Boycott Liger Trend: విజయ్ కామెంట్స్ దెబ్బకు `బాయ్ కాట్ లైగర్` ట్రెండ్ మొదలు!
Boycott Liger Trend Started in Social Media: బాలీవుడ్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ ఇప్పుడు లైగర్ సినిమాకి కూడా తాకింది. ఆ వివరాల్లోకి వెళితే
Boycott Liger Trend Started in Social Media: అనుకున్నంతతా అయ్యింది, బాలీవుడ్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ ఇప్పుడు లైగర్ సినిమాకి కూడా తాకింది. బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ బలంగా వ్యాపించిందని చెప్పచ్చు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ మొత్తాన్ని బాయ్ కట్ చేస్తామంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. తర్వాత ఎందుకో ఆ ట్రెండ్ కాస్త వెనకబడింది. కానీ ఈ ఏడాది బాలీవుడ్ లో ఎలాంటి పెద్ద సినిమాలు విడుదలవుతున్నా దానికి కొద్ది రోజుల ముందు ఈ ట్రెండ్ ని తెరమీదకి తీసుకువస్తున్నారు బాలీవుడ్ నెటిజన్లు.
ఇప్పటికే లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్ వంటి సినిమాలకు కూడా ఈ ట్రెండ్ బలంగా వినిపించింది. ఆలియా భట్ నటించిన మరో నెట్లిక్స్ మూవీకి కూడా ఇదే విధంగా ట్రెండ్ చేశారు నెటిజన్లు. ఇప్పుడు తాజాగా కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామ్యంతో రూపొందించబడిన లైగర్ సినిమాను కూడా బాయ్ కాట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైగర్ మూవీ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అలాగే తాప్సీ పన్ను నటించిన దోబారా సినిమాని కూడా బాయ్ కట్ చేయాలనే వాదన వినిపిస్తోంది.
కరణ్ జోహార్ దెబ్బతో
పూరీ జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుని లైగర్ సినిమా మొదలు పెట్టారు. విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా ప్లాన్ చేసిన తరువాత కరణ్ జోహార్ సినిమాకు నిర్మాణ భాగస్వామి అయ్యారు. తరువాత ఆయన కాంపౌండ్ కు చెందిన అనన్య పాండే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రమ్యకృష్ణ విజయ్ తల్లిగా నటించిన ఈ సినిమాలో మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటించారు. పూరీ కనెక్ట్స్-ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూరీ జగన్నాధ్-చార్మీ కౌర్, కరణ్ జోహార్-అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కరణ్ జోహార్ సినిమా కావడంతో మాములుగానే బాలీవుడ్ బాయ్ కాట్ బ్యాచ్ దృష్టి సినిమా మీద పడుతుందని అనుకుంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ కావాలని వివాదాన్ని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అసలు విషయం ఏమంటే ఈ బాయ్ కాట్ ట్రెండ్ గురించి ప్రమోషన్స్ లో పూరి జగన్నాథ్ స్పందించిన విధంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు. అయితే అది కాస్త గర్వంతో కనిపిస్తోంది. ముందుగా ఒక నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ ఒక ఫిలిం సెట్లో నటుడు నటులతో పాటు అనేకమంది పనిచేస్తారని ఒక సినిమా కోసం 200 నుంచి 300 మంది నటులు పని చేస్తారు కానీ 2000 నుంచి 3000 కుటుంబాల వరకు దీనివల్ల లబ్ధి పొందుతారని చెప్పుకొచ్చారు.
అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా చేస్తున్నాడు అంటే ఆయన హీరోగా మాత్రమే నటిస్తున్నాడని కానీ సినిమా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు మూడు వేల కుటుంబాలు లాభపడుతున్నాయని చెప్పుకొచ్చారు విజయ్. అసలు మీరు ఒక సినిమాను బాయ్ కాట్ చేస్తున్నారు అంటే మీరు కేవలం అమీర్ ఖాన్ ని ఎఫెక్ట్ చేస్తున్నట్టు కాదు ఆ సినిమా కోసం పని చేసిన వేల కుటుంబాలను మీరు ఎఫెక్ట్ చేస్తున్నట్లే అని చెప్పుకొచ్చారు. అసలు ఈ బాయ్ కాట్ ట్రెండ్ ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ ఒక పెద్ద మిస్ అండర్స్టాండింగ్ జరుగుతోందని మీరు కేవలం అమీర్ ఖాన్ ను ఎఫెక్ట్ చేయడం లేదు మొత్తం ఎకానమీని ఎఫెక్ట్ చేస్తున్నారు ఇది చాలా పెద్ద విషయం అని చెప్పుకొచ్చారు.
మరో వివాదాస్పద సమాధానం:
అక్కడితో ఆపేస్తే బాగుండేదేమో మరో ఇంటర్వ్యూలో అసలు ఈ విషయం మీద ఎక్కువ అటెన్షన్ చూపిస్తున్నారని విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడు. మేను సినిమాలు చేస్తాం ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళే చూస్తారు, ఎవరు చూడొద్దనుకుంటున్నారో వాళ్ళు టీవీలో, ఫోన్లో చూస్తారు. అందులో అసలు మేము చేసేదేముంది? వాళ్ల గురించి పెద్దగా మాట్లాడక పోవడం బెటర్ అంటూ బాయ్ కాట్ ట్రెండ్ చేస్తున్న వారి గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బలుపు చూపిస్తున్నాడని
ఈ దెబ్బతో ఆ బాయ్ కాట్ ట్రెండ్ మొదలు పెట్టేశారు. తాజాగా వివాదంగా మారిన విజయ్ దేవరకొండ టేబుల్ మీద కాళ్లు పెట్టిన ఫోటోని కూడా ట్రెండ్ చేస్తూ ఇలాంటి బలుపు ఉన్న హీరోల సినిమాలను బాయ్ కట్ చేయాల్సిందే అంటూ పిలుపునిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది తెలుగువారు కూడా మేము ఈ బాయ్ కాట్ ట్రెండుకి మద్దతు ఇస్తున్నాం ఎందుకంటే ఇది తెలుగు సినిమా కాదు, తెలుగులో డబ్బింగ్ అవుతున్న ఒక స్ట్రైట్ హిందీ సినిమా అంటూ ఈ ట్రెండ్ కి మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అలాగే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లగా ఆ సమయంలో విజయ్-అనన్యలతో విజయ్ తల్లి పూజలు జరిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలతో వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటున్నసమయంలో ముగ్గురు అర్చకులు నిలబడి ఉంటే హీరో హీరోయిన్లు కూర్చొని ఆశీర్వచనాలు తీసుకోవడం ఏమిటి? కనీసం వాళ్ళ పండితుల పాదాలనైనా పట్టుకోలేదు కదా అంటూ ఇలాంటి హిందూ ఆచారాలకి గౌరవం ఇవ్వని వాళ్ళ సినిమాలను బాయ్ కట్ చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు.
అలాగే మరికొందరు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం ఎవరో ఇంకా తెలియలేదు, ఆ మరణానికి కారణమైన వారిలో ఒకరైన కరణ్ జోహార్ సినిమా కాబట్టి లైగర్ మూవీ బాయ్ కట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు. కానీ విజయ అభిమానులు మాత్రం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాగా విజయ్ దేవరకొండ కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడని అందుకని బాలీవుడ్ ప్రేక్షకులు ఆయనని ఆదరించాలని కోరుతున్నారు.
Also Read: Anasya Bharadwaj in Twitter Controversy: మరో వివాదంలో అనసూయ.. ఈసారి ఏకంగా కేటీఆర్ ట్వీట్ తో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook