Brahmamudi: కోట్లు కొల్లగొట్టబోతున్న రాహుల్.. ముసలోడు నిండా ముంచేశాడు, వన్ ఉమెన్ ఆర్మీ అంటున్న కావ్య...
Brahmamudi Today December 18th Episode: ఈరోజు ఎపిసోడ్‌లో అపర్ణతో కావ్య ఇంటి బాధ్యతలు వద్దూ అని చెబుతుంది. ఇనుపెట్టే ఖాళీ చేస్తున్నారు. నాకొద్దు అత్తయ్య ఈ భారం అని దండం పెడుతుంది. చేయి కాల్చుకోకుండా వంట చేయడమే నేర్చుకోవాలి. ఈ మాత్రానికి బెదిరిపోతే ఎలా? అలవాటు అవుతుంది అంటుంది అపర్ణ....
Brahmamudi Today December 18th Episode: అవసరం తెలుసుకుని దానం చేయాలి. అడిగిన వారికి డబ్బు ఎలా ఇవ్వాలనే నేర్పు చెబుతుంది అపర్ణ. నావల్ల ఈ ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను ఈ బాధ్యత నుంచి రక్షించండి అంటుంది. నువ్వు లౌక్యంగా సర్దిచెప్పాలి. తప్పును తప్పు అని చెప్పడం మొదలు పెడతావా? అప్పుడే నీకు అలవాటు అవుతుంది. కానీ, అత్తయ్య... అంటుంది కావ్య.. నువ్వు ఓడిపోతే నాకు అవమానం ధైర్యంగా నిలబడు అని బీరువా తాళాలు మళ్లీ ఇస్తుంది. వెళ్లు అంటుంది. ఎక్కడికి మళ్లీ ఆ పద్మవ్యూహంలోకా? అని వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు రాహుల్ తాతయ్య పేరు చెప్పి ఎవరు వచ్చి అడిగినా ఇలా డబ్బులు ఇస్తారు అన్నమాట. మా ఫ్రెండ్స్‌ను ఒక్కక్కరినీ పిలిచి కోట్లు కొల్లగొడుతా అని ఫ్రెండ్స్‌కు చెబుతాడు. వెంటనే గమనించిన స్వప్న చప్పట్లు కొడుతూ చీప్‌గ ఆలోచించడానికి సిగ్గుగా లేదా?
అసలు ఇంత బుర్ర తక్కువోడివి నన్ను ఎలా పారేశావు రా? నా కొడుకు జీనియస్ ఎందుకు అలా తిడుతున్నావు అని రుద్రాణీ సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. అవునా? నీ కొడుకు చేసిన పని తెలిస్తే జీనియస్‌కు అర్థం చెబుతావు అంటుంది స్వప్న. ఏం చేశాడు? అంటుంది.. అడగండి మిస్టర్ జీనియస్‌ను అంటుంది స్వప్న. అసలు విషయం చెబుతాడు రాహుల్. ఏంటీ షాకయ్యారా? ఈ జీనియస్ తెలిసితేటలు చూసి ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి వెళ్తుంది.వేస్ట్ ఫెలో నువ్వు ఇది ఇంప్లిమెంట్ చేసి ఉంటే ముద్దాయిలా నిలబడేవాళ్లం. అయినా ఉదయమే కదరా గొప్ప సలహా ఇచ్చావు. అప్పుడే బురద గుంటలోకి పడేశావా? నీ చావు తెలివితేటలుప ప్రదర్శించకు, నెక్ట్స్ టైం ఏదైనా ఆలోచన వస్తే నాకు చెప్పు అంటుంది రుద్రాణీ.
హాల్‌లో రాజ్ అటూ ఇటూ వాక్ చేస్తూ ఉంటాడు. అమ్మో చూస్తే చిర్రుబుర్రు చేస్తాడు అని కావ్య అనుకుంటుంది. ఏయ్.. ఆగు.. ఇక్కడ పిలిచా ఎక్కడ వెతుకుతున్నావ్ అంటాడు. ఇక్కడ కూడా మీరు గీత గీశారేమో అని వెతుకుతున్న అంటుంది. చెట్టంత మనిషి ఉన్నాడు పొద్దున్నుంచి కాఫీ ఇవ్వాలని తెలీదా? అంటాడు రాత్రి ఇస్తే అరిచారు కదా అంటుంది.నా పై ఉద్దేశం ఏంటి? ఏమనుకున్నావ్? ఎప్పుడూ ఇలానే ఉంటాడు అగ్రేసీవ్‌గా అంటాడు. నేను ఏమీ అనుకోలేదండి ఈ జన్మలో మీరు మారరు అని తెగేసి చెప్పిన నేను ఏమీ అనలేదండి. ఇప్పుడే కాఫీ తీసుకువస్తా అని వెళ్తుంది కావ్య..
అప్పుడే పోలీస్ రాజ్‌కు కాల్ చేస్తాడు. రాజ్ నేను ఇంటి బయట ఉన్న లోపలికి రావాలా?అంటాడు. లోపలికి వద్దు నేనే బయటకు వస్తా ఆగు ఇంట్లో కంగారు పడతారు అంటాడు. ఏమైనా తెలిసిందా? అడుగుతాడు. బ్యాంకాక్ వెళ్లాడు అంటాడు పోలీస్. అక్కడ నాకు తెలిసిన వారు ఉన్నారు అంటాడు. ప్లీజ్ వాన్ని పట్టుకోవాలి ఏ కంట్రీలో ఉన్నా సరే రప్పించు అంటాడు.అప్పుడేకావ్య ఏవండి కాఫీ అంటుంది. నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే కాఫీ ఇస్తావా అని అరుస్తాడు. వెంటనే పోలీస్ వెళ్లిపోతాడు. అప్పుడే అపర్ణ రాజ్‌పై విరుచుకుపడుతుంది. కావ్యను పరాయి వారి ముందు తిడతావా? ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? ఇంటి ఇల్లాలిని ఇలా అనకూడదు. అయినా సరే కావ్య సారీ చెప్పింది అంటుంది అపర్ణ. సారీ కళావతి అంటాడు. మమ్మి చెప్పిన తర్వాత కానీ, నాకు తెలిసి రాలేదు అని చెప్పి వెళ్తాడు.
ఏమైంది వీడికి ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడే అరిచాడు, ఇప్పుడే సారీ చెప్పాడు. ఏంటో మీవారు నాకు అర్థం కావట్లేదు అని అపర్ణ అంటుంది. అసలు ఏం జరిగింది? నేను తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్లకు నాకు తెలియకుండా ఆయన ఏదో చేస్తున్నాడు కాఫీ కలిసి రావడం లేదు ఇది లేకుండా వెళ్లాలి అని కావ్య వెళ్తుంది.బెడ్‌రూంలో రాజ్ ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. కావ్యను చూసి ఏంటి? ఎందుకు అలా చూస్తున్నావ్ అంటాడు. మీరెందుకు కంగారు పడుతున్నారు? అంటుంది. మాట దాటేస్తాడు. తెలిస్తే ఏం చేస్తావు? ఆరుస్తావా? తీరుస్తావా? అంటాడు. అవును నేను పెద్ద సమస్యలో ఉన్నా అందుకే ఇలా చేస్తున్నా అంటాడు.
నాకు చెబితే ఏదైనా పరిష్కారం చెప్తా కదా అంటుంది. ఒక శత్రు సైన్యం మన రాజ్యం మీద దండెత్తబోతుంది. మన దగ్గర వంద మంది సైన్యం లేదు. నీ దగ్గర అప్పు ఉంటే నాకిస్తావా? అంటాడు. నేనెప్పుడు వన్ ఉమెన్ ఆర్మీ ఒంటరిగానే పోరాడతా నా దగ్గర పది మంది సైనికులు కూడా లేరు అని చెప్పి వెళ్లిపోతుంది.అప్పుడే హాల్‌లోకి బ్యాంకు అధికారులు వస్తారు. సుభాష్ వారిని నిలదీయగా అసలు సంగతి చెబుతారు. వెంటనే రాజ్ నేను మాట్లాడతా అంటాడు. వారు వినకుండా మీ ప్రాపర్టీ మొత్తం జప్తు చేయడానికి వచ్చాం అంటారు. అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. ఇప్పుడు సీతారామయ్య గారు కూడా బతుకుతారని గ్యారెంటీ లేదు అని రుద్రాణీ అంటుంది. నోటీస్ కూడా ఇవ్వకుండా జప్తుచేస్తే ఎలా అంటాడు సుభాష్.
ఇదీ చదవండి: ధాన్యలక్ష్మి పేరు చెబితేనే వణికిపోతున్న కావ్య.. అయ్యయ్యో గుండెనొప్పితో కుప్పకూలిన అమ్మమ్మ
ఆఫీస్‌కు నోటీస్ అంటించాం. రాజ్‌కు టైం ఇచ్చాం. ఇక చేసేదేం లేదు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి అని ఆర్డర్ వేస్తాడు. అమ్మోమ్మో.. ముసలోడు నిలువనా ముంచేశాడు ఇంకా గౌరవం ఏంటి? చూశావా ధాన్యలక్ష్మి ఆస్తులు రాసుకుందాం అంటే ఎవరూ వినలేదు అంటుంది రుద్రాణీ. అందరం కలిసి ఇప్పుడు నడివీధిలో నిలబడదాం అని ధాన్యం కూడా అంటుంది. నీ కొడుకు ఆటో నడిపితే మనం పడి తినాలి. ఇన్నాళ్లు కోడల్ని ఇంటికి కూడా రానియలేదు. ఏ గంగలోకి దూకాలి. అందరూ కలిసి సుకఃదుఖాలు పంచుకోవాలి అంటుంది అపర్ణ. ఇక మరుసటి ఎపిసోడ్‌లో రాజ్‌తో ఇల్లు క్లీన్ చేయిస్తుంది కళావతి ఇక వారు ఒకరి మీద ఒకరు పడి రొమాంటిక్ బ్యాగ్రౌండ్ సాంగ్ వేసుకుంటారు. అప్పుడే రుద్రాణీ, ధాన్యలక్ష్మిలు వాళ్లను చూస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.