Pushpa 2 Ticket Rates: అల్లు అర్జున్ హీరోగా,  సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప 2. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతిబాబు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, స్పెషల్ సాంగ్ విడుదల అవ్వగా భారీ రికార్డులు క్రియేట్ చేసాయి. అంతేకాదు అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్,  స్పెషల్ సాంగ్ గా రికార్డు సృష్టించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ను భుజాన వేసుకొని మరీ ముందుకు వెళ్తున్నారు. ఈవెంట్ ఎక్కడ నిర్వహించినా సరే స్వయంగా వెళ్లి మరీ ప్రేక్షకులలో సరికొత్త అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతోంది . మరొకవైపు దేశవ్యాప్తంగా అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 


ఇలాంటి సమయంలో తెలంగాణలో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ఒక కొత్త డిమాండ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి కారణం టికెట్ ధరలే అని సమాచారం. ముఖ్యంగా మైత్రి ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న ఈ సినిమా కు టికెట్ ధరలు భారీగా పెంచేశారు.  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీగా ధరలు పెంచేశారు. ప్యూర్ లీ సెల్ఫిష్ మూవీ అందుకే తెలంగాణలో దీనిని బాయ్కాట్ చేయాలి అంటూ #BoycottPushpa2TheRule ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. 


ఈ మైత్రి మూవీ ప్రొడక్షన్ హౌస్ సినిమా కల్చర్ ని పూర్తిగా చంపేసింది. వారు కేవలం బిజినెస్ పరంగా మాత్రమే ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు గతంలో దిల్ రాజు ఇలా స్వార్థంగా ఆలోచించేవారు.  అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఆయన స్వార్ధాన్ని మించిపోయారు అంటూ మండిపడుతున్నారు. 


పెంచిన ధరల విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్ లో రూ.150 అధికంగా పెంచడం జరిగింది.  ముఖ్యంగా ఫస్ట్ నాలుగు రోజులు మల్టీప్లెక్స్ లో రూ.200,  సింగిల్ స్క్రీన్ లో 150 రూపాయలు అదనంగా పెంచడంతో అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు అధికంగా పెరగడంతో ఇంత ఖర్చు పెట్టి సినిమా చూడలేమంటూ ఫైర్ అవుతున్నారు.


Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్‌ ప్రజలకు తెలుసు'


Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్‌ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter