Brahmamudi March 9th Episode: ఈరోజు ఎపిసోడ్‌లో స్వప్న అద్దం ముందు మేకప్ వేసుకుంటూ ఉంటుంది. చూశావా..? మామ్ వద్దన్నా మోడలింగ్ పని చేస్తుంది అంటాడు రాహుల్. ఆగరా.. అది ఆ పనిచేస్తేనే మంచిది.. నువ్వు మోడలింగ్ చేయడమే మంచిది అని సపోర్ట్‌ చేయి అది ఇల్లు దాటే సరికే నేను చేయాల్సిన పని చేస్తాను అంటుంది రుద్రాణీ. వావ్.. నువ్వు చాలా బాగున్నావు మోడలింగ్ మంచిదే అన్నట్లు మాట్లాడతాడు. నువ్వు సపోర్ట్‌ చేసినట్లు నటించి నాసంపాదన మీద బతికేద్దామనుకుంటున్నావా? అని వెళ్లిపోతుంది స్వప్న.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న గౌన్ వేసుకుని హాల్లోకి వస్తుంది అపర్ణ మిగతా కుటుంబసభ్యులంతా బిత్తరపోయి చూస్తారు. ఎక్కడికి అని రుద్రాణీ అడుగుతుంది. ఓ అడ్వర్టైజ్ మెంట్ కంపెనీకి బికినీ యాడ్ చేయడానికి వెళ్తున్నా అంటుంది స్వప్న. మీరు నా సమస్యను అర్థం చేసుకోరు కదా అంటుంది. దీంతో తాతయ్య అమ్మ స్వప్ప అని పిలుస్తాడు. నీకు నీబిడ్డకు న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నాను అని లక్షల్లో ఆదాయం వచ్చే ఓ షాపింగ్ కంప్లెక్స్ ను స్వప్న పేరు మీద తాతయ్య రాసిన పత్రాలను ఇస్తాడు. దీంతో ధాన్యలక్ష్మి, అనామిక అసూయతో ముఖాలు చూస్తుకుంటారు. ఇక రాహుల్, రుద్రాణీలు నోరెళ్లబెడతారు. నీజీవన భృతి కోసం గర్భవతి అయిన నువ్వు ఇలాంటి పనులు చేయకూడదని ఇస్తాడు. దీన్ని అమ్మె హక్కు నీకు లేదు ఇక్కడున్న ఎవరికీ లేదు కేవలం దీని మీద వచ్చే ఆదాయం మాత్రమే అనుభవించవచ్చు అంటాడు. దీనికి ధాన్యలక్ష్మి అదేంటత్తయ్య అంత ఆస్తిని రాసిస్తే మీరేం అడగలేదు అంటుంది. నీ పుట్టింటి ఆస్తి కాదు కదా రుద్రాణీ ఏం నీ రక్తం పంచుకుని పుట్టలేదు కదా అంటుంది.


దీంతో అనామిక కూడా స్వప్నకు పుట్టబోయే బిడ్డ ఈ దుగ్గిరాల వంశ వారసుడేం కాదు కదా అంటుంది. అంత ఆస్తి రాస్తే ఏం అనవేం అక్క అని అపర్ణను నిలదీస్తుంది ధాన్యలక్ష్మి. దీనికి ప్రకాశం మా నాన్న నిర్ణయాన్నే ధిక్కరిస్తావా? అంటాడు. ఇక అనామికను కూడా కల్యాణ్ ఇన్నాళ్తు రుద్రాణీ అత్తయ్యను ఈ ఇంటి ఆడపడుచుగానే చూశాం నువ్వేంత నీ అనుభవం ఎంత? మా అమ్మలాగే వేరు చేసి మాట్లాడతావ్. రిలేషన్ షిప్ గురించి నీవు మాట్లాడకు అంటాడు. అంటే నీవు తాతయ్యగారి నిర్ణయాన్నే ధిక్కరిస్తున్నావా అంటుంది స్వప్న. మామయ్య నిర్ణయాన్ని ఎదిరించే హక్కు ఎవరికి లేదు అంటుంది అపర్ణ. 


అప్పుడే అనామిక పైకి రూంలోకి వెళ్తుంది. అప్పుడే వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది. జరిగిన విషయం చెబుతుంది. అందుకే మీ ఆయన్ను గుప్పిట్లో పెట్టుకోమంది అంటుంది. అల్లుడు బయట పడుకుంటున్నాడు అంటుంది. ఇప్పుడు నీ దారిని మార్చు. పోట్లాటతో దగ్గర అవ్వకపోతే, ప్రేమతో దగ్గర అయి తిరిగి నీ దారికి తెచ్చుకో అంటుంది. అంత పెద్ద ఇంట్లో నీ మొగుడు సపోర్ట్ లేంది ఏం సాధించలేవని హితబోధ చేస్తుంది. ఇప్పుడు చూడు నా ప్లాన్ మొత్తం మార్చేస్తా అంటుంది అనామిక.


ఇదీ చదవండి: మెగా కాంపౌండ్ హీరోల కష్టాలు.. ఇక రంగంలోకి మెగాస్టార్ దిగాల్సిందేనా!


ఇక రాజ్ భాస్కర్ పీడ వదిలిపోయిందని డ్యాన్స్ చేసుకుంటూ హాల్లోకి వస్తాడు. ఏ కళావతి బ్లాక్ కాఫీ తీసుకురా అంటాడు. కిచెన్లోకి వెళ్లిన కావ్యతో పాపం మీ బావ లేడనుకుని కాఫీ కావలని అడుగుతున్నాడు పొద్దున్నే వచ్చాడని తెలిస్తే ఆశ్చర్యపోతాడు అంటుంది అమ్మమ్మ. ఈలోగా కాఫీ తోపాటు ప్రొటీన్ షేక్‌ ను ట్రేలో తీసుకవస్తుంది. అదేంటో నువ్వు తాగుతున్నావా? అంటాడు లేదు మాబావకు ఇస్తాను మా బావ గార్డెన్లోనే ఉన్నాడు అంటుంది. వాట్.. ఎవర్రమన్నారు? అంటాడు, నేనే రమ్మన్నాను అంటుంది ఇందిరాదేవి. అక్కడ వాళ్ల అత్తగారు చూసుకుంటారు కదా అంటాడు.కనకాన్ని ఇబ్బంది పెట్టడం దేనికి ఇక్కడైతే మనందరం ఉన్నాం కదా అంటుంది ఇందిరా దేవి. ఏం రాజ్ నీకు ఇష్టం లేదా? చెప్పు పంపించేస్తాను. దీనికి అమ్మమ్మ చెప్పానా కావ్య నా మనవడు ఏం అనడని అంటుంది. వెళ్లి నీ బావ దగ్గరికి వెళ్లి సేవలు చేసుకో అంటాడు. 


ఇదీ చదవండి: బావ ఈజ్ బ్యాక్.. మిస్టర్ ఈగో చిందులు.. బెడ్‌రూం కంటే జైలు బెట్టర్ అంటున్న కల్యాణ్..


దీంతో జుట్టు పీక్కున్నంత పని చేస్తాడు రాజ్. గార్డెన్లో ఊయల్లో ఉన్న భాస్కర్, కావ్యలను కిటికీలో నుంచి చూస్తాడు. రాజ్ చూస్తున్నాడని గమనించి. బావా ఎలా ఉంది ప్రోటీన్ షేక్ నీకోసమే ప్రత్యేకంగా చేశా అంటుంది. అబ్బబ్బా సూపర్ అంటూ తాగేస్తాడు. ఇక గదిలో మళ్లీ రాజ్ అంతరాత్మ విజిల్ వేస్తూ ప్రత్యక్షమవుతాడు. ఏంటి బాస్ అంతరాత్మ కొట్టి పిలిచిన పలకలేనంత పరధ్యానం లో ఉన్నావ్ అంటుంది రాజ్ అంతరాత్మ. కళావతి ముఖం ఎంత కళకళలాడుతుంది. నీ ముఖం వెలవెలబోతుంది అంటాడు. ఇలానే ఉంటే దాని బావ దాని ఎగరేసుకుపోతాడు అంటాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter