Brahmamudi: దుగ్గిరాల కుటుంబానికి కావ్య శాసనం.. రూటు మార్చి రూ.100 కోట్టు కట్టేసిందిగా..
Brahmamudi Today December 21 Episode: నేటి ఎపిసోడ్లో రాజ్ కావ్య రూ.100 కోట్లు షూరిటీ విషయం చెప్పేస్తాడు. కావ్యను దగ్గరకు తీసుకుని చేతులు పట్టుకుంటాడు. కళ్లలోకి దీనంగా చూస్తూ ఈ విషయం మన మధ్యలో ఉండాలి. ఎవరికీ చెప్పకూడదు అంటాడు.
Brahmamudi Today December 21 Episode: నాకో పెద్ద సమస్య ఎదురైంది నువ్వే నాకు సహాయం చేయాలి అంటాడు. ఏమైంది అండీ అంటుంది కావ్య. ఇప్పటి వరకు జరగరానిది జరిగింది. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనుగడకు ఓ ప్రమాదం జరగనుంది. దీంతో ఫ్లాష్‌బ్యాక్‌లో రూ.100 కోట్లు ష్యూరిటీ గురించి చెప్పేస్తాడు. ఏమంటున్నారండి అని కావ్య ఆశ్చర్యపోతుంది. తాతయ్య మాట నిలబడాలి. కుటుంబం రోడ్డున పడకూడదు. రేపు ఉదయం బ్యాంక్ ఆఫీసర్లు ఇచ్చిన సమయం అయిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. దీంతో మీరు ఇంత సమస్యలో చిక్కుకుపోయారా? అని ఏడుస్తుంది. ముందే ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అంటుంది. తాతయ్య గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది అంటాడు. నీకు తోచిన సలహా ఏదైనా ఉంటే నాకు చెప్పు అంటాడు.
ఏం చెప్పాలండి? ఇప్పటికిప్పుడు వంద కోట్లు అంటే ఎక్కడి నుంచి తెస్తాం అండి అంటుంది. ఇప్పటికే ఆస్తుల గురించి పిన్ని, అత్తయ్యలు గొడవ చేస్తున్నారు అంటాడు. ఏమండి ఏమైనా ఫర్వాలేదు. ఈ సమస్యకు తెల్లవారేలోగా ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. ఏమండి ఇద్దరం కలిసి ఈ సమస్యను సాల్వ్ చేద్దామండి అంటుంది కావ్య. దీంతో ఒక్కసారిగా కావ్యను వాటేసుకుంటాడు రాజ్. థ్యాంక్యూ కళావతి, థ్యాంక్యూ సో మచ్ అంటాడు. మీలో మీరే నలిగి పోకుండా ఇప్పటికైనా చెప్పారు. ఈ సమస్యకు ఎలాగైనా ఓ సొల్యూషన్ ఆలోచిద్దాం అంటుంది కావ్య.
తెల్లవారుతుంది రెడీ అయ్యారా? అంటుంది కావ్య. నువ్వు కూడా వస్తా అన్నావ్ అంటాడు రాజ్. ఒక్క నిమిషం అండీ అని బ్యాగ్, ఏవో ప్రాపర్టీ డాక్యుమెంట్లు కూడా తీసుకువస్తుంది. తాతయ్య నీపేరుపై రాశాడు కదా అంటాడు. ఒక వేళ ఆస్తి నాది తాతయ్యకు ఏం సంబంధం లేదు అంటావా? అంటాడు రాజ్ , ఛీఛీ ఇంతేనా మీరు అర్థం చేసుకుంది అంటాడు. తాతయ్య మాట పోయేలా నేను ఎందుకు ఆలోచిస్తాను అంటుంది కావ్య. ఇద్దరూ కలిసి బయలుదేరుతారు.
కింద హాల్‌లో అందరూ కాఫీ, టీ లు తాగుతుంటారు. అపర్ణ, సుభాష్‌లు ఆనందంగా వారినే చూస్తుంటారు. ఇద్దరు కలిసిపోయారా? అంటాడు సుభాష్. ఇద్దరం కలిసి ఆఫీస్ వెళ్తున్నాం అని చెబుతారు. మీరిద్దరూ కలిసి ఆఫీస్ వెళ్తున్నారా? అంటుంది ధాన్యం. ఏ వెళ్లకూడదా? అంటాడు రాజ్. కావ్యను కూడా తీసుకెళ్లే పనేంటో? అంటుంది ధాన్యం. ఏం లేదు మావయ్య కొన్ని కొత్త డిజైన్స్ వేయాలంటా అందుకే వెళ్తున్నా అంటుంది కావ్య. మమ్మి కొన్ని రోజులు కావ్య నాతోనే ఆఫీసుకు రావాల్సి ఉంటుంది అంటాడు రాజ్.
ఇదీ చదవండి: శ్రీతేజ్ ఆరోగ్యంపై బిగ్ అప్డేట్.. హెల్త్ బులెటిన్ విడుదల, డాక్టర్లు ఏం చెప్పారంటే?
స్వప్న ఆరుబయట కనిపిస్తుంది. ఇద్దరు లాంగ్ టూర్ వెళ్తున్నారా? అంటుంది. లేదు ఆఫీస్ అంటుంది. అక్క నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే సరికి ఆలస్యం అవుతుంది. ఇంటి తాళాలు ఇస్తుంది. అనవసరంగా అడిగితే డబ్బు ఎవ్వరికీ ఇవ్వకు అంటుంది. అమ్మమ్మకు భోజనం పెట్టిన తర్వాత మందులు ఇవ్వు అని చెప్పి వెళ్తుంది. రుద్రాణీ రాజ్ కావ్యలు కారులో వెళ్తుండటం చూస్తుంది. స్వప్నను ఆరా తీస్తుంది. రాజ్ కావ్య ఆఫీస్ రావడం ఇష్టం ఉండదు కదా.. అందుకే తరిమేశాడు అంటుంది. కీస్ నీ చేతిలో ఉన్నాయేంటి అంటుంది రుద్రాణీ. ఈరోజు నుంచి పెత్తనం మొత్తం నాదే అని స్వప్న ఇంటిలోపలికి వెళ్లిపోతుంది.
అపర్ణ కనకానికి ఫోన్ చేసి కావ్య రాజ్‌లు కలిసిపోయారని చెబుతుంది. నీ కూతురు నా కొడుకు కలిసిపోయారు అంటుంది అపర్ణ. ఎక్కడా కలలోనా అంటుంది కనకం. నాకు నమ్మకం లేదు అంటుంది. ఒకసారి ఆఫీసుకు వెళ్లి చూడు అంటుంది అపర్ణ. నా కొడుకు ఇష్టపూర్వకంగానే ఆఫీస్ తీసుకెళ్లాడు అంటుంది.దీంతో కనకం ఉబ్బితబ్బిపోతుంది. ఇంత త్వరగా ఆ శుభవార్త వింటానని అస్సలు ఊహించలేదండి అంటుంది.నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను సరేనా అని ఫోన్ కట్ చేస్తుంది అపర్ణ.
ఇదీ చదవండి: తాతా మనవళ్ల సవాల్.. ఇంటి నుంచి కట్టుబట్టలతో వెళ్లిపోయిన కార్తీక్, బోరున విలపించిన సుమిత్ర..
ఆఫీసులో బ్యాంకు వారితో కావ్యరాజ్‌లు మాట్లాడుతుంటారు. నేను మాట్లాడోచ్చా అంటుంది కావ్య. సార్, మేము డబ్బులు కట్టాలనే నిర్ణయం తీసుకున్నాం. కానీ, వందకోట్లు ఒకేసారి కాకుండా ఇన్‌స్టాల్‌మెంట్‌లో క్లీయర్ చేస్తాం అంటుంది కావ్య. మా తాతయ్య ష్యూరిటీ ఇచ్చారు, కానీ వారు బోర్డు తిప్పేస్తారు. కానీ, వాళ్లు అలా చేస్తారు అనుకొని డబ్బు పెట్టుకోం కదా. మీ దగ్గర లోన్ తీసుకున్న కస్టమర్లకు ఏదైనా ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్ ఉంటుంది కదా.. మేం అదే కోరుతున్నాం. మీరు ఇలా పీకలమీద కూర్చుంటే మేం ఎలా ఇస్తాం. కాబట్టి బాధ్యత గల కస్టమర్లుగా మేం డబ్బును చెల్లిస్తాం. మీకు డబ్బులు కావాలా? ఆస్తులు జప్తు చేయడం కావాలా? అంటుంది కావ్య.