Brahmamudi Serial March 8th Episode: ఈరోజు ఎపిసోడ్‌లో మోడలింగ్ విషయమై స్వప్నను నిలదీస్తుంది కావ్య. నాకేం సరదాకాదు క్రెడిట్ కార్డు బిల్లు కోసం ఇలా చేయాల్సి వచ్చింది. తల్లికొడుకులు తమకేం సంబంధం లేదన్నారు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని చెబుతుంది. వీళ్లకు ఇలానే చేయాలి..నువ్వు పద్ధతిగా ఉంటే నీకే జరిగింది అందరికీ చూలకనైపోయావు, జానా బెత్తడు లేని అనామికకు కూడా నువ్వు చులకన అదే నాజోళికి రమ్మను, మనం పేదింటి నుంచి వచ్చాం అని వీళ్లకు ఇంత చులకన అని స్వప్న కావ్యకు సమాధానం చెబుతుంది. మీ అత్త కూడా తన తోడి కోడలి మీద ఉన్న అక్కసుతో నిన్నుసపోర్ట్‌ చేస్తుంది. మళ్లీ వాళ్లు ఒక్కటై నిన్ను వంటింటి కుందేలును చేస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ఇక మరోవైపు ఇందిరా దేవి ఇంటి పరిస్థితులు భర్తతో చెప్పి బాధపడుతుంది. నేడు స్వప్న చేసిన పని రేపు అనామిక కూడా చేయొచ్చు అంటుంది. స్వప్న పరిస్థితి అలా ఉంది తన భర్త ఏ పట్టింపులు లేకుండా ఉండటంతో తప్పులేదు కదా అంటాడు దుగ్గిరాల ఇంటిపెద్ద. కానీ, ధాన్యలక్ష్మికి ఏమైంది? తనవల్ల ఇంట్లో అందరికీ సమస్యలే ఏది చెప్పినా ఇంట్లో గొడవకు కారణమవుతుంది అంటుంది. కోడలు వచ్చినప్పటి నుంచి ఇలా చేస్తుంది. అపర్ణను సాధించడానికి ఇలా చేస్తుందేమో అనిపిస్తుంది. దీనికి ధాన్యలక్ష్మి తన కొడుకును రాజును చేద్దామనుకుంటుంది అంటాడు.తనకు తెలీదు కల్యాణ్ కూడా రాజ్ తో సమానమైనవాడే అని అంటాడు. దీనికి నిజమే బావ అనామిక కూడా కల్యాణ్ ను అర్థం చేసుకోవడం లేదు అంటుంది ఇందిరాదేవి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కల్యాణ్ తన బెడ్‌రూంలో కవితలు రాస్తూ బిజీగా ఉంటాడు. అప్పుడే అనామిక వచ్చి బెడ్‌పై కూర్చుంటుంది. వెంటనే కల్యాణ్ లేచి బయటకు వెళ్లిపోతుంటాడు. ఎక్కడికి? అని అడుగుతుంది అనామిక బయట పడుకుందామని అంటాడు. ఈ గదిలో గాలి ఆడటం లేదా? అంటుంది అనామిక. అర్థం చేసుకోలేని మనుషుల మధ్య ఉండటం కంటే జైలు ఉండటమే బెట్టర్ అంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇందుకేనా? ఇంకెన్నిరోజులు నన్ను ఇలా బాధపెడతావ్ అంటుంది అనామిక. గోడవ పడితే ఏదీ దొరకదు.. ప్రేమతో దక్కించుకోవాలి అంటుంది. అది రెండు వైపుల నుంచి ఉండాలి అర్థం చేసుకోలేని మనుషుల మధ్య ఉన్నా విడిపోయినట్లే అంటాడు కల్యాణ్. మన మధ్య గొడవులున్నాయని అందరికీ చెప్పాలనుకుంటున్నారా? మొగుడుని గదిలోకి కూడా రానివ్వట్లేదని అందరూ అనుకోవాలా? అంటుంది. నీవు నిజంగా నన్ను అర్థం చేసుకున్న రోజున ఈ గదిలోనే కాదు.. నిన్ను హత్తుకొని పడుకుంటా అని వెళ్లిపోతాడు కల్యాణ్.


 దీనికి వెళ్లు ఎప్పటికైనా నేనే కరెక్ట్ అని నా దగ్గరికే వస్తావు అనుకుంటుంది అనామిక. బయట సోఫాలో వచ్చి పడుకుంటే ధాన్యలక్ష్మి గమనిస్తుంది. ఎంటి వీడిక్కడ పడుకున్నాడు? అంటే అమ్మాయికి వీడితో ఏమైనా గొడవ జరిగిందా? అని వెంటనే వెళ్లి ప్రకాశాన్ని పిలుచుకువస్తుంది. వీడేంటి ఇక్కడ పడుకున్నాడు? అంటాడు ..మన అబ్బాయి కోడలు గొడవపడ్డటున్నారు. ఇప్పుడు మీ వదిన చూస్తే ఇదే అవకాశంగా దెప్పిపొడుస్తుంది లోపల పడుకోమని చెప్పండి అంటుంది ధాన్యం. అప్పుడు ప్రకాశం.. కల్యాణ్..కల్యాణ్ అని నిద్రిస్తున్న కల్యాణ్ లేపుతాడు. ఏం నాన్న ఇంకా పడుకోలేదా? అని అడుగుతాడు కల్యాణ్. నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావ్ అంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్ నువ్వు చెబితే అర్థం చేసుకుంటుంది నచ్చచెప్పి దారికి తెచ్చుకోవాలి అంటాడు. తను వినదు నేనే తన దారిలోకి రావాలి అంటుంది అంటాడు. దూరంగా పడుకోవడానికి కారణాలు వెతుకుతున్నావ్, అలాగే దగ్గర కావడానికి కారణాలు వెతుకు అంటాడు. గుర్రన్ని నీటి దగ్గర వరకు తీసుకెళ్లొచ్చు నీటిటి తాగించలేరు కదా అని చెప్పి బెడ్‌రూంలోకి వెళ్లిపోతాడు.ఆ తర్వాత హమ్మయ్యా.. ఎవరూ చూడకముందే లోపలికి వెళ్లిపోయాడు అంటుంది ధాన్యలక్ష్మి. ఎంతసేపు ఎవరూ చూడలేదు అనుకుంటావ్.. అనామికను నువ్వు సపోర్ట్‌ చేయడం వల్లే వారి మధ్య ఈ దూరం పెరుగుతుంది అంటాడు ప్రకాశం. ముందుకు కోడలికి భర్తతో ఎలా ఉండాలో అది నేర్పించు అంటాడు. అప్పుడు ఇలా బలవంతంగా పంపించే పనిలేకుండా వాళ్లే సంతోషంగా కలిసి ఉంటారు అని వెళ్లిపోతాడు.


ఇదీ చదవండి: బుజ్జీ ప్లాన్ భలే వర్కౌట్‌ ..దుగ్గిరాల ఇంటికి కావ్యరాజ్‌లు.. రుద్రాణీపై స్వప్న రివేంజ్ మాములుగా లేదుగా..?


ఇక స్వప్న శ్వేతలు ఫోన్లో మాట్లాడుకుంటుంటారు పుట్టింటికి తీసుకెళ్లి నన్ను టార్చర్ చేయాలనుకున్నారు కాళావతి బావను అక్కడే వదిలేసి వచ్చాం. వాడి మోసం ఎలా ఉందో చూడాలి అంటాడు. ఇదంతా ఎందుకు చేశావు అంటుంది శ్వేత. నాకు వాడు నచ్చలేదు అందుకే ఇలా చేశా అంటాడు రాజ్. ఇంతలో కళావతి వస్తుంది మళ్లీ ఫోన్ చేస్తా అని పెట్టేస్తాడు రాజ్. ఏంటీ అలా ఉన్నావ్ మీ బావ రాలేడని తెగ ఫీలవుతున్నావ్ కదు అంటాడు.. నాకేం అలాంటి ఫీలేం లేదు అంటాడు. ఎంచక్కా చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ పెరిగారు కదా.. అంటాడు దీనికి నీకు చాలా ఆనందంగా ఉన్నట్లుంది అంటుంది కావ్య. మా బావని పిలవమంటే పిలుస్తా అంటుంది. ఏమవసరంలేదు కావాలంటే వీడియో కాల్ చేసి మాట్లాడుకో అక్కడే ఉండనివ్వు అంటాడు. అప్పుడే అనుకున్నది ఒక్కటి అయినది అక్కటి బోల్తా పడ్డావులే బుల్ బుల్ పిట్టా పాట పెడతాడు మీరే బాగా వినండి అని అక్కడి నుంచి వెళ్లుపోతుంది కావ్య.


ఇదీ చదవండి: బ్రాడ్ మైండ్ బావ గ్రీన్ సిగ్నల్.. బావకు స్నానం చేయించడానికి రెడీ అయిన కావ్య.. క్రెడిట్ కార్డు బిల్లు కోసం స్వప్న మళ్లీ ఆ పని..


కిచెన్లో ఉన్న కావ్యతో ఇందిరా దేవి నువ్వు చేసిన పని అస్సలు నచ్చడం లేదు అంటుంది. నువ్వు పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసరికి నా మనవడు మారిపోవాలని చెప్పాను కదా.. అంటుంది. నేను ఆడిన నాటకానికి కుళ్లుకుని అక్కడి నుంచి తీసుకువచ్చారు మీ మనవడు. కాళికి గాయం అయింది నువ్వు రాలేవు అని అక్కడే ఉంచాడు. దీనికి ఇందిరా దేవి మీ బావ రేపటి కల్లా ఇక్కడ ఉండాలి మీ బావకు ఫోన్ చేయి అంటుంది.. తప్పదంటారా? అంటుంది కావ్య అది తప్ప వేరే దారి లేదు అంటుంది ఇందిరా దేవి. సరిపోయింది.. నీ మనవడు రేపు పొద్దున మా బావను చూసి చేసే డ్యాన్స్ అంతా ఇంతా ఉండదు అంటుంది. చూడాలి రేపటి ఎపిసోడ్‌లో రాజ్ చిందులు ఎలా ఉంటాయో మరి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter