Brahmamudi October 5 Episode: ఇంకా నమ్మండి.. ఇంకా నెత్తిన పెట్టుకోండి అంటూ రుద్రాణీ కావ్యపై నిప్పులు చెరుగుతుంది. దీంతో దుగ్గారాల వారి కుటుంబీకులు అంతా తెల్లముఖం వేసుకుని చూస్తుంటారు. కుటుంబ పరువు కోసం ప్రాణాలర్పించే త్యాగమూర్తిలా చూశారు కదా.. ఇప్పుడేం చేసింది మన కంపెనీకి నష్టం వచ్చేలా చేసింది. వారి కంపెనీకి అవార్డు వచ్చేలా చేసింది పదేళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చింది అంటూ రెచ్చిపోతుంది రుద్రాణీ. దీనికి అపర్ణ నువ్వేందుకు రుద్రాణీ అంతలా బాధపడిపోతున్నావ్ అంటుంది. కల్యాణ్‌ కాపురం ముక్కలు చేసేదాక నిద్ర పోలేదు ఇప్పుడు నా కొడుపు కాపుర ముక్కలు చేస్తావా? కనీసం ఏం జరిగిందో మాట్లాడనివ్వకుండా అందరి మనస్సులు విరిచేయాలని ఇలా మాట్లాడుతున్నావా? వెళ్లు రుద్రాణీ ఇది తెలియక జరిగిన పొరపాటు తెలియక నెత్తికి చుట్టుకున్న గ్రహపాటు నా మనవరాలు మన కుటుంబానికి ద్రోహం చేయడం అంటుంది అమ్మమ్మ కూడా కావ్యను వెనకేస్తూ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరే టీవీలో కావ్యను చూశారు కదా అత్తయ్య ఇంకా కావ్యను వెనుకేసుకోస్తున్నారు ఏంటి అంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు రుద్రాణ కళ్లతో చూసి చెబుతున్నావ్. నేను నా అనుభవంతో చెబుతున్న అంటుంది అమ్మమ్మ. అప్పుడు రాజ్‌ వెంటనే నానమ్మ నేనే సాక్ష్యం నా కళ్లతో నేను చూసి చెబుతున్నా అంటాడు. నేను కూడా అమాయకుడినేనా? వ్యక్తిగత కోపాన్ని వృత్తి వ్యాపారం మీ చూపింది ఇంట్లో నుంచి వెళ్లగొట్టానని కోపంతో శత్రువలతో చేతులు కలిపింది. ఈపరిస్థితి తీసుకువచ్చింది. మీ అందరి లెక్క తప్పింది కళావతి కుటుంబానికి తీవ్రద్రోహం చేసింది అని కోపంగా వెళ్లిపోతాడు రాజ్‌.


బెడ్‌రూంలోకి వెళ్లి కళావతి ఫోటోలు, చీరలు కోపంగా కింద పారేస్తాడు. వాటన్నింటినీ మూటగట్టి బయటకు విసిరేయడానికి వెళ్తుంటాడు కుటుంబ సభ్యులు బిత్తరపోయి చూస్తుంటారు ఏం చేస్తున్నాడు వీడు అంటుంది అమ్మమ్మ అర్థంకాలేదా కావ్య జ్ఞాపకాలను తగులబెట్టేస్తున్నాడు అంటుంది రుద్రాణీ. అందరి ముందు నుంచి బయటకు వెళ్లి ఆ మూటను పడేసి కావ్య రాజ్‌ల పెళ్లి ఫోటోలను కూడా కుటుంబ సభ్యులు ఎంత వద్దని చెప్పినా వినకుండా తగలెట్టేస్తాడు. మరోవైపురాహుల్‌ రుద్రాణీలు ఆనందంలో పొంగిపోతుంటారు. మమ్మీ ఏమన్నా ప్లాన్‌ వేశావా? ఇక రాజ్‌ కావ్యలు ఎప్పటికీ కలవరు అంటాడు రాహుల్‌. మరోవైపు భీకరంగా వాన కురుస్తుంది. దీంతో ఆ ఫోటోలు కాలిపోవు. స్త్రీ అంటే ప్రకృతితో సమానం రా.. ఆ స్త్రీ అంటే పంచభూతాలు కూడా ఒప్పుకోవు. నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకున్నా కావ్య నిర్ధోషి అని ప్రకృతి చెబుతుంది రా.. లోపలికి అంటుంది అపర్ణ. లోపలికి వెళ్లిపోతారు అందరూ. ఈలోగా రుద్రాణీ కావ్యకు నిజంగానే ప్రకృతి సహకరిస్తుందా? అంటుంది పిచ్చి మమ్మ ఈ హైదరాబాద్‌లో వానలు ఎప్పుడు పడతాయో ఎవరికి తెలుసు అంటాడు రాహుల్‌. హెల్ప్‌ చేస్తున్నట్లేనా అంటాడు. మరోవైపు కావ్య తన పుట్టింట్లో ఆరుబయట కూర్చొని ఏడుస్తుంటుంది. కనకం వచ్చి ఏమైందే అని అడుగుతుంది.



అమ్మ ఎన్నోసార్లు నేను చేయని తప్పుకు నా మేడకు చుట్టుకున్న భరించాను ఈరోజు నేరెమే జరిగింది అంటుంది కావ్య ఏమైందే..? అంటుంది కనకం. నావళ్ల ఆయనకు అవమానమే జరిగింది అంటుంది. నేను వేసిన డిజైన్స్‌ పోటీలో పెట్టి గెలిచేలా చేసింది ఆ అనామిక అంటుంది కావ్య ఏడుస్తూ.. దీనికి నోరెళ్ల బెడుతుంది కనకం. పదేళ్లుగా వచ్చే అవార్డు ఈసారి అనామికకు వచ్చింది ఆ అవార్డు నేను అందుకోవాల్సి వస్తుంది. అర్థమైంది నీకు తెలియకుండా నీ డిజైన్స్‌ పోటీలో పెట్టారా అంటుంది కనకం. మా ఆయన కావాలనే వాళ్లతో చేతులు కలిపాను అనుకుంటున్నారు అంటుంది. కావ్య.. దురదృష్టం నిన్ను ఈ రూపంలో కూడా చుట్టుముట్టింది. అసలే అపార్థం చేసుకున్నా అల్లుడుగారు ఇంకా తప్పుగా అనుకుంటారు అఅంటుంది కనకం. పోనీ నేను వెళ్లి చెప్పనా అంటుంది కనకం. వద్దమ్మా.. నావళ్ల జరిగింది నేనే సరిచేయాలి. ఆయన ఎవరూ చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు అంటుంది కావ్య.కానీ,ఆ ఇంట్లో ఒక్కరికీ నేను సంజాయిషీ ఇచ్చుకోవాలి మా అత్తగారికి ఆమెకు చెబితే సరిపోతుంది నా మనస్సులో నుంచి ఈ భారం అంతా దిగిపోతుంది అంటుంది కావ్య.


ఇదీ చదవండి: సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో కూతురు గాయత్రి మృతి..


మరోవైపు సామంత్‌ లాస్ట్‌ వరకు వచ్చి ఇలా చేసావు. ఇక కావ్య డిజైన్స్ వేయనని చెప్పింది ఇలా ఎందుకు ముందే చెప్పావు అని అనామికను అంటాడు. అబ్బా, ఇప్పుడు ఎందుకు తొందరపడతావు అని మందు పోసి పెగ్‌ తాగు అంటుంది. నేను ఇంత సీరియస్‌గా చెబితే మందు తాగు అంటావు. కావ్య వల్ల నేను రాజ్‌ను ఎదురిచాను కావ్య ట్యాలెంట్‌ రాజ్‌కు తెలీదు మనకు తెలుసు. కావ్యను ఎలా తిరిగి తీసుకురావాలో నాకు తెలుసు అంటుంది. ఈపాటికి ఆ ఫ్యామిలీ రగిలిపోతుంటారు. ముందు అది తెలుసుకోని అంటుంది.


ఇక దుగ్గిరాల వారింట అమ్మమ్మ స్వప్నను పిలిచి కావ్య జ్ఞాపకాలన్ని అలా బయట ఉండటం నాకు నచ్చలేదు అంటుంది. అయితే ఇక్కడ స్వప్న క్యారక్టర్‌లో మరో కొత్త యాక్టర్‌ను నేటి ఎపిసోడ్‌లో పరిచయం చేయనున్నారు. ఇక బెడ్‌రూంలో మందు తాగుతూ రుద్రాణీ ఎంజాయ్‌ చేస్తుంటే అనామిక కాల్‌ చేస్తుంది. హలో అనామిక అంటుంది. నీ గొంతు వింటుంటే మంచి పార్టీ మూడ్‌లో ఉన్నట్టున్నారు అంటుంది అనామిక. నీవల్లే అంటుంది రుద్రాణీ రాజ్‌ పరిస్థితి సొంత భార్య చేతిలోనే ఓడిపోయానని తట్టుకోలేకపోతున్నాడు చూస్తే ఆనందంగా ఉంటుంది రుద్రాణీ. నాకు మాత్రం బాధగా ఉంది ఆ సన్నివేశాన్ని నేను చూడలేకపోయాను ఇది చాలదు ఆ కుటుంబాన్నిరోడ్డు మీదకు తీసుకువస్తా అది కూడా కావ్యతోనే అంటుంది. నువ్వేమైనా చేసుకో రాజ్‌ కావ్యలు ఎప్పుడూ దూరంగా ఉండాలని కోరుకుంటున్నా అంటుంది రుద్రాణి. అప్పుడు వెనకనుంచి వచ్చి స్వప్న బెడ్‌షీట్‌ కప్పి రుద్రాణీ నాలుగు గుద్ది వెళ్లిపోతుంది. ముసుగు వేసి నన్ను ఎవరో కొట్టార్రా రాహుల్ అంటుంది. 
ఏయ్‌ నిజం చెప్పు నువ్వే కొట్టావు కదా అంటుంది స్వప్నను రుద్రాణి. రామరామ నాకేం తెలుసు నాకంటే ముందు మీ అబ్బాయే రూంలోకి వచ్చాడు ఆయన్ను అడుగు అంటుంది స్వప్న.దీంతో రాహుల్‌ బిక్కుమంటాడు.


ఇదీ చదవండి:  దసరా ముందు రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. నేడు రూ.2000 ఖాతాల్లో జమా..  


మామ్‌.. అది చెప్పిందని నన్ను చూస్తావు అంటాడు. చాలా గట్టిగా కొట్టారు అంటుంది ఎంతో మంది కొంపలు కూల్చావు కదా ఎవరు కొట్టారో అని వెళ్లిపోతుంది స్వప్న.. అమ్మేది నానమ్మ అంటాడు రాజ్‌.. నీ అమ్మ గుడికి వెళ్లింది కావ్యను కలవడానికి అంటుంది రుద్రాణీ.. మరోవైపు అపర్ణకు అంతా వివరంగా చెబుతుంది కావ్య. రేపటి ఎపిసోడ్‌లో కావ్య అత్తారింటికి వెళ్తుందా? చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter