Brahmastra collections are sensational in Telugu states: అలియా భట్ రణబీర్ కపూర్ జంటగా రూపొందిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాని బ్రహ్మాస్త్రం పేరుతో తెలుగులో విడుదల చేశారు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తూ విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా సరే సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం పురాణాలలో, ఇతిహాసాలలో చదువుకున్న అస్త్రాలతో నేటి ఆధునిక సమాజానికి కలుపుతూ ఒక కల్పిత కథ రాసుకున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ దాన్ని అందంగా తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. కథ కాస్త సాగదీసిన భావన కలిగినా  సరే ప్రేక్షకులు ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కి ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది. హిందీ వర్షన్ మొదటి రోజు ₹ 31.5  కోట్ల నెట్, రెండో రోజు ₹ 37.5 కోట్ల నెట్, మూడో రోజు ₹ 39.5 కోట్ల నెట్ సంపాదించింది.


ఇక దేశవ్యాప్తంగా మిగతా భాషలలో మొదటి రోజు ₹ 17.15 కోట్ల అంచనా, 2వ రోజు ₹ 20.73 కోట్ల అంచనా, 3వ రోజు ₹ 21.63  కోట్ల అంచనా మేర వసూలు అయ్యాయని అంటున్నారు. ఇక తెలుగులో కూడా ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్ల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏకంగా మూడు రోజులకు గాను 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి మునుపెన్నడూ లేని విధంగా బాలీవుడ్ సినిమా తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించినట్లయింది. ఇక ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గనుక జరిగి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించేది అనే ప్రచారం జరుగుతుంది. 


Also Read: Pooja Hegde Trolled: పూజా నటనకు అవార్డా.. కొనేసుకుందేమో బాసూ.. పాపం ఆడేసుకుంటున్నారుగా!


Also Read: IBomma Restarted: సినీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఐబొమ్మ మళ్లీ మొదలయింది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి