Brahmamudi: రుద్రాణీ, ధాన్యలక్ష్మిల ఆకలి కేకలు.. తాతయ్యకు బిల్ కట్టలేని స్థితిలో కావ్యరాజ్‌లు..
Brahmamudi Today December 25th Episode: ధాన్యలక్ష్మి ప్రకాశంతో కావ్య విషయమై గగ్గోలు పెడుతుంది. ఆ మాటలు కొట్టిపారేస్తాడు ప్రకాశం. నాకు నచ్చినట్లు టిఫీన్స్ అన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుని తింటాను ఏం చేస్తుందో చూస్తా అంటుంది ధాన్యం.
Brahmamudi Today December 25th Episode: మరోవైపు గార్డెన్‌లో అపర్ణ, కావ్యలు మాట్లాడుతుంటారు. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అడుగుతుంది కావ్య. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంది అనుకుంటున్నా, నేను నిన్ను నమ్ముతున్నా అంటుంది అపర్ణ. నీకు నచ్చింది చేయ్. ఇంటి విషయంలో ఇంత కఠినంగా ఉన్నావంటే పెద్ద కారణమే అయి ఉంటుంది అంటుంది అపర్ణ. అవును అత్తయ్య చెప్పే సమయం వచ్చినప్పుడు ముందు మీకే చెబుతా అంటుంది కావ్య.
ఇక డైనింగ్ టేబుల్‌పై ఆర్డర్ పెట్టిన టిఫీన్స్ తింటుంటారు ధాన్యం, రుద్రాణీ, రాహుల్. కావ్యను చూసి మరింత రెచ్చిపోతుంది రుద్రాణీ. కావ్య కూడా వచ్చి కూర్చుంటుంది. ఆహా.. ఓహో.. అంటూ టిఫిన్ ఆస్వాదిస్తుంటారు. మీరు ఆకలితో తింటున్నట్లు లేదు కావ్యపై కడుపు మంటతో తిన్నట్లు ఉంది. నిదానంగా తిను రాహుల్ అంటుంది స్వప్న. రుద్రాణీ ఎవరికైనా కావాలంటే తినొచ్చు అంటుంది ధాన్యం. స్టెల్లా ఫుడ్ తిని ఎంత ఇబ్బంది పడ్డారో తెలీదా? అవసరానికి మించి తింటే ఎక్కువవుతోంది. ఇక వీళ్లని ఎలా కంట్రోల్ చేసేది? అనుకుంటుంది. ఇవ్వాళ తాతయ్య ఆసుపత్రి బిల్ కట్టడానికి చెక్ ఇవ్వాలి అని హఠాత్తుగా లేచి వెళ్లిపోతుంది కావ్య.
మరోవైపు ఆసుపత్రిలో అమ్మమ్మ ఏడుస్తుంటుంది. కావ్య రాజ్‌లు వస్తారు. జీవితాంతం నా బావ నాకు తోడుగా ఉంటానని మాటిచ్చాడు. ఆ మాట ఎక్కడ తప్పుతాడో అని ఇక్కడే కూర్చున్న అంటుంది ఇందిరాదేవి. అప్పుడే కల్యాణ్ వస్తాడు రూ.5 లక్షలు కట్టమని చెక్ ఇస్తాడు. అమ్మమ్మ ఊరుకోండి తాతయ్యకు ఏం కాదు అని సర్ది చెబుతారు కావ్యరాజ్‌లు. మరోవైపు మళ్లీ డైనింగ్ టేబుల్ వద్ద రుద్రాణీ ధాన్యలక్ష్మిలు ఆర్డర్ వేస్తుంటారు. తోటకూర పప్పు చేశా అంటుంది శాంత. ఇంకేమి చేయలేదా? అంటుంది రుద్రాణీ. చికెన్, మటన్, ఫిష్ చేయలేదా? అంటుంది. మెతుకు కూడా వృథా చేయకూడదని మరీమరీ చెప్పారు అంటుంది శాంత. ఏంటే బెదిరిస్తున్నావా? అంటుంది రుద్రాణీ. అన్నదానం చేసేవారు కూడా రెండు మూడు కర్రీలు వేస్తారు. ఇదేం తిండి అది రూల్ పెడితే మనం ఫాలోఅవుతామా? పదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడతా అని చికెన్ బిర్యానీ, లివర్ ఫ్రై ఆర్డర పెడుతుంటారు. అయితే కార్డు వాడిన వెంటనే ఖంగు తింటారు.
ఇదీ చదవండి: బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కిలోమీటర్ దూరం లాక్కెల్లిన ట్రక్ డ్రైవర్ అరిచినా వినకుండా ఎంత పనిచేశాడు..?
రుద్రాణీ నా కార్డు సరిగ్గా పనిచేయడం లేదు నీ కార్డు ఇవ్వు అని పే చేస్తుంది. అప్పుడు వారికి తెలిసి వస్తుంది వాళ్ల కార్డులు బ్లాక్ అయ్యాయి. ఉదయం టిఫిన్ బయటి నుంచి ఆర్డర్ పెట్టుకున్నామని ఇలా చేసింది కుళ్లుబోతు ముఖం. దీన్ని ఇలాగే వదిలేస్తే నగలు కూడా తాకట్టుపెట్టుకుంటుంది. పదా మా అన్నయ్యను వెళ్లి అడుగుదాం. మీ కోడలు ఆస్తి చేతిలోకి వచ్చాక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది అంటుంది అని జగదీష్‌తో ధాన్యం. మా కార్డులు కావ్య బ్లాక్ చేసింది. బ్యాంకు వారికి ఫోన్ చేస్తే చెప్పారు అంటుంది రుద్రాణీ. వెంటనే ఫోన్ చేసి కనుక్కుంటాడు జగదీష్. కావ్య మేడం బ్లాక్ చేశారు అని బ్యాంకు అధికారులు.
ఇప్పుడేమంటారు అంటుంది రుద్రాణీ ఆవిడగారు చెప్పినట్లు ఉండాలి, చెప్పింది తినాలి అంటారు ఇద్దరూ. జరిగింది చిన్న విషయం ఎందుకు అంత రచ్చ చేస్తారు. కావ్య ఎందుకు లా చేయాల్సి వచ్చిందో మేం కనుక్కుంటాం. కొంచెం ఒపిక పట్టండి అని వెళ్లిపోతాడు జగదీష్. కావ్య రాని నిలువునా కడిగేస్తా అంటుంది ధాన్యం. కారులో కావ్య రాజ్‌లు వస్తుంటారు. బ్యాంక్ నుంచి తాతయ్య ఆసుపత్రి బిల్ జీరో ఉంది అంటారు. మనకు తెలియకుండా రూ.10 లక్షలు డ్రా చేసుకుంది అంటారా? అని స్వప్నకు ఫోన్ చేస్తుంది కావ్య. ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంటికి చేరుకుంటారు. కావ్యరుద్రాణీలు ఆకలితో అలమటిస్తుంటారు. ఇక ఈ ఆకలి భరించడం మన వల్ల కాదు ఆ గడ్డితిని కుర్తి తాగి ఈ పూటకు సరిపెట్టుకుందాం అని వెళ్తారు. ఒసేయ్ సంతా... అని పిలుస్తుంది రుద్రాణీ శాంత అని పిలవండి అంటుంది. ఇందాక ఏదో గడ్డి ఉంది అన్నావ్ కదా పెట్టు అంటారు. అయ్యయ్యో ఇప్పుడే ముష్టి వాళ్లకు వేశానమ్మా అంటుంది శాంత.
ఇదీ చదవండి: పీవీ సింధు రిసెప్షన్ ఫొటోలు.. హైదరాబాద్‌కు అతిరథ మహారథులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.