Brahmaji Counter to Anasuya and Prabhas: చాలా కాలం నుంచి సినీ పరిశ్రమలో ఉంటూ  హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిన బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బ్రహ్మాజీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల అవుతున్న క్రమంలో ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 29వ తేదీన ఘనంగా నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా ఈ లైక్, షేర్ అండ్  సబ్స్క్రైబ్  సినిమా రూపొందగా శ్యామ్ సింగరాయ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నేచురల్ స్టార్ నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మజీ మాట్లాడుతూ మేర్లపాక గాంధీ ప్రతి సినిమాలో నన్ను తీసుకుని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడని సంతోష్ శోభన్ ను ఇప్పుడు చూస్తుంటే పదేళ్ల క్రితం నానిని చూస్తున్నట్లుగా ఉందని అన్నారు.


భవిష్యత్తులో సంతోష్ కూడా నాని అంతటి పెద్ద స్టార్ అవుతాడని అనుకుంటున్నానని ఈ సినిమా 100% మీకు నచ్చితేరుతుందని నాన్ స్టాప్ గా మీరు నవ్వుతూనే ఉంటారని బ్రహ్మాజీ చెప్పకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా బ్రహ్మాజీ చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ఎవడ్రా వాడు కేసు పెడతాను ఏమనుకుంటున్నారో అంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో అనసూయ తన బాడీ షేమింగ్ చేశారని చెబుతూ పలువురి మీద కేసు పెడతానని బెదిరించగా తనను కూడా ఇకమీదట అంకుల్ అంటే కేసు పెడతానని బ్రహ్మ అప్పట్లో కౌంటర్ ఇచ్చారు.


నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎవరో అంకుల్ అనడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. మరోపక్క యూ కం టు మై రూమ్ అంటూ కామెంట్ చేయడం కూడా వైరల్ అవుతుంది. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసిన సమయంలో ప్రభాస్ ఓం రౌత్ మీరు నా రూమ్ కి రండి అంటూ ఇంగ్లీష్ లో చెప్పిన కామెంట్ వైరల్ అయింది. ఇప్పుడు చాలా రోజుల తరువాత ఈ నేపథ్యంలో దాన్ని కూడా వాడుతూ బ్రహ్మజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Also Read: Pranitha Subhash Latest Photoshoot : ప్రణీత.. ఏంటీ అందాల ఆరబోత.. తల్లైనా తగ్గేదేలే


Also Read: Puri Jagannadh open Letter: ఆడియన్స్ ని తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు.. కలకలం రేపుతున్న పూరీ జగన్నాధ్ లేఖ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook