Pooja Hegde Trolled: పూజా నటనకు అవార్డా.. కొనేసుకుందేమో బాసూ.. పాపం ఆడేసుకుంటున్నారుగా!

Pooja Hegde Being Trolled for Getting SIIMA 2022 Best Heroine Award: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీకి గాను బెస్ట్ హీరోయిన్ అవార్డు అందుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ట్రోలర్లకు టార్గెట్ అయింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 12, 2022, 12:25 PM IST
Pooja Hegde Trolled: పూజా నటనకు అవార్డా.. కొనేసుకుందేమో బాసూ.. పాపం ఆడేసుకుంటున్నారుగా!

Pooja Hegde Being Trolled for Getting SIIMA 2022 Best Heroine Award: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా ఆమె ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక డిజాస్టర్ మూటగట్టుకుంది. ఎఫ్3 సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కూడా ఆమె మెరిసింది. అయితే పూజా హెగ్డే కి తాజాగా సైమా అవార్డు లభించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి గాను బెస్ట్ హీరోయిన్ అవార్డు దక్కించుకుంది.

అయితే ఈ నేపథ్యంలో ఆమెను సాయి పల్లవి ఫ్యాన్స్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో ఆమె నటించిన పాత్ర అంత ఛాలెంజింగ్ పాత్ర ఏమీ కాదు. ఒక సాధారణ మోడ్రన్ అమ్మాయి పాత్రలో పూజా హెగ్డే నటించింది. అలాంటి సినిమాకి సైమా అవార్డులలో నామినేషన్ లభించింది. కానీ మా సాయి పల్లవి నటించిన శ్యాం సింగరాయ్ సినిమా ఎందుకు నామినేషన్లలో లేదు అని వారు ప్రశ్నిస్తున్నారు.

పూజా హెగ్డే లాంటివారు డబ్బులు ఇచ్చే ఈ అవార్డులలో నామినేషన్స్ తెప్పించుకోవడమే కాక అవార్డులు కూడా కొనుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ అవార్డు కూడా పూజాకు అలా వచ్చిన అవార్డే అని వారు ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవానికి సైమా అనేది ఒక లాభా పేక్షతో నడిచే వ్యాపార సంస్థ అని, ఎవరికి అవార్డులు ఇస్తే తమకు ఉపయోగం ఉంటుందో అంచనాలు వేసుకుని వారికి అవార్డులు ఇచ్చుకుంటారని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి అసలు సాయు పల్లవి నటించిన సినిమా నామినేట్ అవలేదు. అలాంటప్పుడు సాయి పల్లవికి  అవార్డు రాలేదని బాధపడటం, ఆ పేరుతొ వేరే ఎవరినో ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. నిజానికి నామినేషన్ల సమయంలోనే సాయి పల్లవి అభిమానులు అలాగే ఇతర నామినేషన్ దక్కించుకోని హీరో హీరోయిన్ల అభిమానులు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని తెర మీదకి తీసుకురావడం అనేది హాట్ టాపిక్ గా మారింది. 

Also Read: IBomma Restarted: సినీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఐబొమ్మ మళ్లీ మొదలయింది!

Also Read: Soundarya Rajinikanth Baby Boy: మరోసారి తాతైన రజనీకాంత్.. మళ్లీ మనవడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News