LPG Price Cut: కేంద్రం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్‌ ధర..

LPG Price Cut New Rates: కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు భారీగా తగ్గాయి. ప్రతినెలా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు ఒకటో తేదీన సవరణ జరుగుతుంది.. ఈసారి రూ.14.50 తగ్గింది. దీంతో గ్యాస్‌ సిలింర్‌ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. అయితే డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులేదు. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గాయి. కొత్త ఎల్పిజి ప్రైస్ సిలిండర్ ధరలు తెలుసుకుందాం
 

1 /5

న్యూ ఇయర్ కేంద్ర ప్రభుత్వం భారీ కానుక. జనవరి ఒకటో తేదీ ఆయిల్ కంపెనీలు ఎల్పిజి ప్రైస్ ధరలు సవరణ చేశాయి. దీంతో గ్యాస్ సిలిండరు ధరలు భారీగా తగ్గాయి.  

2 /5

డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ ధర 14 కిలోలు ఢిల్లీ ఎలాంటి మార్పు లేదు. ఇతర ప్రాంతాల్లో దాదాపు రూ. 850 నుంచి రూ.890 మధ్యలో ఉంది.  

3 /5

ముంబైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులేదు. దీంతో హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.855 ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రూ.827 విశాఖపట్నం రూ.811 వద్ద ఉన్నాయి  

4 /5

కోల్‌కతలో రూ.1980 వద్ద ఉండే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ద్వారా రూ1966 కు చేరింది. అంతకు ముందు ఐదు నెలలు వరుసగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచిన ప్రభుత్వం కొత్త ఏడాది తగ్గించి శుభవార్త చెప్పింది.  

5 /5

అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుదల లేకపోవడంతో ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పాలి. గత ఏడాది హోలీ సమయంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించారు.