Karthika Deepam 2 Today December 20th Episode: ఈ తాత పేరు చెప్పకపోతే నీ బతుకు తెల్లవారదు. ఇన్నాళ్లు తేరగా వదిలేష అంటాడు. ఇది నువ్వు సంపాదించిన ఆస్తి కదా నాకు వద్ద అన్ని ఆస్తి పేపర్లు చించివేస్తాడు కార్తీక్. మీ ఒంటి మీద బంగారం, కార్లు అన్ని నావే కదా మరి వాటి సంగతి ఏంటి అంటాడు తాత. కాంచన ఏడుస్తుంది. వద్దు అంటున్నాడు కదా, ఎన్ని వదులుకుంటాడు చూస్తా అంటాడు శివన్నారాయణ. ఈరోజు తారీఖు గుర్తు పెట్టుకో తాతా.. నా డబ్బుతో రెస్టారెంట్ పెట్టి ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డు అందుకోకపోతే చూడు అని శపథం చేస్తాడు కార్తీక్.ఇలా నువ్వు పౌరుషానికి పోయి నీ భార్యకోసం అన్ని వదులుకుంటే ఏమి దొరకదు అంటాడు. ఇంకా నయ్యం కట్టుబట్టలతో బయటకు పోతా అనలేదు అంటాడు. మిస్టర్ శివన్నారాయణ నేను ఈక్షణమే నేను నాకుటుంబాన్ని తీసుకుని ఇళ్లు వదలిపోతున్నా అంటాడు కార్తీక్. కట్టుబట్టలతో వెళ్తాం అంటాడు.
మరోవైపు సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. మావయ్య ఏం ఘోరం చేస్తారేమో అంటుంది. దీంతో పారిజాతం జరిగే ఘోరాన్ని ఆపడానికి వెళ్లాడమ్మా అంటుంది. ఏవండి ప్లీజ్ అండి మనం వెళ్దాం అండి భర్తను వేడుకుంటుంది సుమిత్ర. నువ్వొద్దు సుమిత్ర నేనే వెళ్తా అంటాడు దశరథ్.
మరోవైపు శివన్నారాయణ, కార్తీక్‌ల మధ్య మాటామాటా పెరుగుతూనే ఉంటుంది. ఆయనకు పోటీగా రెస్టారెంట్ పెట్టు అని నువ్వే సలహా ఇచ్చావు అంటుంది జ్యోత్స్స దీపను. ఒక మనిషి కన్నవాళ్లను వదిలేయకూడదు తాతయ్య. ఆ మనిషి పుట్టింటికి దూరమై రోజు ఏడుస్తూ ఉంటుంది. ఆమెది నీ లాంటి మనస్సే అందుకే సౌభాగ్యాన్ని సవతికే వదిలేసింది. అలాంటి కూతురుని కన్నందుకు మీరు గర్వపడాలి అంటుంది దీప. ప్రశ్నించడానికే కాదు, మా తాత ముందు నువ్వు నిలబడటానికి కూడా తూగవు అంటుంది జ్యోత్స్స.
ఇదీ చదవండి: అసలు విషయం చెప్పి కావ్యను హత్తుకున్న రాజ్.. అదిరిపోయే రొమాంటిక్ సీన్, ఇంకెవరినో ట్రై చేస్తున్న కవి..
నేను వద్దన్న నా ఇంటి గుమ్మం తొక్కి బంధాన్ని కలుపుకోవడానికి ప్రయత్నించారు అంటాడు శివన్నారాయణ. నేను చావడానికి కూడా సిద్ధపడితే ఈ వంట మనిషితో పెళ్లి చేసింది ఈ అత్తం, నా మేనకోడలికి ఇంత అన్యాయం చేశావు అని నీ కొడుకుని అడిగావా? మేమంటే లెక్కలేదు కాబట్టి అంటుంది జ్యోత్స్న. మా అమ్మ నా ఇష్టానికి విలువనిచ్చింది కాబట్టి అడగలేదు అంటాడు కార్తీక్. బంధాలను ఆఫీసులో ఉద్యోగంతో పోలుస్తాడు మీ తాత, ఆయనకు కావాల్సింది మనుషులు కాదు అనుకున్నది జరగడం. ఎదుటి వారి నైతిక విలువలను నిర్ధాక్షిణంగా తొక్కేసాడు.
నువ్వు కన్నతండ్రివి కాబట్టి నన్ను ఏమైనా అను.. నా కొడుకుని ఏమి అనకు. నువ్వు నన్ను కొట్టినా ఇంత బాధపడేదాన్ని కాదు. మాటలతో నన్ను నా కొడుకుని మానసికంగా చంపేస్తున్నావ్ అని బోరున ఏడుస్తుంది కాంచన. నాన్న నాకన్నీల్లు కూడా నా కళ్లు మోయలేక నీకోసం ఏడుస్తున్నాయ్ నాన్న అంటూ బాధపడుతుంది. కార్తీక్ నాకేం చేయాలో తెలియడంలేదు, నాబాధ ఎవరికి చెప్పాలి రా అంటుంది. దేవుడు నాకునడకను దూరం చేస్తే మా నాన్న నాకు అన్ని దూరం చేస్తున్నాడు అని విలపిస్తుంది. ఆవిడ బాధ మీకు ఇప్పుడైన అర్థమవుతుందా? వీరు మీ సొంత మనుషులు అంటుంది దీప.
బయట వారిని వెనకేస్తూ వస్తూ తాతగారిని కాదనుకుంటావా బావ అంటుంది జ్యోత్స్న. మీకు మనిషిని వదులుకోవడం వచ్చు. నాకు కలుపుకోవడం వచ్చు, నన్ను అభిమానించే వారంత నావల్లే అంటాడు కార్తీక్. నాన్న ఇక చాలు చిన్నవాళ్లం కాబట్టి పెద్దవాడిగా వాడిని ఆశీర్వదించు నాన్న అంటుంది కాంచన. అంటే విసిరిన సవాలును నీకొడుకు వెనక్కి తీసుకుంటాడా? అంటాడు శివన్నారాయణ. మరిమేం ఏం చేయాలి? నాన్న అంటుంది. సవాలును వెనక్కి తీసుకునే సమస్యే లేదు అంటాడు కార్తీక్. నేను మిమ్మల్ని క్షమించాలి అంటే ఆఫీసులో నీ కొడుకు అందరి ముందు క్షమాపణ చెప్పి నేను ఇచ్చిన ఉద్యోగం చేయాలి అంటాడు శివన్నారాయణ. అన్నటి కంటే ముఖ్యంగా దీప రెస్టారెంట్ ఆలోచన ఇక్కడితో ఆపేయాలి. దీప నా ఇంటికి, ఆఫీసు ఛాయలోకి కూడా రాకూడదు అంటాడు.
ఇదీ చదవండి: దీప రెస్టారెంట్.. శివన్నారాయణతో శపథం చేసిన కార్తీక్, కంగుతిన్న జ్యోత్స్న
నేనొప్పుకోను తాతయ్య అంటాడు కార్తీక్. నేనొప్పుకుంటున్నా అంటుంది దీప. దీప ఆత్మాభిమానం చంపుకుని అవన్ని చేయలేను అంటాడు. తాతయ్యగారు ఆఫీసులో అందరి ముందు నేను క్షమాపణ చెబుతా అంటుంది. ఇక ఆపు దీప నాపేరు చెప్పుకోనిదే మీరు బతకలేరు అన్న మాటను నువ్వు నిజం చేయాలనుకుంటున్నావా? చెప్పు దీప నేను చేతగాని వాడిని అని నువ్వు అనుకుంటున్నావా? మాట్లాడు దీప అంటాడు. మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు కార్తీక్ బాబు, కుటుంబం విడిపోకుండా ఉండటానికి అంటుంది దీప. నా సొంత తెలివితేటలతో నువ్వు నాతో ఉన్నావనే ధైర్యంతో సవాలు చేశా. ఇది నీ భర్త ఆత్మగౌరవాన్ని చంపినట్లే. తలదించుకుని చావమంటావా? అంటాడు కార్తీక్. మీ గౌరవం ఎవరి ముందు తక్కువ చేయను నా ప్రాణంతో సమానం అంటుంది దీప. నేను విసిరిన సవాలుమీద నిలబడతా. ఈ క్షణమే కట్టుబట్టలతో బయటకువెళ్తున్నాం. అమ్మ నీవేంటావ్ అంటాడు. నీమాటే నామాట అంటుంది కాంచన.....
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.