Brahmamudi Today December 3 Episode: ఎక్కడికి వెళ్లినా ఈ పాత బంగ్లా గోలెంటి నాకు అంటుంది కావ్య. అక్కడ ఫస్ట్ నైట్‌ ప్లాన్‌ చేసినట్లు ఇక్కడ సెకండ్‌ నైట్‌ ప్లాన్‌ చేశారా అంటుంది కావ్య. ఇక సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి మీ ఎండీ ఫ్రెండ్‌ నేను చాలాసార్లు వచ్చా అని సెక్యూరిటీకి చెబుతాడు. నాకోసం ఇద్దరు వస్తారు అని నీకు చెప్పలేదా అంటాడు రాజ్‌, అప్పుడు సెక్యూరిటీ నిజమే అయి ఉంటది అని మనసులో అనుకుంటాడు. అసలే మీ సార్‌కు డబ్బు అవసరం చాలా ఉంది అంటాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందాకే సార్‌ ఇక్కడకు వచ్చాడు. కానీ, ఓ గంట తర్వాత వస్తా అని చెప్పి వెళ్లాడు. చూడు మేం వచ్చినట్లు మీ సార్‌కు చెప్పకు అంటాడు రాజ్‌. ఎందుకు అంటాడు సెక్యూరిటీ, సర్‌ప్రైజ్‌ చేస్తా మా ఫ్రెండ్‌ను అంటాడు. నీకు ఫ్యూచర్‌లో అవసరమైతే నేను జాబ్‌ ఇస్తా అంటాడు రాజ్‌. ఇక కావ్యరాజ్‌లు లోపలికి వెళ్తారు.


మరోవైపు ఇంట్లో అపర్ణ ఇందిరా దేవిలు రాగానే ధాన్యం, రుద్రాణీలు మాట ఆపేస్తారు. ప్రకాశం మాట ఆపేస్తారు ఎందుకు అంటాడు. మేం ఏం మాట్లాడుకుంటున్నాం అంటుంది రుద్రాణీ. మీరిద్దరూ ఎక్కడకు వెళతున్నారు అంటుంది ధాన్యం. నిధులు దాపేట్టాం కదా.. చూద్దామని వెళుతున్నాం అంటుంది అపర్ణ.  ఇంకెక్కడికి వెలతాం ఆసుపత్రికి వెళుతున్నాం అంటారు. ఎలా వెళతారు కారు లేదు కదా అంటుంది రుద్రాణీ. సుభాష్‌ వచ్చాడు కారు కీ తీసుకుంటాం అనుకుంటారు. కానీ, కారు బ్రేక్‌ డౌన్‌ అవుతుంది. 


ఏంటమ్మా ఇప్పుడు నాన్నను చూడటానికి కారు లేదా ఆటోలో వెళ్తే నీ పరువు ఏమవుతుంది? అంటుంది రుద్రాణీ. ఏది ఏమైనా నేను నా బావను చూడటానికి ఎలాగైనా వెళ్తా అంటుంది ఇందిరాదేవి. అప్పుడు ప్రకాశం ఉండమ్మ కారు బుక్‌ చేస్తా అంటాడు. ఇక ఇందిరా దేవి, అపర్ణలు ఆసుపత్రికి బయలుదేరతారు. రుద్రాణీ మాత్రం సుభాష్‌కు కావ్యపై లేనిపోనివి నూరిపోసే పనిలో పడుతుంది.


ఇక నంద పాత బంగ్లాలోపలికి వెళతారు కావ్యరాజ్‌లు. ఏవండి.. నాకో డౌట్‌ ఇది ఇంకో భూత్‌ బంగ్లా ప్లాన్‌ కాదు కదా.. మళ్లీ ఏదో గట్టి ప్లాన్‌ చేశారా? ఇలాగే మళ్లి ఓసారి నా జీవితంలో నిప్పులుపోయాలనే కాదు ఈ ప్లాన్‌ చేశారు అంటుంది కావ్య. నీకు ఇలా అర్థమైందా? అంటాడు రాజ్‌. బెడ్‌ ఎక్కడ? అంటుంది కావ్య. నాకు అంత ఓపిక లేదు ముందు ఆ నందగాడిని పట్టుకుని నాలుగు తగిలించి అరెస్ట్‌ చేయించాలని ఫిక్స్‌ అయ్యా అంటాడు..


వాడు వచ్చేలోగా ఇంట్లో డాక్యుమెంట్లు వెతుకుదాం పదా అంటాడు రాజ్‌. ఇక బెడ్‌రూమ్‌లోకి వెళతారు. అక్కడ ఫస్ట్‌ నైట్‌ కోసం బెడ్‌ అలకరించినట్లు పూలతో అలంకరించి ఉంటుంది. ఆహ..హ..హ చూడు అదే సిచువేషన్‌, అదే పూలు, అదే బెడ్‌, అదే క్యాండిల్స్‌ మీరు కావాలని లైట్స్‌ ఆఫ్ చేశారు కదా అప్పుడే అర్థమైంది నాకు అంటుంది కావ్య..నేను ప్లాన్‌ చేసిన భూత్‌ బంగ్లా కాదు అంటాడు రాజ్‌.


అయ్యాయ్యో.. ఇది ఆ ఎండీ గాడి గెస్ట్‌హౌస్‌ కాదు ఇంత బ్యాడ్‌ టేస్ట్‌ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఆ పాత భూత్‌ బంగ్లాకు ఇది జిరాక్స్‌ కాపీ అంటుండగా కావ్య రాజ్‌పై స్కిప్‌ పడుతుంది ఇద్దరూ కలిసి ఆ పూలపాన్పుపై పడతారు. ఇక బ్యాగ్రౌండ్‌లో సమయమా.. భలే సాయం చేశావమ్మ సాంగ్ వస్తుంది. అప్పుడే కారు సౌండ్‌ వినిపిస్తుంది. ఆ నంద లవర్‌ను తీసుకుని వస్తాడు.


ఇదీ చదవండి:  తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి బంపర్ గుడ్ న్యూస్.. క్యాబినెట్ మీటింగ్ భేటీలో కీలక నిర్ణయం..!  


కమాన్‌, లెట్స్‌గో అంటాడు. ఏం డార్లింగ్‌ లోపల కరెంట్‌ లేదా? అంటుంది. సెక్యూరిటీ ఇలా రా కరెంట్ లేదా అంటాడు నంద. ఇప్పుడే పోయింది సార్‌, లోపల నీకోసం ఓ సర్‌ప్రైజ్‌ ఎదురు చూస్తుంది అంటాడు. అవునా.. అని లోపలికి వెళ్తాడు. కరెంట్ వస్తుంది. రాజ్‌ ఎదురవుతాడు ఎంత ధైర్యం రా నీకు నిన్ను నమ్మ మా తాత సంతకం చేస్తే ఇంత ద్రోహం చేస్తావా? కట్రా వంద కోట్లు అని చితకబాదుతాడు. అప్పుడు రాజ్‌ను పక్కకు తోసేసి పారిపోతాడు. 


అప్పుడే వాళ్లు కూడా వెంబడించడానికి ప్రయత్నిస్తారు కానీ, కారులో పెట్రోల్‌ అయిపోతుంది. ఛా.. ఇప్పుడే జరగాలా అని బాధపడుతుంటే నంద లవర్‌ బయటకు వస్తుంది. అప్పుడు కావ్య నిజం చెప్పు వాడు ఎక్కడ ఉంటాడు అని నిలదీస్తుంది. ఏంటీ చెప్పెది వాడు పలిచాడు వచ్చాను అని పారిపోతుంది. అప్పుడు రాజ్‌ సెక్యూరిటీని అడుగుతాడు రేయ్‌...మీ బాస్‌ ఎక్కడ ఉన్నాడో తెలీదు మమ్మల్ని ఆపడం ఎందుకు అని లాగి కొడతాడు.


ఇదీ చదవండి: అలాంటప్పుడు మగాళ్లు పెళ్లికి ముందు శృంగారం చేయకూడదు.. స్టార్‌ సింగర్‌ సంచలన కామెంట్స్‌..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.