RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్‌ ప్రజలకు తెలుసు'

Konda Surekha She Is Mentally Disabled Says RS Praveen Kumar: గురుకులాల విద్యాలయాలపై మాట్లాడుతుంటే రేవంత్‌ రెడ్డి మతిస్థిమితం లేని వారితో మాట్లాడిస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 30, 2024, 04:27 PM IST
RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్‌ ప్రజలకు తెలుసు'

RS Praveen Kumar: వరుస కలుషిత ఆహార ఘటనలతో గురుకుల విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చనిపోతున్నా రేవంత్‌ రెడ్డి మేల్కోకుండా మతిస్థిమితం లేని కొండా సురేఖ లాంటి వారితో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ వ్యవహారాలు వరంగల్‌ జిల్లాలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read: Indiramma House: తెలంగాణ ప్రజలకు గృహయోగం.. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు

బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన 'గురుకులాల బాట' కార్యక్రమం వివరాలు శనివారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో బాల్క సుమన్‌, గెల్లు శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల విద్యావ్యవస్థ కుప్పకూలిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యావ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. రేవంత్‌ పాలనలో సర్వనాశనమయ్యాయని వాపోయారు.

Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్‌ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు

'ఒకే జిల్లాలో మూడు సార్లు గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారానికి గురయ్యారు. 28 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గురుకులాల్లో పని చేస్తున్న టీచర్లకు ఆరు నెలల నుంచి జీతాలు రావడం లేదు' అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడించారు. 'కేటీఆర్ గురుకుల బాటకు పిలుపునిచ్చారు. గురుకులాల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తాం. గురుకుల బాట 
పిలుపుతో కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టింది' అని తెలిపారు.

కొండా సురేఖపై ఆగ్రహం
'విద్యాశాఖపై రేవంత్‌ రెడ్డికి అవగాహన లేదు. మతిస్థిమితం లేని మంత్రులతో నాపై మాట్లాడిస్తున్నారు. కొండా సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించింది. కొండా సురేఖ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ప్రజలు గుర్తించారు. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. కొండా సురేఖ కుటుంబం గురించి వరంగల్ ప్రజలకు తెలుసు. ఆమెకు నేరచరిత్ర ఉంది. కొండా కుటుంబానికి నళిని ప్రభాత్ వరంగల్ నడి రోడ్డులో కౌన్సిలింగ్ ఇచ్చారు' అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'గురుకులాలపై రేవంత్ రెడ్డికి, మంత్రులకు శ్రద్ద లేదు. మంత్రి సీతక్క తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. కొండా సురేఖ మత్తులో ఉండి మాట్లాడుతున్నారు' అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. 'నేను ప్రభుత్వ వసతిగృహాల్లో చదువుకుని ఐపీఎస్ అయ్యా. దేశ రక్షణ కోసం పనిచేశా. ఏడు సంవత్సరాల సర్వీసును వదిలి రాజకీయాల్లోకి వచ్చా. పోలీస్ యూనిఫార్మ్ పక్కన పెట్టి గురుకులాల కార్యదర్శిగా తొమ్మిది సంవత్సరాలు పనిచేశా' అని ప్రవీణ్‌ కుమార్‌ గుర్తుచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News