Brahmanandam Election Campaign at Karnataka: మరికొద్ది రోజుల్లో జరుగుతున్న కర్ణాటక ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ తలపడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ సినీ నటులను తమ తమ ప్రచారాల కోసం కూడా వాడుకుంటున్నాయి. ఇప్పటికే బిజెపి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రచారం చేయడానికి ముందుకు రాగా ఇతర హీరోలు కూడా కొంతమంది తమకు నచ్చిన వారి కోసం ప్రచారం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఒక రకంగా సినీ తారలందరూ తాము సపోర్ట్ చేస్తున్న పార్టీలకు లేదా వ్యక్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా కన్నడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. బిజెపి అభ్యర్థి తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటక వైద్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ పేరు మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే నందమూరి తారకరత్న అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని నారాయణ హృదయాలయంలో చికిత్స పొందుతున్న సమయంలో సుధాకర్ అన్ని తానే వ్యవహరించారు.


అలాంటి సుధాకర్ ఇప్పుడు కర్ణాటక తెలుగు రాష్ట్రాల బోర్డర్ అయిన చిక్బల్లాపూర్ లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనకు మద్దతు పలుకుతూ బ్రహ్మానందం చిక్బల్లాపూర్ వెళ్లి అక్కడ ప్రచారం చేస్తూ సందడి చేశారు. డాక్టర్ సుధాకర్ ని గెలిపించాలని కోరుతూ బ్రహ్మానందం రోడ్డుపై ప్రచారం చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి చిక్కుబళ్లాపూర్ నియోజకవర్గంలో చాలామంది తెలుగు మాట్లాడే వారు ఉంటారు.


Also Read: Ileana Dcruz Baby Bump: బేబీ బంప్ వీడియో షేర్ చేసిన ఇలియానా.. ఇంతకీ తండ్రెవరు?


ఈ నేపద్యంలో బ్రహ్మానందం తెలుగులో మాట్లాడుతూ అక్కడివారిని ఓట్లు అభ్యర్థించారు. వైద్య శాఖలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ను ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నానని, ఎన్నో వైద్య సేవలు అందించి కర్ణాటక గురించి దేశమంతా మాట్లాడుకునే చేసిన సుధాకర్ కు ఓటు వేసి గెలిపించండి అని బ్రహ్మానందం కోరారు. మంచితనం, సేవలు చూసి మాలాంటి వారందరూ ఆయనకు అండగా నిలబడి గెలిపించుకునేందుకు వచ్చామని, ఆయనకు ఓట్లు వేసి గెలిపించండి అని బ్రహ్మానందం కోరారు.


ఇక ఖాన్ తో గేమ్స్ ఆడొద్దు అంటూ తనదైన కామెడీతో కర్ణాటక ఎన్నికల్లో బ్రహ్మానందం ప్రచారం ప్రారంభించారు. ఇక ఈ రోజు ఉదయాన్నే ప్రచారం ప్రారంభించిన బ్రహ్మానందం రాత్రి 10 గంటల వరకు ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత రాత్రి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. ఇక బ్రహ్మానందాన్ని చూసిన అక్కడ వారందరూ ఆయనతో ఫోటోలు దిగేందుకు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు ఏ ఒక్క పార్టీకి కానీ, వ్యక్తికి గాని ఇలా ప్రచారం చేయమని కోరని బ్రహ్మానందం కర్ణాటక వెళ్లి బిజెపి అభ్యర్థికి ప్రచారం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.


అయితే ఆయన ఇలా ప్రచారం చేసేందుకు కర్ణాటక వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. 2019వ సంవత్సరంలో కూడా బ్రహ్మానందం కర్ణాటక ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇదే డాక్టర్ సుధాకర్ను గెలిపించాలని ప్రజలను కోరారు. నిజానికి బ్రహ్మానందం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో చేరే అవకాశం ఉందని 2019 ఎలక్షన్ ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బిజెపి తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అప్పుడు పెద్ద ఎత్తున సినీ తారలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. కానీ నిజానికి అవేమీ నిజం కాలేదు. కానీ ఇలా కర్ణాటక నేత కోసం బ్రహ్మానందం వెళ్లి ప్రచారం చేయడం టాలీవుడ్ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అవుతుంది. 


Also Read: Rashmika Mandanna Dating: బెల్లంకొండ డేటింగ్ రూమర్స్ పై రష్మిక సైలెన్స్.. ఎందుకబ్బా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook