకు ఆ రెంజ్ బ్లాక్ బస్టర్ హిట్ మరొకటి లేదు. దీంతో ప్రస్తుతం జాన్వి తన దృష్టి సౌత్ ఇండస్ట్రీ పై పెట్టింది అని టాక్. నిజానికి ఆర్ఆర్ఆర్ మూవీతో జాన్వీ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రాజమౌళి భావించారట. అయితే మూవీలో ఆమె పాత్ర బోనీ కపూర్ కి నచ్చలేదు.. దీంతో ఆర్ఆర్ఆర్ లాంటి మూవీలో ఆఫర్ మిస్ చేసుకుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తండ్రి కూతుర్లు ఇద్దరు ఎలాగైనా టాలీవుడ్ లో సక్సెస్ సాధించాలి అనే తపనతో ఉన్నారట.
అందుకే జాన్వీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె పిఆర్ బృందం కూడా ఈ విషయాన్ని ఎంతో బలంగా పబ్లిసిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయడానికి పిఆర్ బృందం ఎంతో కష్టపడుతోంది..ప్రస్తుతం జాన్వీ ,ఎన్టీఆర్ తో చేస్తున్న దేవర మూవీ ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తే ఇక తెలుగులో ఆమె కెరీర్ కు డోకా ఉండదు. ప్లాన్ బి గా రామ్ చరణ్ మూవీ ఉండనే ఉంది. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే సౌత్ ఇండస్ట్రీ లో ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.
ఇటు నార్త్ లో కూడా క్రేజ్ కంటిన్యూ అవుతుంది. రామ్ చరణ్ మూవీ తో పాటు మరొక రెండు భారీ తెలుగు చిత్రాల కోసం జాన్వీ ను సంప్రదించారని టాక్. అయితే జాన్వీ కు క్రేజ్ పెరగడం శ్రీ లీల లాంటి హీరోయిన్లకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదే కొనసాగితే శ్రీ లీల ఖాతాలో ఉన్న ఒకటి రెండు సినిమాలు కూడా త్వరలో జాహ్నవి ఖాతాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు
Also Read: Bus Yatra: చంద్రబాబు జిత్తులమారి.. పొత్తులమారి: బస్సు యాత్రలో జగన్ ధ్వజం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook