Rashmika Mandanna Dating: బెల్లంకొండ డేటింగ్ రూమర్స్ పై రష్మిక సైలెన్స్.. ఎందుకబ్బా?

Rashmika Mandanna Silence on Dating Rumors: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారనే వార్తలను బెల్లంకొండ ఖండించారు కానీ రష్మిక మందన్న సైలెంట్ గా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.   

Written by - Chaganti Bhargav | Last Updated : May 4, 2023, 05:58 PM IST
Rashmika Mandanna Dating: బెల్లంకొండ డేటింగ్ రూమర్స్ పై రష్మిక సైలెన్స్.. ఎందుకబ్బా?

Rashmika Mandanna Silence on Bellamkonda Dating Rumors: కన్నడ సినిమాల ద్వారా హీరోయిన్ గా లాంచ్ అయ్యి తర్వాత తెలుగులో సూపర్ స్టార్ డం తెచ్చుకున్న రష్మిక మందన బాలీవుడ్ లో అడుగు పెట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకానొక సందర్భంలో నేషనల్ క్రష్ గా మారిన ఆమె బాలీవుడ్లో తన సినిమాలతో ఏ మాత్రం అక్కడివారిని ఆకట్టుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఆమె గురించి ఎలాంటి వార్త వచ్చినా అది వెంటనే వైరల్ అయిపోతూ వస్తోంది.

ఇప్పటివరకు బాలీవుడ్ లో ఆమె చేసిన ఏ ఒక్క సినిమా కూడా మీకు కలిసి రాలేదు కానీ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రూపొందుతున్న యానిమల్ సినిమా మీద ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన అని హీరోయిన్గా నటిస్తోంది. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎవరైతే రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఇప్పుడు చత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరూ ఆడపాదడపా కలిసి కెమెరా కంట కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ లో ఊపందుకున్నాయి.

తాజాగా చత్రపతి సినిమా ప్రమోషన్స్ లో రష్మిక మందన డేటింగ్ వ్యవహారం మీద ఆయన స్పందించారు. తాను రష్మిక మందనమి కలిసేది అప్పుడప్పుడేనని, అలాగే ఒక రెండు సార్లు కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించి ఉండొచ్చు కానీ మేమిద్దరం డేటింగ్ చేయడం లేదని కుండ బద్దలు కొట్టాడు బెల్లంకొండ. ఇద్దరం హైదరాబాదు- ముంబై తిరుగుతూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఒకే ఫ్లైట్లో ప్రయాణించి ఉండవచ్చు అంతకుమించి మా మధ్య ఏమీ లేదని చెప్పుకొచ్చాడు.

Also Read: Nora Fatehi Photos: బాడీ ఫిట్ జిమ్ వేర్లో నోరా అదిరే అందాలు.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!

అయితే బెల్లంకొండ ఇలా క్లారిటీ ఇచ్చుకున్నాడు కానీ రష్మిక మందన మాత్రం ఈ విషయం మీద స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికే విజయ్ దేవరకొండ తో డేటింగ్ వార్తల వల్ల విసిగిపోయిన ఆమెకు ఇప్పుడు బెల్లంకొండతో డేటింగ్ రూమర్స్ కూడా తలనొప్పిగా మారాయి అని అంటున్నారు. అంతేకాక ఇలా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రష్మికతో డేటింగ్ వార్తల మీద స్పందించడం కూడా చత్రపతి సినిమాని మరింత బాలీవుడ్ జనాల్లోకి తీసుకువెళ్లేందుకే అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది.

అందుకే రష్మిక ఈ వ్యవహారం మీద స్పందించకపోయినా ఆయనే చొరవ తీసుకొని ఇలా కామెంట్లు చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ నటిస్తున్న బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా ఆమె గురించిన అన్ని వార్తలు బాలీవుడ్ వారు బాగా ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి గురించి వచ్చిన వార్తల మీద కనుక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పందిస్తే ఆ వార్తలు జనాల్లోకి వెళ్లి సాయి శ్రీనివాస్ ఇప్పుడు చత్రపతి అనే సినిమాని బాలీవుడ్ లో రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అనే విషయం కూడా ప్రేక్షకుల వరకు వెళుతుంది.

అలా తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రష్మిక మందన్న పేరు అక్కడి పీఆర్ ఏజెన్సీల మాట మేరకు తీశాడు ఏమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ విధంగా చత్రపతి సినిమాని అక్కడ రీమేక్ చేసి వదలడానికి కారణం కూడా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన చాలా సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే యూట్యూబ్లో కొద్దీ వ్యూస్ దక్కించుకున్నాయి. దాని చొరవతో ఇప్పుడు బెల్లంకొండ ఏకంగా ఛత్రపతి సినిమాతోనే వాళ్ళ ముందుకు వెళుతున్నాడు. 

Also Read: Mrunal Thakur Photos: 'స్వర్గం'లోనే దొరుకుతానంటూ సెగలు రేపే ఫోటోలు షేర్ చేసిన మృణాల్ ఠాకూర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News