Brahmamudi October 3 Episode: తన భర్త మనసులో భార్యకు చోటు లేదు అని తెలిసిన భార్య ఎలా కాపురం చేస్తుంది. కేవలం తల్లికోసమే కాపురం చేస్తున్న అన్న మనిషిని ఎలా కలవాలి. నేను కాదు నువ్వే అడుగు అక్క తన మనస్సులో నేను ఉన్నానని ఇప్పుడే వెళ్లి తనకు సారీ చెప్తా అంటుంది కావ్య. అంతేకాదు మా అత్తగారి కాళ్లపై పడి క్షమించమని అడుగుతా. తన ఆరోగ్యం బాగులేనప్పుడు తన వద్ద లేను అని అంటుంది కావ్య. దీనికి స్వప్న బిత్తరపోయి ఏమోనే ఇక్కడ నీకు చెప్పలేకపోతున్నా.. అక్కడ రాజ్‌కు చెప్పలేకపోతున్న అంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు అవార్డు ఫంక్షన్ సీన్‌ వస్తుంది. దుగ్గిరాల వారి ఇంటి నుంచి కూడా టీవీలో అవార్డు ఫంక్షన్‌ చూస్తుంటారు. ఈ లోగా హోస్ట్ అవార్డు వరించబోయే కంపెనీ గురించి మాట్లాడతాడు. అప్పుడే లెట్టర్ వస్తుంది. గత పదేళ్లుగా స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్ ఇండస్ట్రీస్‌ మాత్రమే ఈ ఎక్స్‌పోలో విన్నర్‌. ఈ సారి కొత్తగా ఏదైనా మిరాకిల్‌ జరుగుతుందా? అని లెట్టర్‌ ఓపెన్‌ చేస్తాడు. హోస్ట్‌ పేరు చూసి వావ్‌.. వెర్రీ సర్‌ప్రైజ్‌ దిస్‌ అవార్డు గోస్‌ టూ అంటూ ఉండగా రాజ్‌ లేవబోతాడు. అప్పుడే సామంత్‌ గ్రూప్‌ ఆఫ్‌ జువెలరీస్‌ అంటాడు హోస్ట్‌.. దీంతో దుగ్గిరాల ఇంట మాత్రమే కాదు రాజ్‌కు కూడా పెద్ద షాక్‌ తగిలినట్లవుతుంది. ఇక అనామిక, సామంత్‌ల ఆనందానికి అవధలు లేవు. మరోవైపు కావ్య కూడా పక్కనే కూర్చొని అవార్డు దుగ్గిరాల కంపెనీకి రాకపోవడంతో బిత్తరపోతుంది. 


ఆ తర్వాత హోస్ట్‌ సామంత్‌ను స్టేజీ పైకి పిలుస్తాడు. స్టేజిపై సామంత్‌ నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకే కాదు ఇక్కడున్న ఇంకొంతమందికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది.  ఇది నమ్మలేకపోతున్నా.. కల నిజమా తెలియడంలేదు కానీ, ఇది నిజం ఎన్నో ఏళ్లుగా ఈ అవార్డు కోసం ఎదురు చూశా ఆ కల ఇప్పుడు నెరవేరింది అంటాడు. ఈ ప్రదర్శనలో మా సంస్థకు అవార్డు వస్తుందని ఏమాత్రం ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు, చివరగా సాధించా. ప్రతి మగాడ విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని. కానీ, నా విజయం వెనుక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మొదటి స్త్రీ అనామిక అని స్టేజి పైకి పిలుస్తాడు. రాగానే నా విజయం వెనుక తనే ఉంది. నేను త్వరలో అనామికను పెళ్లి చేసుకోబోతున్నా అని ప్రకటిస్తాడు. దుగ్గిరాల ఇంటవారు కూడా టీవీలో చూసి ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.



అలాగే నా విజయానికి కారణమైన రెండో వ్యక్తి మా క్రియేటీవ్‌ డిజైనర్‌ మిస్సెస్‌ కావ్య అని స్టేజ్ పైకి సామంత్‌ ఆహ్వానిస్తాడు. దీంతో ఒక్కసారిగా తన కాళ్ల కింద ఉన్న భూమి కంపించినట్లుగా ఫీల్‌ అవుతుంది. ఆశ్చర్యానికి గురవ్వడం తన వంతైంది. ఈ అవార్డు అందుకునే అర్హత మాకన్నా మిస్సెస్‌ కావ్యకే ఉంది అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న మేనేజర్‌ను ఏంటి ది నేను ఇచ్చిన డిజైన్స్‌ వేరే కంపెనీకి కదా వాళ్ల చేతికి ఎలా వచ్చింది అని అడుగుతంది. అయ్యో మీకు తెలిదా ఈ కంపెనీ కూడా సామంత్‌ గ్రూప్‌ బినామీ అంటాడు. అనామిక మైక్‌ తీసుకుని వచ్చి అవార్డు తీసుకో కావ్య అని పిలుస్తుంది. ఈలోగా పక్కనే ఉన్న మేనేజర్‌ కూడా అమ్మ అవార్డు తీసుకో అమ్మ అంటూ ఇబ్బంది పెడుతుంటాడు. ఇక చేసేదేం లేక కావ్య స్టేజీ వైపునకు రాజ్‌ను చూస్తూ భయపడుతూ, బాధపడుత వెళ్తుంది. అందరూ చప్పట్లు కొడుతుంటారు.


దుగ్గిరాల ఇంటి వారు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. మరోవైపు రుద్రాణీ ఏం తెలియనట్లుగా లోలోపల నవ్వుకుంటుంది. స్టేజీ పైకి వచ్చిన కావ్య ఇంత మోసమా ఇదంతా నువ్వు కావాలనే చేశావు కదా అని అనామికను నిలదీస్తుంది. దీనికి మైక్‌ తీసుకున్న అనామిక్ వన్‌ సెకండ్‌ సామంత్‌ గ్రూప్‌కే అవార్డు రావాలనే ఎంతో కష్టపడింది కావ్య మేం అందుకునే కన్నా కావ్య అందుకుంటేనే సముచితంగా ఉంటుందని కావ్యను ఇరికించేస్తుంది. అవార్డు తీసుకుంటుంది కావ్య రాజ్‌ చూశావా ఇద్దరికిద్దరు దుగ్గిరాల ఇంటి నుంచి బయటకు రాగానే ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నారో అంటుంది రుద్రాణీ.


ఇదీ చదవండి: సామంత్‌తో రొమాన్స్‌ చేస్తూ రెచ్చిపోయిన అనామిక.. ఆవేశపడకు అంబుజాక్షి అవార్డు ఎవరిని వరించిందో తేలిపోయిందిగా..!



మరోవైపు కావ్య ప్రత్యర్థి గ్రూపుకు పనిచేయడం ఏంటి అంటుంది అపర్ణ. కళ్ల ముందు కనిపిస్తుంటే నమ్మకపోవడం ఏంటి అంటుంది ధాన్యలక్ష్మి. ఇప్పటికైనా కళ్లు తెరచి ఎవరు ఎవరో అర్థం చేసుకో అంటుంది. చాల్లే ఆపు కావ్య అలాచేసిందంటే నేను నమ్మను అంటాడు ప్రకాశం. దీనికి అమ్మమ్మ కూడా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటుంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరు చూడరు అనుకుంటుంది అంటూ లేచి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మి.


ఇదీ చదవండి:  సామ్‌కు అండగా కదిలిన తారాలోకం.. నిరాధార ఆరోపణలు చేస్తే మౌనంగా కూర్చోం అంటూ జూ.ఎన్టీఆర్‌ ఆగ్రహం..


ఇక కావ్యను చుట్టుముట్టిన మీడియావారు దుగ్గిరాల వారికి వ్యతిరేకంగా పనిచేయడానికి కారణమేంటి? రాజ్‌ మీరు విడిపోవడానికి కారణమేంటి? ఆ ఇంటి నుంచి వెళ్లిపోయిన అనామికతో చేతులు కలిపారా? కావాలనే ప్రత్యర్థి గ్రూప్‌ను దుగ్గిరాలకు వ్యతిరేకంగా గెలిపించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఏం మాట్లాడకుండా బయటకు వెళ్లిపోతుంది కావ్య తనతోపాటు స్వప్న కూడా వెళ్తుంది. ఇంకా ఇక్కడే ఉంటే గొడవ అయ్యేలా ఉంది వెళ్లిపో అంటుంది స్వప్న కావ్య ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన రాజ్‌ రుద్రాణీలు కంగ్రాట్యూలేషన్‌ అంటూ చేయి చాపుతాడు. అద్భుతం.. నీకు మాటకుమాట జవాబు చెప్పడం మాత్రమే తెలుసు అనుకున్నా.. మాటంటే పడవు అనుకున్నా కానీ, నీలో చాలా కళలు ఉన్నాయని ఇవ్వాలే అర్థమైంది. నీకు అనామికకు ఏమాత్రం తేడాలేదు. ఇన్ని రోజులు మా మధ్య ఉంటూ మా మధ్యనే తిరుగుతున్నా నీ నిజస్వరూపం తెలుసుకోలేకపోయాం. ఇవ్వాల నీ అసలు స్వరూపం కళ్లారా చూశా. ఇది ఎవరో చెప్పలేదు నేనే సాక్ష్యం అంటాడు రాజ్‌. ఇందులో నా ప్రమేయం ఏం లేదు అంటుంది కావ్య ఏది నిజం కాదు నీ మీద ఏమూలనోఉన్న ప్రేమ ఈరోజుతో పోయింది. ఇంకెప్పుడూ నాకు ఎదురుపడకు అని వెళ్లిపోతాడు రాజ్‌...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి