Brahmamudi Today March 6th Episode: అప్పుడే శ్వేత రాజ్ కు ఫోన్ చేసి అత్తారింటికి వెళ్లి నన్ను పూర్తిగా మర్చిపోయవు అస్సలు ఫోన్ చేయడం లేదు అంటుంది. ఇది అ రెస్టారెంట్‌లో నిన్ను చూశాను అంటుంది. కావ్యకు తన బావ ఎక్కడ ప్రపోజ్ చేస్తాడో అని తెగ కంగారుపడ్డావు. ఇప్పుడు కూడా కావ్యతోపాటు తన బావ పుట్టింటికి వెళ్లే సరికి నువ్వు వెళ్లావు అంటుంది శ్వేత. అంతలేదు అంటాడు రాజ్, నాకు చెబుతావు ఓకే మరి నీ మనస్సుకు ఏం చెబుతావు అంటుంది. నీ మనస్సులో కావ్య మీద నీకు ప్రేముంది అంటుంది. దీనికి అదేం లేదు అంటాడు రాజ్. అదంతా పక్కనబెట్టు అస్సుల ఇన్ని రోజుల తర్వాత కావ్య బావ ఇక్కడకు ఎందుకు వచ్చాడు. పని మీద వచ్చాడా? లేదా కావ్య పిలుస్తే వచ్చాడా? అని ప్రశ్నిస్తుంది. ఒకవేళ నువ్వు కావ్య విడిపోతున్నారని వచ్చాడా? గతంలో కావ్యను ప్రేమిండాడు. మీరు విడిపోయాక మళ్లీ కావ్యను దక్కించుకోవాలని వచ్చాడా? అని అడుగుతుంది. ఈ ప్రశ్నలకు రాజ్ గాబరా పడిపోతుంటాడు.
నీకు అవసరమనిపిస్తే ఈ విషయం గురించి తెలుసుకో, కావ్య నిన్ను వదిలి వెళ్లకూడదు అంటే తెలుసుకో నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటోంది శ్వేత. అంత మంచి అమ్మాయి ఒక్కసారి వెళ్లిపోయిందంటే ఎప్పటికీ తిరిగిరాదు.. బై అంటూ ఫోన్ కట్ చేస్తోంది శ్వేత. దీనిపై ఆలోచిస్తూ దిక్కులు చూస్తు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు రాజ్. ఆ తర్వాతి సన్నివేశంలో చలిమంట వేసుకుని అరుబయట కనకం ఫ్యామిలీ మొత్తం సేదతీరుతుంటారు. అప్పుడే అల్లుడుగారు ఏరి? అని కావ్య తండ్రి అడుగుతాడు. కావాలనే శ్వేతతో ఫోన్లో మాట్లాడుతున్నారు అంటుంది కావ్య. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామా? పిలవగానే వచ్చావు అని కావ్య తండ్రి భాస్కర్ ను అడుగుతాడు. మీ రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అదేం లేదు. కావ్య కాపురం బాగుంటుందంటే ఏ పని అయినా చేస్తాను అంటాడు భాస్కర్.
మరోవైపు ప్రకాశం కళ్యాణ్ ను ఫస్ట్ రోజు నీ ట్రయల్స్ ఎలా సాగింది అని అడుగుతాడు. నాలుగు రిజెక్షన్లు, ఆరు సలహాలు అన్నట్లు సాగింది అంటాడు. అందేట్రా.. అంటే ఈరోజు నేను వెళ్లినవారు కవితలు వద్దు కథలు ఉంటే చెబుతారా? అని అడుగుతున్నారు అంటాడు. దీనికి ప్రకాశం మనింట్లో రామాయణం, మహాభారతం వంటి యుద్ధలు జరుగుతుంటాయి కదా రాయలేకపోయావా? అంటాడు. దీనికి బదులుగా అలాంటి పరిస్థితి వస్తుందనే రాయనన్నాను అంటాడు కల్యాణ్. మరేం చేస్తావు అంటే ఇదే సినిమా కాదు కదా నాన్న వెళ్లగానే సాధించి తిరిగిరాడానికి అంటాడు. ఇది లైఫ్ కాస్త టైం పడుతుంది అంటాడు. ఈలోగా అక్కడికి వచ్చిన అనామిక నువ్వు లైఫంతా వెయిట్ చేసినా ఆ టైం ఎప్పటికీ రాదు కల్యాణ్ అంటూ కలగజేసుకుంటుంది. దానికి ప్రకాశం ఎంటమ్మా వాడేదో ప్రయత్నం చేస్తుంటే అలా అంటావు అంటావు. కాలంతో పాటు పరిగెత్తకుండా మీ అబ్బాయి ఇంకా కవితలు, పద్యాల దగ్గరే ఆగిపోయాడు అంటుంది. దీనికి థ్యాంక్స్ అనామిక నన్ను అర్థం చేసుకున్నావు అంటాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి మీ అన్నయ్యల ఆలోచించు గొప్పగా బతకడం ఎలాగో తెలుసుకో అని సలహా ఇస్తుంది. నువ్వు అంటున్న గొప్పదనం డబ్బు, బంగ్లాతో రాదు గుర్తుబెట్టుకో అంటాడు, సరే ట్రై చెయ్ ఫస్ట్ రోజు కదా అని వ్యతకారంగా వెళ్లిపోతుంది. దీంతో ప్రకాశం కల్యాణ్ కు సర్దిచెప్పి పంపుతాడు.
ఇదీ చదవండి: బుజ్జీప్లాన్ సక్సెస్.. గింజుకుంటున్న మిస్టర్ బడాయి..
ఈలోగా కనకం ఇంట్లో చలిమంట దగ్గరరికి వస్తాడు రాజ్. ఈలోపే కనకం స్కూల్ పిల్లల్లా ఎంత చక్కగా ముచ్చట పెట్టుకుంటున్నారు అని కావ్య భాస్కర్లను చూసి అంటుంది. దీంతో నసుక్కుంటాడు రాజ్. అప్పు ఇద్దరినీ కలిసి డ్యాన్స్ చేయమని కావ్య భాస్కర్లను అడుగుతుంది. బుజ్జీ చేస్తే నేను ఓకే అంటాడు భాస్కర్ దీనికి నీ ఇష్టమే నా ఇష్టం అంటుంది కావ్య. బావ ఏమనుకోడు అబ్రాడ్ లో చదువుకుని వచ్చాడు అంటుంది అప్పు. దీంతో డ్యాన్స్ చేయడం మొదలెడతారు కావ్యభాస్కర్లు. బ్యాగ్రౌండ్లో పాట రాజ్ ఆలోచనకు తీరు ప్లే అవుతుంటుంది. కావ్య భాస్కర్ల డ్యాన్స్ చూసి తట్టుకోలేకపోతుంటాడు. ఈలోగా కావ్య నిప్పుపై కాళు పెట్టబోతుండగా రాజ్ తన చేతులతో పక్కకు తోసేస్తాడు దీంతో భాస్కర్ ఆ నిప్పును తొక్కుతాడు. తనకు ఏం కాలేదని భాస్కర్ కు ఎక్కువగా కలిందని చెబుతున్నా కావ్యక మాత్రం రాజ్ చేయిని వదలకుండా గాయాన్ని చూస్తూ బాధపడుతుంటుంది. భాస్కర్ గాయం బాధతోనే ఆ ఇద్దరి అప్యాయతను సంతోషంగా చూస్తూ ఉండిపోతాడు..బాగా కాలిందా బాబు అని కనకం అడుగుతుంది భాస్కర్ ను సంతోషంగా ఉంది రాజ్ కావ్య కాళు కాలకుండా చెయి అడ్డుపెట్టాడు అని మాట్లాడుకుంటూ వెన్నపూస రాస్తుంది కనకం.
ఇదీ చదవండి: నడుమందాలతో కవ్విస్తోన్న ప్రభాస్ భామ మాళవిక మోహనన్.. చూస్తే చూపు తిప్పుకోలేరేమో..
మరోవైపు దుగ్గిరాల బంగ్లాలో సీన్ చూపిస్తారు. స్వప్నకు క్రెడిక్ కార్డు బిల్ రూ.50 వేలు కట్టమని వస్తుంది. దీంతో కంగారు పడి తన అత్త దగ్గరికి వస్తుంది. ఈలోగా రాహుల్ రుద్రాణీలు డబ్బుల కోసమే మాట్లాడుకుంటారు. క్రెడిట్ కార్డు బిల్ కట్టాలి డబ్బు కావాలి అంటుంది స్వప్న. నా దగ్గర కోట్లు లేవు అంటోంది. రాహుల్ నీ దగ్గర ఉన్నాయా? అంటుంది. ఎందుకు మొగిడిగా అంటుంది. నీ పుట్టింటికి ఫోన్ చేసి డబ్బు తెచ్చుకో అని సలహా ఇస్తాడు.దీంతో చేతకాని మొగుడు మూలకు ఉండాలి అని వ్యతకారంగా వెళ్లిపోతుంది స్వప్న. కనకం ఇంట్లో ఉన్న రాజ్ కు కావ్య కాఫీ ఇస్తుంది. అప్పుడే భాస్కర్ కుంటుతూ బయటకు వస్తాడు.. ఆ దృష్ట్యం చూసి ఒక్కసారిగా ఏవండీ..? అల్లుడు నడవలేకపోతున్నాడు అని కేకలు వేస్తుంది. దీంతో మళ్లీ ఊహల్లోకి వెళ్లి కనకాన్ని బెత్తం పట్టుకుని మేనల్లుడు.. మేనల్లుడు అని భాస్కర్ ని పిలవలాని పాఠాలు చెబుతుంటాడు. ఇక ఊహల్లోంచి బయటకు రాగానే అయ్యో బావ ఎలా నడుస్తావు అంటూ భాస్కర్ దగ్గరకు వెళ్తుంది. జీవిత సత్యాలు, నివురుగప్పిన నిప్పు అంటూ హిత బోధ చేస్తూంటాడు రాజ్. నిజాన్ని దాచడం కష్టం. తనదాక వచ్చే వరకు తెలీదు అని చెబుతుంటాడు. బయటకు ఎందుకు వచ్చావు బావ అని అప్పుడు అడుగుతుంది అప్పు. స్నానం చేయడానికి అంటాడు. పద బావ నేను చేయిస్తా అంటుంది కావ్య.. దీనికి నో... నేను తీసుకెళ్తాను అంటాడు రాజ్. భాస్కర్ ను పట్టుకుని స్నానానికి తీసుకెళ్తుంటాడు అందరూ వెనకాల నుంచి చూస్తూ నవ్వుకుంటుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter