Brahmamudi Today January 1st Episode: ఎప్పుడైతే నా కోడలు చేతులో ఆ తాళాలు పడ్డాయో అప్పటి నుంచి మొదలైంది ఈ పనికిమాలిన సంత అని వెళ్లిపోతుంది అపర్ణ. చూశావా? ముసలమ్మ ఒక్కమాట అనకుండా పోయింది అత్త కోడల్ని ఎలా వెనకేసుకోస్తుందో అంటుంది రుద్రాణీ రానివ్వు దాని సంగతి చెబుతా అంటుంది ధాన్యం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఆఫీసులో సమస్యల సునామీ మొదలైంది. ఉద్యోగులు అడ్వాన్స్ అడుగుతారు అకౌంట్లో డబ్బులు లేవని చెబుతారు. దీంతో వారిలో భయం మొదలవుతుంది. వారం రోజుల్లో శాలరీ పడాలి. ఇస్తారా లేదా అనే స్థాయికి వచ్చేసింది. కొంపదీసి మూసేస్తారా? ఏంటి బోర్డు తిప్పేసిన తిప్పేస్తారు రాత్రికి రాత్రి అని మాట్లాడుతుంటారు. అప్పుడే కావ్య స్టాప్‌ ఇట్‌.. అంటుంది వదేళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ మీ అడ్వాన్స్ కోసం బోర్డు తిప్పేస్తుందా? అసలు జీతలు ఎప్పుడైనా ఒక్కరోజు ఆలస్యంగా తీసుకున్నారా? మీ పిల్లల చదువు, హెల్త్‌ అన్ని చూస్తుంది. అసలు మీలో ఒక్కరికైనా విశ్వాసం ఉందా? మీరేం రాత్రిపగలు రక్తం చిందించి చేయట్లేదు, వందేళ్ల చరిత్ర ఉన్న కంపెనీ గురించి చెడుగా మాట్లాడినవారు బయటకు వెళ్లొచ్చు అంటుంది. ఇక అందరూ సారీ చెబుతారు.


ఇదంతా రాజ్‌ గమనిస్తాడు. మరోవైపు అనామిక ఎంటర్ అవుతుంది. రాజ్‌కు వందకోట్లు ఎగనామం పెట్టాను వాడే వెతుక్కుంటూ వస్తే ఏం చేయాలి అంటాడు గోపాల్‌. అలా దొరక్కుండా మేం చెబుతాం అంటుంది అనామిక. నువ్వు బోర్డు తిప్పేయగానే నీ ఇన్వెస్టర్లు అందరూ బ్యాంక్ మీద పడతారు. నీగురించి పోలీసులు ఫారీన్‌లో వెతుకుతారు. లేకపోతే బ్యాంక్‌ పరువుపోతుందని షూరిటీ ఇచ్చిన రాజ్‌ దగ్గరే బ్యాంకు వారు కక్కిస్తారు. ఇప్పటికే రూ.25 కోట్లు కట్టేశాడు. 


ఇంక నువ్వు మూడు నెలలు ఎవరికీ కనిపించకుండా నీ పాత ఫార్మ్‌ హౌస్‌కకు వెళ్లిపో ఆ తర్వాత ఫారీన్‌ పారిపో లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తా నా లిల్లీని పిలుస్తా.. అని కాల్ చేస్తాడు. మూడు నెలలు ఎంజాయ్‌ చేద్దాం అంటాడు. మరోవైపు రాజ్‌ హమ్మయ్య ఇప్పుడు రిలీఫ్‌ దొరుకుతుంది. ఈ వంద కోట్లు మనం తిన్నది కాదు. ఆ షూరిటీ అడ్డం పెట్టుకుని వంద కోట్లు నొక్కి హ్యాపీగా తిరుగుతున్నాడు. వాడిని అంత సులువుగా వదలను ఒకఇన్‌స్పెక్టర్‌ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్‌ ఇస్తున్నాడు. నందగోపాల్ ఫారీన్‌ వెళ్లలేదు ఇక్కడే ఉన్నాడు ఇదే సిటీలో తిరుగుతున్నాడు. మల్కాజిగిరీ వద్ద సిగ్నల్స్‌ దొరికాయి. ఎలాగైనా వాడిని వెతికి పట్టుకోవాలి. 


ఇదీ చదవండి:  కేంద్రం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్‌  ధర..  


కళావతి పదా.. అని ఇద్దరూ కలిసి వెళ్తారు. మరోవైపు డైనింగ్‌ టేబుల్‌ వద్ద గొడవ మొదలవుతుంది. కాఫీతేపో అని శాంతను అడుగుతారు. రెండో కాఫీ అమ్మ అంటుంది శాంత. నోరు మూసుకుని వెళ్లికాఫీ తేపో అంటుంది రుద్రాణీ. కావ్య చేతికి పగ్గాలు రాగానే బిహేవియర్‌ మార్చేసింది. బయటకు వెళ్లడానికి కారు కూడా లేదు అంటడు రాహుల్‌. చూడు ధాన్యలక్ష్మి మన పగ్గాలు, ఆస్తులు దక్కించుకోవాలి. అది కేవలం నువ్వు తలచుకుంటేనే జరుగుతుంది అని ధాన్యాన్ని అంటుంది రుద్రాణీ. 


కారులో రాజ్‌, కావ్యలు వస్తుంటారు. ఆ బోర్డు తిప్పేసిన వాడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడా? అంటుంది కావ్య. అసలు నిన్ను ఎత్తుకుని గుండ్రంగా తిప్పేది లేకుండే బుర్ర డిస్‌లొకేట్‌ అయింది అంటాడు రాజ్‌. అసలు రేపటి నుంచి ఆఫీసుకు రాకు అంటాడు. ఇప్పటి నుంచి రాను ఆపండి.. ఆపండి అని స్టీరింగ్‌ పట్టుకుంటుంది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా ఉన్న వ్యక్తికి ఢీ కొట్టబోతుంది. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా నన్ను దింపివెళ్లండి ప్లీజ్‌ అంటాడు.


ఇదీ చదవండి:  ఫస్ట్‌రోజు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలకు మరోసారి నోటిఫికేషన్, వెంటనే దరఖాస్తు చేయండి..


అనుభవం మీద చెబుతున్న నీ భవిష్యత్తు బాగు చేయడానికి ఏ మెకానిక్‌ లేడు. రిపెయిర్‌ చేయించుకో ఆ కారును అంటాడు. సర్లే లిఫ్ట్‌ ఇస్తా అంటాడు. కారులో వచ్చి కూర్చుంటాడు రాజ్‌తోపాటు ఆ వ్యక్తి.  అడక్కుండానే అడ్డమైన క్వశ్చన్స్ లేకుండా లిఫ్ట్ ఇచ్చినందుకు సారీ అంటాడు. వైఫ్‌ అండ్‌ హస్బెండ్‌ అయితే విడవిడిగా కూర్చున్నారు అంటాడు. నాకు పెళ్లి కాలేదు అంటాడు రాజ్‌. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.